Home breaking news తప్పు చేసిన ఆర్టీసీ కార్మికులతో చర్చలు లేవు సీఎం కేసీఆర్

తప్పు చేసిన ఆర్టీసీ కార్మికులతో చర్చలు లేవు సీఎం కేసీఆర్

194
0
మంత్రులు, అధికారులతో సీఎం కేసీఆర్​

ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగి తప్పు చేశారని.. ఇక వారితో ఎలాంటి చర్చలుండవని ముఖ్యమంత్రి కేసీఆర్​ స్పష్టం చేశారు. ఇక ఆర్టీసీ చరిత్రలో ఒక నూతనాధ్యాయాన్ని ప్రారంభించ బోతున్నట్లు ప్రకటించారు. ఆర్టీసీ సమ్మె నేపధ్యంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆదివారం ప్రగతి భవన్లో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో కేసీఆర్​ మాట్లాడారు.   ఆర్టీసీని లాభాల్లోకి తీసుకు పోవాలనీ, సంస్థ మనుగడ కొనసాగాలంటే కొన్ని చర్యలు తప్పవనీ చెప్పారు.

ఏటా రూ. 1200 కోట్ల నష్టంతో, రూ. 5000 కోట్ల రుణభారంతో, క్రమబద్ధంగా పెరుగుతున్న డీజిల్ ధరలతో ఆర్టీసీ తీవ్ర ఇబ్బందుల్లో ఉందన్నారు. ఈ సమయంలో చట్ట విరుద్ధమైన సమ్మెకు, అదీ పండుగల సీజన్లో దిగిన వారితో ఎలాంటి రాజీ సమస్యే లేదని, వారి చేసింది తీవ్రమైన తప్పిదమన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని, ఇక వారితో ఎలాంటి చర్చలు జరిపేది లేదని స్పష్టం చేశారు. భవిష్యత్ లో ఆర్టీసీకి సంబంధించి, ఎప్పటికీ క్రమ శిక్షణా రాహిత్యం, బ్లాక్ మెయిల్ విధానం, తలనొప్పి కలిగించే చర్యలు శాశ్వతంగా వుండకూడదని భావిస్తున్నామన్నారు.

ప్రభుత్వం విధించిన గడువు లోపల విధుల్లోకి హాజరు కాని సిబ్బందిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకునే ప్రసక్తే లేదన్నారు. ఇక ఆర్టీసీలో మిగిలింది కేవలం 1200 మంది లోపే సిబ్బంది అని సీఎం తెలిపారు. తక్షణ చర్యగా 2500 బస్సులను అద్దె పద్ధతిలో తీసుకుని నడపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 4114 ప్రయివేట్ బస్సులు ఇంకా వున్నాయి. వాటికి స్టేజ్ కారేజ్ గా చేస్తే వాళ్ళు కూడా ఆర్టీసీలోకి వస్తారు. ఈ విషయంలో వాళ్ళతో ఆర్టీసీ, రవాణా అధికారులు చర్చలు జరుపుతున్నారు. అతి కొద్ది రోజుల్లోనే కొత్త సిబ్బంది నియామకం చేపట్టాలని, నియామక ప్రక్రియ అతిత్వరగా చేపట్టాలన్నారు.

కొత్తగా చేర్చుకునే సిబ్బంది యూనియన్లలో చేరమని ఒప్పంద పత్రం మీద సంతకం చేయాలని, కొత్త సిబ్బందిది షరతులతో కూడిన నియామకం అవుతుందని, ప్రొబేషన్ పీరియడ్ ఉంటుందన్నారు. ఇక నుంచి ఆర్టీసీ నడపబోయే బస్సుల్లో సగం ప్రయివేట్ బస్సులుంటాయని, మిగతా సగం ఆర్టీసీ యాజమాన్యానివనీ నిర్ణయం జరిగింది. ఈ పద్ధతిలో చర్యలు చేపట్టితే బస్సులు బాగా నడుస్తాయి. రెండు-మూడేళ్ళలో సంస్థ నష్టాలను పూడ్చుకుని లాభాల్లోకి వస్తుందన్నారు. 15 రోజుల్లో ఆర్టీసీ పూర్వస్థితికి రావాలని కేసీఆర్​ ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here