Home తాజా వార్తలు తప్పు ఆర్దికమాంద్యానిదే సీఎం కేసీఆర్​ది కాదు సుమా.!

తప్పు ఆర్దికమాంద్యానిదే సీఎం కేసీఆర్​ది కాదు సుమా.!

128
0
సీఎం కేసీఆర్​

‘తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి’ అప్పుడెప్పుడో సుమతి శతకంలో చెప్పారు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఇదే గుర్తుకొచ్చినట్టుంది. అందుకే తప్పు ఆర్దికమాంద్యానిదే నాది కాదు. 18 నెలలుగా దేశం ఆర్దికమాంద్యంలో ఉందని అందుకే ఓట్​ ఆన్​ అకౌంట్​ బడ్జెట్​లో ప్రతిపాదించిన మొత్తం రూ. 1.82 లక్షల  కోట్లలో రూ. 36 వేల కోట్లు ఏకబిగిన తగ్గించేసి రూ. 1.46 లక్షల కోట్లకు తెచ్చానంటున్నాడు కేసీఆర్​. ఇది వింటే మనం కూడా నిజమే కదా. దేశం ఆర్దిక మాంద్యంలో కొట్టు మిట్టాడుతోందని అందరూ అంటున్నారు కదా అని అనుకుంటాం. ఇక్కడ ఒక చిన్న లిటిగేషన్​ ఉంది దాన్ని పరిశీలిద్దాం.

18 నెలలుగా దేశం ఆర్ధిక మాంద్యంలో ఉంటే.. కేసీఆర్​ బడ్జెట్​ ప్రవేశపెట్టింది ఫిబ్రవరి 23న అంటే ఆరు నెలల కిందే. ఆ రోజు ఆర్ధికమాంద్యం ఉందన్న సంగతి గుర్తుకు రాక.. బడ్జెట్​ కేటాయింపులు చేసినట్టా..? లేక మరొకటా. ఇక సర్కారు భూములకు రెక్కలు తొడుగుతామని చెప్పేశారు కేసీఆర్​. అంటే అమ్మెస్తాడంట. ఇవి అమ్మడం ద్వారా రూ. 11 వేల కోట్లు రాబడుతామని చెప్పాశాడు. డబుల్​ బెడ్​రూం ఇళ్లకు జాగా లేదంటడు. దళితులకు మూడెకరాల భూమి ఇవ్వడానికి భూమి లేదంటడు. కొని ఇస్తానంటడు. కొనడానికి భూమి దొరుకతలేదంటడు. కానీ ఉన్న సర్కారు భూమిని అమ్ముతాడంట. ఇటువంటి మాటల మాంత్రికుడు దేశంలో ఎవరైన ఉన్నారా.? అని భూతద్దంలో చూసినా దొరుకతరని గ్యారంటీ లేదు. ఇది మాత్రం వాస్తవం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here