Home breaking news తెలంగాణలో ఏపీ మందు పాలసే.. ఇక సర్కారు బ్రాందీ షాపులు

తెలంగాణలో ఏపీ మందు పాలసే.. ఇక సర్కారు బ్రాందీ షాపులు

343
0

ఆదిత్య 369 సినిమా గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో ఒకసారి కాలం వెనక్కి తిరిగుతుంది. మరోసారి ముందుకు పోతుంది. మొన్న ఏపీలో తిరిగితే.. ఇప్పుడు తెలంగాణలో కూడా కాలం వెనక్కి తిరిగింది. ఎన్టీఆర్​ ముఖ్యమంత్రిగా ఉండగా.. అంతకు ముందు కూడా ఉమ్మడి రాష్ట్రంలో సారా దుకాణాలను సర్కారే నిర్వహించేదీ. ఎన్టీఆర్​ హయాంలో ‘వారుణీ వాహినీ’ పేరుతో సారాయి దుకాణాలు నడిపించేవారు. ప్యాకెట్లలో సారా అమ్మేవారు. ఆ తరువాత ఏకంగా మద్య నిషేధం విధించారు. ఆ దెబ్బకు ఎన్టీఆర్​ ముఖ్యమంత్రి పదవీ కూడా పోయింది. లక్ష్మీ పార్వతిని బూచిగా చూపించి.. చంద్రబాబు అధికారంలోకి వచ్చారు.  బ్రాందీ షాపులు కూడా తెరుచుకున్నాయి. ఇదంత గతం.

ప్రస్తుత విషయానికొస్తే.. ఏపీలో జగన్​ అధికారంలోకి వచ్చిన తర్వాత మందు పాలసీని మార్చేశారు. అక్కడ ప్రభుత్వమే బ్రాందీ షాపులు నిర్వహిస్తోంది. తెలంగాణలో సెప్టెంబర్​లోనే రావాల్సిన మద్యం పాలసీ ఇంకా రాలేదు. ఉన్న దుకాణాలను మరో నెల పొడిగించారు. ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చిన విషయమేమిటంటే.. తెలంగాణ సర్కారు కూడా బ్రాందీ షాపులను నిర్వహించాలని ఆలోచన చేసింది. ఈ మేరకు అధికారులు ప్రపోజల్స్​ కూడా రడీ చేశారు. బ్రాందీ షాపులు పెరగవు కానీ, బార్​లు పెరుగుతాయి. ఒక్కో కొత్త మునిసిపాలిటీకి ఒక్కో బార్​ పెరుగుతుంది.  బ్రాందీ షాపుల్లో టీఆర్​ఎస్​కు చెందిన వారే.. ఎంప్లాయ్​గా ఉంటారు. ఒక రకంగా కార్యకర్తలకు ఉపాధి కల్పన ప్రోగ్రాం ఇది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here