Home ఎడ్యుకేషనల్/జాబ్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మండల ప్రజా పరిషత్ వ్యవస్థ

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మండల ప్రజా పరిషత్ వ్యవస్థ

262
0
మండల పరిషత్​ కార్యాలయాలం

–వికాస్​ రుషి

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 30 మే 1994 నుంచి అమల్లోకి వచ్చింది. దీన్నే ‘నూతన పంచాయతీరాజ్ చట్టం’ అని అంటారు. తెలంగాణ రాష్ట్రంలో 589  మండలాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 668 మండలాలు ఉన్నాయి.

ప్రతీ మండలానికి సంబంధించిన పరిపాలనా విభాగాన్నే మండల పరిషత్తు అని అంటారు. ఒక్కో మండల పరిషత్తును సుమారు 40 వేల జనాభాతో దాదాపు 20, 30 గ్రామాలతో ఏర్పాటు చేస్తారు. మండల జనాభాను బట్టి ఆ మండలంలో ప్రాదేశిక నియోజకవర్గాలను ఏర్పాటు చేస్తారు. ప్రతీ నియోజకవర్గంలో 3,500 జనాభా ఉంటుంది.  వీరు.. ఎంపీటీసీని ఎన్నుకుంటారు.   మండల పరిషత్‌లో కనిష్ఠంగా ఏడుగురు, గరిష్ఠంగా 23 మంది ఎంపీటీసీలుంటారు. ఈ సభ్యులు  ఒకరిని అధ్యక్షుడి(ఎంపీపీ)గా, ఒకరిని ఉపాధ్యక్షుడి(వైఎస్​ ఎంపీపీ)గా, కో-ఆప్టెడ్ సభ్యుడిగా ఒక మైనారిటీ సభ్యుడిని ఎన్నుకుంటారు. మండల పరిషత్ కాలపరిమితి, సభ్యుల కాలపరిమితి కూడా అయిదేళ్లుంటుంది. మండల పరిషత్​…  గ్రామాల్లో అభివృద్ధి పనులను గుర్తించి అమోదిస్తుంది. మండల పరిషత్తులో   సభ్యులుగా.. ఎంపీటీసీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, రాజ్యసభ సభ్యుడు, కో ఆప్షన్ సభ్యుడు, కలెక్టర్, సర్పంచ్లు, జడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్ సమావేశాలకు హాజరు కావచ్చు. కానీ వీరందరికీ ఓటు హక్కు ఉండదు.

తాలూకా వ్యవస్థ: మండల వ్యవస్థకు ముందు తాలుకా వ్యవస్థ ఉండేదీ. తాలుకా వ్యవస్థ ఉన్న రోజుల్లో ప్రస్తతమున్న నాలుగైదు మండలాలు కూడా తాలుకాలో ఉండేవీ. కొన్ని గ్రామాలు దాదాపు 50 కిలోమీటర్ల దూరం వరకూ ఉండేవీ. ఆ గ్రామాల నుంచి ప్రజలు తాలుకాకు రావడానికి అనేక ఇబ్బందులు పడేవారు. 1983లో ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్​ బాధ్యతలు చేపట్టిన తర్వాత మండల​ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీన్నే మండల ప్రజా పరిషత్​ అని పిలుస్తున్నారు. తొలుత ఈ వ్యవస్థలో ప్రత్యక్ష పద్దతిలో ఎంపీపీని ఎన్నుకునే వారు. ఆ తర్వాత పరోక్ష పద్దతికి మార్చారు. ఈ కారణం వల్ల అవిశ్వాస తీర్మానం.. పదవీ వ్యామోహం  పెరిగి.. అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడం.. తరచూ ఎంపీపీలు మారడం జరుగుతోంది.

అవిశ్వాస తీర్మానం: మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షులపై ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానంపై మొత్తం సభ్యుల్లో కనీసం సగం మంది సంతకాలు పెట్టాల్సి ఉంటుంద. మొత్తం పదవీకాలంలో ఒక వ్యక్తిపై ఒకసారి కంటే ఎక్కువసార్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టకూడదు. సభ్యుల్లో 2/3వ వంతు ఆమోదం తెలిపితే అవిశ్వాస తీర్మానం నెగ్గుతుంది. ఎంపీపీ, వైఎస్​ ఎంపీపీల పదవీ కాలం నాలుగేళ్లు ముగిసిన తర్వాత అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. పదవిని కోల్పోయిన లేదా రాజీనామా చేసినప్పటికీ రెండేళ్ల లోపు వారిపై విచారణ పూర్తి కావాలి.

ఎంపీడీవో విధులు: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల్ని అమలు చేయడం, మండల పరిషత్ తీర్మానాల్ని అమలు చేయడం, నెలకోసారి మండల పరిషత్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం, చివరి సమావేశం జరిగిన తేదీ నుంచి 90 రోజుల లోపల మరొక సమావేశం ఏర్పాటు చేయనట్లయితే ఎంపీడీవోపై రాష్ట్రప్రభుత్వం క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here