Home breaking news టైగర్ కేసీఆర్ వాళ్లకే వ్యతిరేకం -RGV

టైగర్ కేసీఆర్ వాళ్లకే వ్యతిరేకం -RGV

125
0

రాంగోపాల్ వర్మ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్. ఆయన ఏం చేసినా చర్చకు తావిస్తోంది. సినిమా నిర్మించినా చర్చే. నిర్మించుకున్నా చర్చలోనే నిలుస్తారు. ఇప్పుడు ఆయన తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర.. ఈ అంశంపై టైగర్ కేసీఆర్ చిత్రం నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన టైటిల్, పాత్రలపై క్లారిటీ ఇచ్చేశారు. ఇంత వరకు ఓకే. ఆ తరువాతే మొదలైంది కథ. ఈ సినిమాకు సంబంధించిన ఒక పాటను ఆయన స్వయంగా పాడుతూ వీడియో విడుదల చేయడం అది కాస్తా చిచ్చు రేపడం జరిగింది. వస్తున్నా వస్తున్నా నీ తాట తీయడానికి వస్తున్నా ఆంధ్రోడా అంటూ పాడారు. దీనిపై విమర్శలు రావడంతో.. ఇది కేవలం తెలంగాణ ప్రజలను అవమాన పర్చిన రాజకీయ నాయకులపైనే ఆంధ్ర ప్రజల మీద కాదంటూ వివరణ ఇచ్చారు. తెలంగాణ ప్రజలను వెన్నుపోటు పొడిచిన వారిపైనే కేసీఆర్ యుద్ధం చేశారని తెలిపారు. ఈ మేరకు ట్వీట్టర్ లో ట్వీట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here