Home breaking news తెలంగాణ‌కు కొత్త అర్భ‌న్ పాల‌సీ- త్వ‌ర‌లో అసెంబ్లీ

తెలంగాణ‌కు కొత్త అర్భ‌న్ పాల‌సీ- త్వ‌ర‌లో అసెంబ్లీ

235
0
ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర‌రావు

హైదరాబాద్: తెలంగాణకు కొత్త అర్బ‌న్ పాల‌సీ రూపొందనుంది. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఉన్న‌తాధికారుల‌తో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌త్యేక స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అర్బన్, రూరల్, రెవెన్యూ పాలసీలతో పాటు కార్పొరేషన్‌ల కోసం కొత్త చట్టాల రూపకల్పనపై సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. అవినీతికి చోటు లేకుండా పార‌ద‌ర్శ‌కంగా ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందేలా ప్ర‌ణాళికలు రూపొందించాల‌ని ఆదేశించారు.

కొత్త అర్బన్ పాలసీలో భాగంగా కొత్త‌గా మున్సిపల్ చట్టం, కార్పొరేషన్ చట్టం, హైదరాబాద్ నగర కార్పొరేషన్ చట్టం తీసుకురావాలని సూచించారు. హెచ్‌ఎండబ్ల్యూఏతో పాటు ఇతర నగరాల అభివృద్ధి సంస్థల పాలనకు సంబంధించి కూడా కొత్త చట్టం రూపొందించాల‌ని ఆదేశించారు. ఇందుకోసం త్వరలోనే అసెంబ్లీని సమావేశ పరిచి కొత్త చట్టాలు తెస్తామని తెలిపారు. నిధుల ఖ‌ర్చు విష‌యంలో ఇష్ట‌మొచ్చిన‌ట్టు కాకుండా.. ప్రాధాన్యాల‌కు అనుగుణంగా ఖ‌ర్చు చేయాల‌ని అధికారుల‌కు సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here