Home breaking news తనకు తానే.. గొయ్యి తొవ్వుకుంటున్న టీఆర్ఎస్

తనకు తానే.. గొయ్యి తొవ్వుకుంటున్న టీఆర్ఎస్

228
0

ఎవడు తీసుకున్న గోతిలో వాడే పడతాడు. ఇది అప్పుడెప్పుడో పెద్దలు చెప్పేశారు. సేమ్​ అట్లనే ఇప్పుడు అధికారంలో ఉన్న టీఆర్​ఎస్​ తన గొయ్యి తానే తవ్వుకుంటోంది. ఇప్పుడీ సందర్భమెందుకొచ్చిందంటే.. ఆర్టీసోళ్లు సమ్మె స్టార్ట్​ చేశారుగా అందుకే ఈ ముచ్చట. ఈ పని ఎప్పుడో చేద్దామని అనుకున్నా.. కొత్త రాష్ట్రం, కొత్త సర్కారు  టైమిద్దామని అనుకున్నారో..? లేక యూనియన్ల పెద్దల ప్రయోజనాలు దాగున్నాయో కానీ.. మొత్తానికి మూడేళ్ల నుంచి చేయాలా..? వద్దా..? అని ఆగి ఆగి మా డిమాండ్లు గివి. వాటిని అమలు చేయాలే లేకుంటే సమ్మె చేస్తమని నెలకింద నోటిసిచ్చేశారు. ఈ సమ్మె నోటీసుకు కూడా .. ఏపీ సర్కారు చేసిన.. ఆర్టీసీ విలీనమే బలం.  ఈ విలీనం తర్వాతే.. కార్మికుల నుంచి ఒత్తిడి చివరకు ఏం చేయాలో తోచని సమ్మె నోటీసు వగైరా. ఇప్పుడు సమ్మెకు దిగడం జరిగిపోయింది.

యూనియన్లు, లీడర్ల ప్రయోజనాలు పక్కన పెట్టి.. తనకు తానే గొయ్యి తవ్వుకుంటున్న టీఆర్​ఎస్​ అన్న సంగతికొద్దాం. తెలంగాణ ఇచ్చింది. మద్దతిచ్చింది. సాధించింది ఎవరన్న విషయం అందరికీ తెలుసు. తెలంగాణ ఉద్యమంలో టీఆర్​ఎస్​ ముందుంది. ఈ ఉద్యమానికి ఆర్టీసీ, సింగరేణి కార్మికులే ఊతమిచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా టీచర్లు వీరు లేకుండా ఉద్యమం ముందుకు సాగేదే కాదు. విలేకరుల పాత్ర కూడా ఎక్కువే. అన్నీ ఆంధ్ర యాజమన్యాలు.. అయినా.. విలేకరులు తమ వంతు పాత్రను రిస్క్​ తీసుకొని పోషించారు. వీళ్లందరూ కూడా తమ రాష్ట్రం తమకే అన్న బలమైన ఆకాంక్షతోటే ఉద్యమంలోకి వచ్చారు. వీళ్లు నిర్వహించిన సకల జనుల సమ్మె రాష్ట్ర సాధనలో కీలకమైన ఘట్టం. ఈ ఘట్టంతోనే.. దేశాన్ని.. తద్వారా ప్రపంచాన్నే తెలంగాణ ఉద్యమం ఆకర్షించింది. వీళ్లందరి కారణంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది.

సర్క్యూలేషన్​ కోసమా..? ఆ పత్రికలో ముఖ్యమైన పోస్టుల్లో ఉన్న తెలంగాణ వారి కారణంగానా..? మరో కారణమా..? అన్నది పక్కన పెడితే.. ఆంధ్రజ్యోతి పత్రిక కూడా ప్రధాన పాత్రే పోషించింది. ఈనాడు, సాక్షి పత్రికల్లో రాకున్నా.. ఆంధ్రజ్యోతిలో మాత్రం తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కథనాలు వచ్చేవీ. ఇదంతా గతం. తెలంగాణ కోసం ఉద్యమించి.. అండగా నిలిచిన ఈ వర్గాలన్నీ ఇప్పుడు టీఆర్​ఎస్​కు  దూరమయ్యాయి. కొన్ని పాలాభిషేకం బ్యాచ్​లు, ఆనాడు తెలంగాణను వ్యతిరేకించిన వర్గాలన్నీ కేసీఆర్​కు దగ్గరయ్యాయి.

తెలంగాణ సాధన కోసం ఉద్యమించి.. అందరి సహకారంతో సక్సెస్​ అయిన టీఆర్​ఎస్​. కానీ అందరూ ఫెయిలయ్యారు. ఉద్యమంలో కీలకంగానే పాలుపంచుకున్న సీపీఐ కనుమరుగైంది. బీజేపీ ఆగమైనా.. చావు తప్పి కన్నులొట్టపోయినట్టు ఎంపీలు గెలిచింది. లోపాయికారిగా టీఆర్​ఎస్​కు మద్దతిచ్చినందుకు కాంగ్రెస్​ పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరగలేదు. విద్యార్థులు ఆశించినట్టుగా ఉద్యోగాలు రాలేదు న్యాయం జరగలేదు. ఎవరికి న్యాయం జరిగిందంటే.. బీటీ (బంగారు తెలంగాణ) బ్యాచ్​కు మాత్రమే. ఆర్టీసోళ్లు సమ్మెకు దిగిన కారణాల్లో అమలు చేయదగ్గవి ఉన్నాయి. వాళ్లు నోటీసిచ్చి కూడా నెల దాటి పోయింది. దీనిపై ఎవరూ స్పందించలేదు. చివరకు ఏదో కమిటీ అంటూ వేశారు. కొన్ని అమలు చేస్తామని చెప్పి.. మరికొన్నింటికి టైం కోరితే బాగుండేదీ కానీ సరిగ్గా ఆర్టీసీ సమ్మెకు దిగే సమయంలోనే కేసీఆర్​ ఢిల్లీకి వెళ్లిపోయారు. ఇక సమ్మె మొదలైంది. ఆర్టీసీ మంత్రేమో కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు. ఆర్టీసోళ్లు సమ్మె చేసిన ప్రతిసారి సర్కారు మారిపోయింది. చంద్రబాబు హయాంలో సమ్మె చేశారు. మరుసటి ఎన్నికల్లో కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్​ హయాంలో సకల జనుల సమ్మె చేశారు. టీఆర్​ఎస్​ అధికారంలోకి వచ్చింది. టీఆర్​ఎస్​ హయాంలో సమ్మె చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here