Home breaking news తెలంగాణ ఆర్టీసీ ప్రైవేట్​పరం.. ఇక రిటైర్మెంట్లే.. కొత్త కొలువులుండవు

తెలంగాణ ఆర్టీసీ ప్రైవేట్​పరం.. ఇక రిటైర్మెంట్లే.. కొత్త కొలువులుండవు

82
0

ఆర్టీసీలో 30 శాతం  రూట్లు ప్రైవేటు పరమవుతున్నాయి. ఈమేరకు ఉన్నతాధికారులకు రవాణ శాఖ ప్రతిపాదనలు అందించింది. న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ అక్టోబర్​ 5 నుంచి ఆర్టీసీ కార్మికులు నిరవధికంగా సమ్మె చేస్తున్నారు. ఇప్పటికే కొత్త బస్సులను కొనుగోలు చేయకుండా.. అద్దె బస్సులను నింపుతున్న సర్కారు ఇప్పుడు ఏకంగా రూట్లనే ప్రైవేటుకిచ్చేయడానికి ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగానే.. టెండర్​ నోటిఫికేషన్​ వేయడం.. పెద్ద ఎత్తున్న దరఖాస్తులు రావడం జరిగిపోయింది. ఆ తర్వాత ఏఏ రూట్లను ప్రైవేటుకు ఇవ్వాలో.. అధికారులు నిర్ణయించారు. దూర ప్రాంతాలకు సంబంధించి సర్వీసులన్నీ ప్రైవేటుకే ఇవ్వాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాలు.. హైదరాబాద్​, వరంగల్​ వంటి నగరాల్లోని సిటీ బస్సులు మాత్రం ఆర్టీసీ నడిపిస్తుంది.

లాభాల రూట్లు ప్రైవేటుకు..

ఇటీవలే రాష్ట్ర రవాణా శాఖ ఉన్నతాధికారులు.. హైదరాబాద్​లో నిర్వహించిన సమావేశానికి అన్ని జిల్లాల  రవాణా శాఖాధికారులు హాజరయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 30 శాతం రూట్లను ప్రైవేటుకు ఇవ్వడానికి ప్రతిపాదించారు. వీటిలో ఏపీలోని విజయవాడ, శ్రైశైలం, కర్నూలు, తిరుపతి, కర్ణాటకలోని బెంగళూరు, మహారాష్ట్రలోని ముంబాయి, షిర్డీ తదితర పెద్ద నగరాలు.. రాష్ట్రంలోని లాభాలు వచ్చే దూర ప్రాంతాల రూట్లను డిపోల వారిగా గుర్తించి వాటిని ప్రైవేటుకు ఇవ్వాలని ప్రతిపాదించారు. దూర ప్రాంతాలకు నడిచే బస్సుల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండి.. లాభాలు వచ్చేవీ కావడంతో వీటిని ప్రైవేటుకు ఇవ్వాలని ప్రతిపాదించారు. గ్రామీణ ప్రాంతాల రూట్లలో కలెక్షన్లు తక్కువ కాబట్టి.. వీటిని మాత్రం ప్రైవేటుకు కేటాయించకుండా ఆర్టీసీ బస్సులు నడిచే విధంగా అధికారులు ప్రతిపాదనలు అందించారు.

ప్రస్తుతం ఆర్టీసీలో 10,400 బస్సులున్నాయి. వీటిని మూడు రకాలుగా విభజించి నడపనున్నారు. 50 శాతం బస్సులు అంటే 5200 పూర్తిగా ఆర్టీసీకి చెందినవి.  ఆర్టీసీ యాజమాన్యంలోనే వుంటాయి. మరో 20 శాతం అద్దె రూపేణా తీసుకుని వాటిని కూడా పూర్తిగా ఆర్టీసీ పర్యవేక్షణలోనే, ఆర్టీసీ పాలన కిందే నడపడం జరుగుతుంది. వాటిని వుంచడం కూడా ఆర్టీసీ డిపోలలోనే. 30 శాతం రూట్లు ప్రైవేటుకు అంటే 3100 బస్సులు, ప్రయివేట్ స్టేజ్ కారేజ్ విగా అనుమతి ఇస్తారు. ఆర్టీసీ చార్జీలు, ప్రయివేట్ బస్సుల చార్జీలు సమానంగా, ఆర్టీసీ నియంత్రణలోనే ఉంటాయని చెబుతున్నా.. తమకు సరిపోవడం లేదని ప్రైవేట్​ ఆపరేటర్​ ఆర్టీసీని సంప్రదించి.. అనుమతితో పెంచుకునే వెసులుబాటు కల్పించింది. చార్జీలు పెంచుకోవడానికి. ఆ భారం ప్రయాణికులపై వేయడానికి పరోక్షంగా సర్కారు అవకాశమిచ్చింది. ఇక భవిష్యత్​లో ఆర్టీసీలో కొత్త బస్సులు కొనరు.. ఇప్పుడున్న వారే పదవీ విరమణ చేయడమే కానీ కొత్త నియామకాలు ఉండవు. ఇక ఆర్టీసీ కథ ముగిసినట్టే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here