Home breaking news తిరుగుబాటు ఎమ్మెల్యేల‌పై వేటు – య‌డియూర‌ప్ప‌కు లాభం

తిరుగుబాటు ఎమ్మెల్యేల‌పై వేటు – య‌డియూర‌ప్ప‌కు లాభం

194
0
తిరుగుబాటు ఎమ్మెల్యేల‌పై వేటు - య‌డియూర‌ప్ప‌కు లాభం
జ‌నం మ‌ధ్య‌లో సీఎం య‌డియూర‌ప్ప‌

తిరుగుబాటు ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేయ‌డంతో ముఖ్య‌మంత్రి య‌డియూర‌ప్ప‌కు లాభం క‌లుగనుంది. మొత్తం 17 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల‌పై క‌ర్ణాట‌క స్పీక‌ర్ ర‌మేశ్‌కుమార్ వేటు వేశారు. ఈ ప‌రిణామం బీజేపీకే లాభం చేయ‌నుంది. విశ్వాస తీర్మానం జ‌ర‌గ‌కముందే.. ముగ్గురు ఎమ్మెల్యేల‌పై స్పీక‌ర్ వేసిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌రువాత విశ్వాసం నిల‌బెట్టుకోక పోవ‌డంతో సంకీర్ణ స‌ర్కారు కూలిపోయింది. కుమార‌స్వామి త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. బీజేపీ అధికారంలోకి రావ‌డం.. ముఖ్య‌మంత్రిగా య‌డియూర‌ప్ప బాధ్య‌త‌లు చేప‌ట్టారు. సోమ‌వారం క‌ర్ణాట‌క అసెంబ్లీలో ఆయన బ‌ల‌నిరూప‌ణ చేసుకోవాల్సి ఉంది. ఈ స‌మ‌యంలో మ‌రో 14 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల‌పై స్పీక‌ర్ అన‌ర్హ‌త వేటు వేశారు. క‌ర్ణాట‌క‌లో మొత్తం 224 స్థానాలున్నాయి. 17 మందిపై అనర్హ‌త వేటు ప‌డ‌డంతో.. స‌భ్యుల సంఖ్య 207కి పడిపోయింది. దీంతో మేజిక్ ఫిగ‌ర్ 104కు చేరింది. బీజేపీకి ప్ర‌స్తుతం సొంతంగా ఉన్న స‌భ్యుల సంఖ్య 105. మ‌రో స్వ‌తంత్ర ఎమ్మెల్యే కూడా బీజేపీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. కావాల్సిన సంఖ్య కంటే ఇద్ద‌రు స‌భ్యులు ఎక్కువే ఉన్నారు. దీంతో విశ్వాస ప‌రీక్ష‌లో య‌డియూర‌ప్ప‌ సులభంగా గ‌ట్టెక్కే అవ‌కాశ‌ముంది. అయితే క‌ర్ణాట‌క రాజ‌కీయాలు తెలిసిన వారు మాత్రం ప్ర‌భుత్వ మ‌నుగ‌డ‌పై అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here