Home breaking news డాక్టర్లే లేరాయే జరమెట్లా తగ్గుద్దో బంగారు సర్కారే చెప్పాలే

డాక్టర్లే లేరాయే జరమెట్లా తగ్గుద్దో బంగారు సర్కారే చెప్పాలే

295
0

డాకర్లే లేరాయే.. జరమెట్లా తగ్గుద్దో సర్కారే చెప్పాల్సి ఉంటది. ప్రతేడాది ఈ సీజన్​లో అంటే వానా కాలం  టైంలో  వాంతులు, విరేచనాలు, డెంగ్యూ, మలేరియా, టైపాయిడ్​తో జనం ఇబ్బంది పడుతుంటరు. ముసురు వానలు పడడం.. దోమలు పెరగడం.. గ్రామ దేవతల పండుగలు రావడం.. రోగాలు రావడం ఇది టీవీ సీరియల్​ మాదిరిగా ప్రతీ ఏడాది వస్తూ ఉంటది. అంటే విషయం తెలిసినోళ్లు ఎవలైనా.. ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.

మనది బంగారు తెలంగాణ.. డాక్టర్లు ఫుల్​గా ఉన్నారని చెప్పుకుంటున్న సర్కారు.. ముందు జాగ్రత్తలు తీసుకుంటదని అనుకుంటూ ఉంటాం. ఇక్కడే అందరూ పెండకుప్పల కాలేస్తున్నరు. అసలు ముచ్చటేంటంటే.. మన సర్కారు దవఖాన్లల్ల డాక్టర్లు ఫుల్​గా లేరు. ఖాళీగానే ఉన్నాయి. ఇప్పుడు వాంతులు, విరేచనాలు, మలేరియా, డెంగ్యూ టైపాయిడ్​ ఇలా సీరియల్​ జ్వరాలు జనాన్ని పీడించుకొని తింటున్నాయి. ఆళ్లందరూ దవాఖాన్లకు వస్తే ఏముందు డాక్టర్లు సరిగా లేరాయే..?

అయితే జనాలు పడుతున్న జ్వరాల బాధలు పేపరోళ్లు కూడా పట్టించుకోలే. సర్కారుకు వ్యతిరేకంగా రాస్తున్న వెలుగు, ఆంధ్రజ్యోతి మాత్రం రాశాయి. దీన్ని జీర్ణించుకోలేనోళ్లు ఈ రెండు పేపర్లను తిడితే తిడతరునుకోండి. సరే ఎట్లాగోట్లా సర్కారు సీరియస్​గా తీసుకొని ఓపీ టైమింగ్​ పెంచేసింది. సూపర్​ నిర్ణయం కదు. సర్కారు దవాఖాన్లల్ల డాక్టర్లే సరిగా లేరు. డాక్టర్లే సరిగా లేనప్పుడు ఓపీ టైమింగ్​ పెంచడం వల్ల ఉపశమనమే తప్ప ఉపయోగం ఏముంది.

బంగారు తెలంగాణలో ఎలాంటి కొరత లేదని చెబుతున్న సర్కారు.. సీజనల్​ జ్వరాలకు సంబంధించి ముందస్తు చర్యలెందుకు తీసుకోలేదు. పచ్చదనం పరిశుభ్రత.. అంటున్న సర్కారు.. దోమల మందు కొట్టించిందా..? అసలందుకు నిధులిచ్చిందా.? ఖాళీగా ఉన్న డాక్టర్లను భర్తీ చేసిందా..? డ్యూటీకి డుమ్మా కొడుతున్న డాక్టర్లను దారిల పెడుతున్నరా.? ఇవన్నీ చేయకుండా డాక్టర్లే తక్కువగా ఉన్నప్పుడు ఉన్నోళ్ల మీద వెయిట్​ ఎక్కువేస్తే.. వాళ్లేలా సర్వీస్​ చేయగలరు. ఈ ప్రశ్నలేస్తే బంగారు తెలంగాణగా మారుస్తుంటే ఒర్వట్లేదంటారా..? ఏంటీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here