Home breaking news ట్రుబులిచ్చింది.. మ‌న్నించండి.. వెళ్లిపోతున్న‌- రాహుల్‌

ట్రుబులిచ్చింది.. మ‌న్నించండి.. వెళ్లిపోతున్న‌- రాహుల్‌

195
0

రాహుల్ ఎన్నిక‌ల ప్ర‌చారానికి ట్రుబులేర్ప‌డింది. ఆయ‌న ప్ర‌యాణిస్తున్న విమానం.. సాంకేతిక లోపానికి గురై ట్రుబిలివ్వ‌డంతో.. విమానాన్ని వెనక్కి మ‌ళ్లించారు. షెడ్యూల్ ప్రకారం.. బిహార్‌, మ‌హారాష్ట్ర‌, ఒడిశాలోని వివిధ ప్రాంతాల్లో ఆయ‌న ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొనాల్సి ఉంది. ఇందుకోసం ఆయ‌న ఢిల్లీ నుంచి ప్ర‌త్యేక విమానంలో బిహార్‌లోని పాట్నాకు ఆయ‌న శుక్ర‌వారం బ‌య‌లు దేరారు. కొద్ది సేప‌టికే విమానం ఇంజ‌న్‌లో సాంకేతిక లోపం ఏర్ప‌డిన విష‌యాన్ని పైలట్ గుర్తించారు. వెంట‌నే తిరిగి ఢిల్లీకి మ‌ళ్లించారు. ఈ విష‌యాన్ని రాహుల్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు. పాట్నాకు వెళ్తున్న నా విమాన ఇంజ‌న్‌లో సాంకేతిక లోపం త‌లెత్తింది. దీంతో విమానాన్ని ఢిల్లీకి మ‌ళ్లించాం. బీహార్‌లోని సమస్తిపూర్‌, ఒడిశాలోని బాలసోర్‌, మహరాష్ట్రలోని సంగమ్నెర్‌లోని ప్రచార సభలకు హాజరు కావాల్సింది. ఇంజన్‌ ట్రబుల్‌ వల్ల ఈ సభలకు హాజరవ్వడం ఆలస్యం అవుతుంది. కాబ‌ట్టి నా కారణంగా మీకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నాను అని పేర్కొన్నారు. దీనికి సంబంధించి వీడియోను త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తిన సంగ‌తి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here