Home తాజా వార్తలు తెలంగాణలో నిలకడలేని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు

తెలంగాణలో నిలకడలేని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు

134
0

అప్పుడెప్పుడో ఓ మహాకవి పదండి పోదాం పదండి పోదాం పైపైకి ఇది పాజిటీవ్​ దృక్ఫతంతో రాశారు. ఈ వ్యాఖ్యలు కమ్యూనిస్టులను ఉద్దేశించే రాశారు తప్ప.. ఇతర పార్టీలను ఉద్దేశించి మాత్రం కాదు. దీనికి అనుగునంగా కమ్యూనిస్టు పార్టీలు ముందుకు సాగుతున్నాయి. పైపైకీ బదులు.. కిందికి వెళ్తున్నాయి. ఒక్క తెలంగాణలోనే కాదు. దేశమంతా ఇదే పరిస్థితి. ఇప్పుడు తెలంగాణ పరిస్థితి మాత్రమే మనం ప్రస్తావనకు వస్తున్నాము. అందునా హుజూర్​నగర్​ ఉప ఎన్నిక మాత్రమే. కలిసికట్టుగా ఉద్యమాలు అన్నమాటకే సీపీఐ, సీపీఐ కట్టుబడి ఉన్నాయి. కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలన్న విషయంలో అవి దూరంగానే ఉన్నాయి.

హుజూర్​నగర్​ ఎన్నికల విషయంలో తాము పోటీ చేస్తామని ఎవరికీ మద్దతీయమని సీపీఎం చెప్పింది. దాని ప్రకారమే.. తమ అభ్యర్థితో నామినేషన్​ కూడా వేయించింది. కానీ దేశంలో ఎక్కడా జరగని విధంగా వాళ్ల నామినేషన్​ తిరస్కృతికి గురైంది. దీని వెనుక ఆ పార్టీ అధినాయకత్వమే ఉందన్న ప్రచారం విస్తృతంగా సాగింది. టీఆర్​ఎస్​ నుంచి వచ్చిన కొన్ని హామీల కారణంగా ఇలా చేశారని, సుదీర్ఘ చరిత్ర కలిగిన సీపీఎం పార్టీకి చెందిన అభ్యర్థి నామినేషన్​ను తిరస్కరించడమేమిటన్న ప్రచారం. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ రాష్ట్ర నాయకత్వం హడావుడిగా అభ్యర్థిని, అతడితో పాటు జిల్లా కార్యదర్శిని కూడా పార్టీ నుంచి సస్పెండ్​ చేసింది. తామే సృష్టించిన బీఎల్​ఎఫ్​ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థికి కాకుండా వేరే పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. అది చూసినోళ్లు హౌరా అని అనుకుంటున్నరు.

ఇక సీపీఐ విషయానికొస్తే.. వాళ్లకు ఎమ్మెల్సీ ఇస్తామని ఆఫర్​ సీఎం కేసీఆర్​ చేసిండు. (నిజమా.?) మద్దతు కోరి సీపీఐ ఆఫీసుకు టీఆర్​ఎస్​ సెక్రటరీ జనరల్​, ఎంపీ కేశవరావు వచ్చిండు. చర్చించుకొని చెబుతామన్నరు సీపీఐ సెక్రటరీ చాడా వెంకటరెడ్డి. చివరకు మద్దతు ప్రకటించిండు. ప్రచారం కూడా చేస్తానన్నడు. ఇక్కడే హుజూర్​నగర్​ శాఖ.. మద్దతొద్దు అని మొత్తుకున్నది. ఆళ్లకు నచ్చజెప్పి ఒప్పించుండ్రు.  ఇక్కడి వరకూ బాగానే ఉంది. కానీ ఈ నెల 5న మొదలైన ఆర్టీసీ సమ్మె కేసీఆర్​ కంటే సీపీఐకే బాగా ఇరకాటంలోకి నెట్టింది. ఆ పార్టీ అనుబంధ సంఘం ఎంప్లాయిస్​ యూనియన్​ సమ్మెలో ఉండడం. ఊగిసలాడిన సీపీఐ.. ఆర్టీసీ కార్మికులను సస్పెండ్​ చేశానని ప్రకటించినందున మద్దతీయనని ప్రకటించింది. ఇది చూసిన హుజూర్​నగర్​ సీపీఐ శాఖ.. మేము మద్దతీయమంటే ఇయ్యమంటరు. ఇప్పుడిస్తుంటే.. వద్దంటరా.? చత్​ మాదారి మాదే అన్నట్టుగా ఇంటర్నల్​గా తాఖీదు పంపింది. ఆ వెంటనే లేదు లేదు టీఆర్​ఎస్​కు మద్దతిస్తున్నమని మళ్లీ ప్రకటించింది.

ఈళ్లు మద్దతు ప్రకటన ఇలా చేశారో లేదో ఒక డ్రైవర్​ కిరోసిన్​ పోసుకొని నిప్పటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకోగాయన.. ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నడు. ఈ రెండు ఘటనలతో వెంటనే సీపీఐ మళ్లీ రివర్సై టీఆర్​ఎస్​ అభ్యర్థికి మద్దతీయమని చెప్పింది. వీళ్ల నిలకడ లేని తనానికి ఇది తాజా ఉదహారణ మాత్రమే. ఇటువంటివి గతంలో ఎన్నో ఉన్నాయి. ప్రతి ఎన్నికలకో సారి మద్దతిచ్చే పార్టీని మార్చుకోవడం. ఇలా మార్చి మార్చి.. చివరకు పాతాళానికి జారి పోతున్నరు. ఇప్పట్లో వీరు పైకి రావడం కష్టమే.

రాబోయే తరాలను ప్రభావితం చేస్తుందా..? అయినా ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. రెండు సీట్లున్న బీజేపీ ఫుల్​ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని ఎవరైన అనుకున్నరా.? ప్రభావం చూపే కమ్యూనిస్టులు పాతాళానికి పోతరని అనుకున్నరా.? కాంగ్రెస్​ ఇలా దీనస్థితికి చేరుకుంటుందని ఎవరైన అనుకున్నరా.? ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్టుగా కమ్యూనిస్టులు నిలకడగా ఉండి మళ్లీ పైకి వస్తారేమో..? ఏం జరుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here