Home breaking news తలసాని దేశద్రోహి- బీజేపీ

తలసాని దేశద్రోహి- బీజేపీ

155
0

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై దేశద్రోహ చట్టం కింద కేసు నమోదు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే ఎన్ రాంచందర్రావు డిమాండ్ చేశారు. సైనికుడు అభినందన్ ను విడిచి పెట్టాలని పాకిస్థాన్ ను ప్రధానమంత్రి మోదీ హెచ్చరించడాన్ని తప్పుపట్టిన తలసాని దేశద్రోహే అని స్పష్టం చేశారు.  ప్రజాప్రతినిధిగా, మంత్రిగా ఉన్న వ్యక్తి  పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడడం తీవ్రమైన చర్యగా భావించి శాసనసభ్యులుగా అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

పాకిష్థాన్ హెచ్చరించడాన్ని ఎలా తప్పుపడతారని ఆయన నిలదీశారు.  నరేంద్రమోడీ సారధ్యంలో ఉగ్రవాదంపైన కఠిన చర్యలు తీసుకున్నదన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం అన్నింట్లో వైఫల్యం చెందడంతో మతవిద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా విషయం పక్కదారి పట్టించాలని అనుకోవడం సరికాదు. ఈ వ్యాఖ్యల వెనుక టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రోత్సహించినట్టుగా ఉందన్నారు. ఇంటర్‌ పరీక్షా ఫలితాలలో జరిగిన అవకతవకలకు అక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వంలోని ఒక ముఖ్య నేతకు సంబంధాలున్నాయని అందుకే జరిగిన తప్పిదాలపై సిబ్బంది పైన గాని, అధికారుల పైన గాని చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని తెలిపారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here