Home breaking news టైటానిక్ హీరో రాజగోపాలా.. బీజేపీలో చేరికకు ఊగిసలాటేలా..?

టైటానిక్ హీరో రాజగోపాలా.. బీజేపీలో చేరికకు ఊగిసలాటేలా..?

167
0
టైటానిక్ హీరో రాజగోపాలా.. బీజేపీలో చేరికకు ఊగిసలాటేలా..?
రాజగోపాల్​రెడ్డి

కొందరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడానికి నానా తంటాలు పడుతూ ఉంటారు. చేయాలా.. వద్దా.. అవునా కాదా.. ఇలా ఊగిసలాడుతూ ఉంటారు. రాజకీయ నాయకుల్లో ఇది మరీ ఎక్కువ. ఇప్పుడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కూడా ఇదే విధంగా ఊగిసలాడుతున్నారు. ఒకసారి బీజేపీలోకి వెళ్తున్నా.. అని, ఇంకోసారి వెళ్లడం లేదని.. మళ్లీ వెళ్తున్నా.. అని ఇలా ఊగిసలాడుతున్నారు. ఆ మధ్య బీజేపీలోకి వెళ్తే నేనే సీఎం అని కూడా కార్యకర్తతో అంటే సదరు కార్యకర్త ఆ మాటలను రికార్డు చేసి మరీ మీడియాకు అందించేశారు. ఇది విన్నోళ్లందరూ పిల్ల పుట్టక ముందే. కుళ్ల కట్టినట్టుగా ఉందన్నారుకో.

విలేకరులు కలిసినప్పుడల్లా మీడియాలో వచ్చే విధంగా కొత్తకొత్తగా మాట్లాడే  రాజగోపాల్​రెడ్డి. అదే విధంగా కొత్త విషయం వెల్లడించారు. నేనొక్కడినే కాదు నాతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బీజేపీలోకి వస్తున్నారని చెప్పేశారు. ఇంకా చాలా విషయాలు మాట్లాడారనుకో మేము (కోమటిరెడ్డి బ్రదర్స్‌) బీజేపీలోకి వెళుతున్నారంటే టీఆర్‌ఎస్‌కు భయం పట్టుకుందని ఆయన ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయమని పునరుద్ఘాటించారు. తనలాంటి వాడు చేరితే బీజేపీ మరింత బలపడుతుందని, నేను ఎలాంటి పదవి ఆశించడంలేదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌ మునిగిపోయే నావ అని, టైటానిక్‌లో తనలాంటి హీరో ఉన్నా మునగక తప్పదని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి గడువు ముగిసిన ఔషధం మాదిరిగా ఉందని వ్యాఖ్యానించారు.

బీజేపీలోకి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను తీసువెళ్లేందుకు ఎవరితోనూ సంప్రదింపులు జరపడం లేదన్నారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ అంటే తనకు గౌరవమని, రాష్ట్ర నాయకత్వలోపం వల్లే కాంగ్రెస్‌కి ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. నా దగ్గర నుంచి నెలకు రూ. 50 వేలు జీతం తీసుకున్న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ద్రోహం చేశారన్నారు. అతడు తన వల్లే బతికాడని, తానే అతడిని ఎమ్మెల్యే చేశానని అని రాజగోపాల చెప్పుకొచ్చారు. తాను బీజేపీలో చేరినా ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయబో నని స్పష్టం చేశారు.అయితే, తన ప్రాణం పోయే వరకూ కాంగ్రెస్‌లోనే ఉంటానని భేవపగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గతంలోనే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here