Home breaking news టీవీ 9 బిత్తిరి సత్తి ప్రోగ్రాం.. ఇస్మార్ట్ న్యూస్.. ప్రొమో వివాదమైతే కాదుగా..!

టీవీ 9 బిత్తిరి సత్తి ప్రోగ్రాం.. ఇస్మార్ట్ న్యూస్.. ప్రొమో వివాదమైతే కాదుగా..!

1015
0
ఫొటో: టీవీ 9 విడుదల చేసిన ట్విట్టర్​ నుంచి తీసుకో బడింది.

టీవీ 9లోకి జంప్​ చేసిన బిత్తిరి సత్తి సరికొత్త ప్రోగ్రాం ప్రారంభం కానుంది. దానికి పేరు ఇస్మార్ట్​ న్యూసే. ఇదే అని కచ్చితంగా చెప్పలేము కానీ.. టీవీ 9 రిలీజ్​ చేసిన ప్రొమో ప్రకారం ఇస్మార్ట్​ న్యూసే అని అనుకోవాల్సిందే. నిన్నటివరకూ వీ6లో తీన్మార్​ ప్రోగ్రాంలో ఆదరణ పొందిన బిత్తిరి సత్తి అలియాస్​ రవికుమార్​.. తాజాగా టీవీ9లో చేరిన సంగతి తెలిసిందే. బిత్తిరి సత్తిని తన ఛానల్​లోకి తీసుకోవాలని ఛాన్నాళ్లుగా ప్రయత్నం చేసిన టీవీ9 సక్సెస్​ అయింది. ఆయన కొత్త ప్రోగ్రాం ప్లాన్​ చేసింది. దానిపేరే ఇస్మార్ట్​ న్యూస్​. దీనికి సంబంధించి రెండు ప్రోమోలు విడుదల చేసింది.

నిన్నటికి నిన్న ఖైరతాబాద్​ వినాయక విగ్రహం వద్ద బిత్తిరి సత్తిని బ్యాక్​ నుంచి చూపిస్తూ ప్రోమో విడుదల చేసింది టీవీ 9. ఈ ప్రోమోలో సత్తి నడుచుకుంటూ వెళ్లి.. ఆ తర్వాత డ్రమ్స్​ వాయిస్తూ ఉన్న వీడియో.  ఇప్పుడు సత్తి ఖవాలీ  పాడుతున్నట్టుగా చూపిస్తూ ప్రోమో విడుదల చేసింది. ‘మన న్యూసే ఇస్మార్టు.. మనకింక లేదు లోటూ. నా ముందే ప్లూట్​. పడుతుంది తూటు. నా పెయ్యి మీద కోటు. మన న్యూసే ఇస్మార్టు’ అంటూ సత్తి పాడుతూ సలామ్​ కొడుతూ ఉన్న ప్రొమో విడుదల చేసింది.  ఇక్కడి వరకూ బాగానే ఉంది. కానీ.. ఖవాళీ అనేది ఒక మతానికి సంబంధించిన అంశం.

హిందూ మతానికి.. ఆచారాలకు సంబంధించి కళాకారులు ఏం చేసినా.. కలకు మతాన్ని అంటించవద్దని లౌకికవాదులనేబడే వాళ్లు వాదిస్తూ  ఉంటారు. అదే ఇతర మతాలకు సంబంధించిన అంశం వచ్చే సరికి మౌనంగా ఉంటారు. ఇది అనేక సందర్భాల్లో నిరూపనైంది. ఇప్పుడు సత్తిపై విడుదల చేసిన ప్రోమోలో ఖవాళీ పాడుతూ కన్పిస్తాడు. సత్తి కనబడగానే.. తీన్మార్​ ప్రోగ్రాం చూసే వాళ్లకు అలవాటై పోయింది. ఇప్పుడు కొత్త ప్రోగ్రాం ఇస్మార్ట్​ న్యూస్​ ప్రోమో కూడా అదే విధంగా ఎవరైన అభ్యంతరాలు చెబితే ఏమో జరగొచ్చు. జరగక పోవచ్చు కానీ. ఈనాడు పేపర్లో సోనియాగాంధీ కార్టున్​కు గడ్డం, టోపి పెట్టినందుకే.. అప్పట్లో పెద్ద గొడవ అయింది. మరి ఇప్పుడు ఖవాళీపై సత్తి. వివాదమైతే కాదుగా..? ఎమో ఏమవుతుందో ఎవరికి తెలుసు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here