Home breaking news తెలంగాణలోనే కాదు.. ఎక్కడ చూసినా.. అన్యమత ప్రచారమే..

తెలంగాణలోనే కాదు.. ఎక్కడ చూసినా.. అన్యమత ప్రచారమే..

170
0

= వికాస్​ రుషి

ఏపీలో జగన్మోహన్​రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్యమత ప్రచారం పెరిగిపోయిందని పత్రికలు ఘోషిస్తున్నాయి. అయితే ఆయన క్రిష్టియన్​ కాబట్టి.. మత ప్రచారం పెరిగిందంటూ ఈ మధ్య ఎక్కువ వార్తలు వస్తున్నాయి. వాస్తవమేమిటంటే.. ఆయన కంటే ముందు కూడా అన్యమత ప్రచారం ఏపీలోనూ జరిగింది. ఆనాడు చంద్రబాబంటే కొన్ని పత్రికలకుముద్దు కాబట్టి.. ఆ విషయంపై పెద్దగా దృష్టి పెట్టలేదు.  ఇప్పుడు జగన్​ కాబట్టి రాస్తున్నాయి. అసలు విషయానికొద్దాం. క్రైస్తవ మత ప్రచారం ఇటీవలి కాలంలో మరీ ఎక్కువైంది. అది ఏపీ ఒక్కటే కాదు తెలంగాణలోనూ ఈ పైత్యం పెరిగిపోయింది. అంతెందుకు దేశంలో కూడా పెరిగిపోయింది. తాజాగా తెలంగాణలోని నల్లగొండ జిల్లా రాములబండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మత ప్రార్థనలు జరిగాయి. ఈ ప్రార్థనల్లో ఆశా వర్కర్లు, ఏఎన్​ఎంలు పాల్గొన్నారు.

ఇక్కడ ఇష్టా అయిష్టాలతో సంబంధం లేకుండా పాల్గొనాల్సిందే. ఎందుకంటే ప్రార్థనలు చేయించింది జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సీనియర్​ అసిస్టెంట్​ ఆదిమల్ల శ్రీనివాస్​, సూపర్​వైజర్​ లూర్దుమేరి కాబట్టి. ఈ విషయం సోషల్​ మీడియాలో వైరలైంది. వీళ్లిద్దరిపై సస్పెండ్​ వేటు వేశారు. ఇదంటే బయటపడింది కాబట్టి వేటు వేశారు. బయటపడని ప్రచారాలు ఎన్నో. ఎన్నెన్నో.  ఎక్కడ చూసినా హిందూ పేరు కలిగి ఉండి.. క్రైస్తవ మత ప్రచారంలో సుదీర్ఘంగా మునిగి తేలుతున్నారు.  యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఒక మిషనరీ స్కూల్​లో అయ్యప్ప మాల వేసుకున్నాడని.. విద్యార్థి ప్రణీత్​రెడ్డిని 41 రోజుల పాటు బడికి రావద్దని ఆర్డరేశాడు బడి ఓనర్​. వీటిని ప్రశ్నిస్తే..  ఆర్​ఎస్​ఎస్​కు సంబంధించిన వాడివా..? బీజేపీకి సంబంధించిన వాడివా..? అంటూ ఎదురు ప్రశ్నలు. ఇదే హిందువులు నడిపించే స్కూల్​లో కచ్చితంగా అందరూ బొట్టు పెట్టుకొని రావాలని ఆర్డరేస్తే క్రిష్టియన్లు, ముస్లింలకు ఎలా ఉంటుందో ఆలోచించండి. ఎవరి మతం వాళ్లది. దాంట్లో ఇతరులు జొరబడి మాదాంట్లోకి రండి అని వెంటపడడం ఎందుకు..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here