Home జాతీయం తప్పా.. అది వాళ్లు చేస్తేనే.. మేము చేస్తే కాదు సుమా

తప్పా.. అది వాళ్లు చేస్తేనే.. మేము చేస్తే కాదు సుమా

361
0

తప్పొప్పులు లెక్కకు వచ్చినప్పుడు.. అవతలోళ్లు చేస్తే తప్పు. తాము చేస్తే ఒప్పు. ఇది ప్రతి రాజకీయ పార్టీ లేదా నాయకుల్లో ప్రతి ఒక్కరు చెప్పేదే. ఇప్పుడు కూడా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో రెండు తప్పొప్పుల ప్రశ్న మళ్లీ తలెత్తింది. తెలంగాణ విషయానికొస్తే.. యూరేనియం అంశం తెరమీదకు. కాంగ్రెస్​ అధికారంలో ఉండగా.. అనుమితిచ్చింది. ఆ సమయంలో టీఆర్​ఎస్​ వ్యతిరేకించి ఆందోళనలు నిర్వహించింది. అదే టీఆర్​ఎస్​ అధికారంలోకి వచ్చిన తర్వాత యురేనియం తవ్వకాలకు సంబంధించిన సర్వేకు అనుమతిచ్చింది. కాంగ్రెస్​ అనుమతి, టీఆర్ఎస్​ సర్వే అనుమతిని పరిగణలోకి తీసుకున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు ఇప్పుడు తెలంగాణలోని నల్లమల అడవుల్లో సర్వేకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. ఇప్పుడు అనుమతించిన కాంగ్రెస్​, సర్వేకు అనుమితిచ్చిన టీఆర్​ఎస్​ కూడా యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తున్నాయి. పైగా సభలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా తీర్మానం చేసింది. సో అంటే తామిచ్చిన అనుమతులను కాంగ్రెస్​, తామే ఇచ్చిన సర్వే అనుమతులను టీఆర్​ఎస్​ వ్యతిరేకిస్తోంది.

ఏపీ విషయానికొస్తే.. టీడీపీ అధికారంలో ఉండగా.. తిరుమల తిరుపతి దేవస్థానంలో శేఖర్​రెడ్డి అనే ఒక వ్యాపారీని బోర్డు సభ్యుడిగా నియమించారు. నోట్ల రద్దు సమయంలో సదరు బోర్డు సభ్యుడి ఇంట్లో తనిఖీలు చేసినప్పుడు కోట్ల కొద్ది నగదు. బంగారం బయటపడ్డాయి. వీటిని లెక్కించడానికే.. రెండు మూడు రోజుల టైం పట్టింది. ఇది అందరికీ తెలిసిన ముచ్చట. ఆయనను తొలగించాలని ఆనాడు వైఎస్సార్​ కాంగ్రెస్​ డిమాండ్​ చేసింది. శేఖర్​రెడ్డి విషయంలో జగన్​ ఛానల్​ సాక్షి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. చివరకు తొలగించారు. ఇక్కడి వరకూ ఓకే.

ఇప్పుడు అసలు ట్విస్టేంటంటే.. ఏపీలో వైస్సార్​ కాంగ్రెస్​ అధికారంలో ఉంది. జగన్​ ముఖ్యమంత్రి. కొత్తగా టీటీడీ బోర్డును నియమించారు. ఇందులో తెలంగాణకు చెందిన వ్యాపార వేత్త జూపల్లి రామేశ్వరరావు, తెలంగాణ ఉద్యమకారుడంటూ సాక్షి పత్రిక కితాబిచ్చిన ‘టీ న్యూస్​’ దామోదరరావు వంటి వారిని సభ్యులుగా నియమించారు.  పనిలో పనిగా ఏడుగురిని ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపిక చేశారు. వీరిలో ఆశ్చర్యకరంగా గతంలో పాలకవర్గం నుంచి తొలగించాలని వైసీపీ డిమాండ్​ చేసిన శేఖర్​రెడ్డి కూడా ఉన్నారంట.

ఆహా ఏమి చిత్రం.. కోట్ల కొద్ది నగదు, బంగారం దొరికిన శేఖర్​రెడ్డిని అప్పట్లో సాక్షి పత్రిక, వైసీపీ.. చంద్రబాబుకు బినామిగా అభివర్ణించాయి. ఇప్పుడు అదే శేఖర్​రెడ్డిని ఆహ్వానితుడిగా నియమించింది. సూపర్​గా లేదు. అందుకే అవతలివాడు చేస్తే తప్పు.. తాము చేస్తే ఛ అలాంటిదేమీ లేదు. తాము చేసిన పని మంచిది. తమ వాళ్లు సచ్ఛీలురు అని చెప్పుకోవడానికి పోటీ పడుతారు. నిజమే కదా. పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగుతూ తనను ఎవరూ చూడలేదని కుంటోంది. ఇప్పుడు కాంగ్రెస్​, టీఆర్​ఎస్​, వైఎస్సార్​ కాంగ్రెస్​ కూడా అలాగే అనుకుంటున్నట్టున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here