Home ఎడ్యుకేషనల్/జాబ్స్ టీఎస్ ఎడ్‌సెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌ / TS Edset Notification Release

టీఎస్ ఎడ్‌సెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌ / TS Edset Notification Release

306
0

తెలంగాణ ప్రభుత్వ, ప్ర‌యివేటు కళాశాలల్లో 2019-20 విద్యా సంవ‌త్స‌రానికి గాను రెండేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) కోర్సు ప్రవేశాల కోసం ఉస్మానియా యూనివర్సిటీ టీఎస్ ఎడ్‌సెట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ఏప్రిల్ 10లోగా ద‌ర‌ఖాస్తులు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.650/, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.450/ చెల్లించాలి. ప‌రీక్ష మే 31న (11 AM -1.00 PM వరకు & 3.00 PM నుంచి 5.00 PM వరకు) నిర్వ‌హిస్తారు.

టీఎస్ ఎడ్‌సెట్‌ను తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీఎస్‌సీహెచ్‌ఈ) తరపున ఓయూ టీఎస్ ఎడ్‌సెట్‌ను నిర్వహిస్తుంచ‌నుంది. కోర్సు: బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ), మెథడాలజీ: మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్సెస్, బయాలజికల్ సైన్సెస్, సోషల్ స్టడీస్, ఇంగ్లిష్.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కోర్సులను బట్టి సంబంధిత/అనుబంధ విభాగంలో డిగ్రీ (బీఏ, బీకాం, బీఎస్సీ, బీసీఏ, బీబీఎం, బీబీఏ), బీఎస్సీ (హోం సైన్స్) 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ/ఇంజినీరింగ్ (సైన్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో) 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. 2019లో డిగ్రీ పూర్తి చేస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2019 జూలై 1 నాటికి 19 సంవ‌త్స‌రాలు నిండి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి లేదు.తెలంగాణలో 15 రీజినల్ కేంద్రాలతోపాటు ఏపీలో 3 కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహ‌ణ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో ప‌రీక్ష ఉంటుంది. 150 ప్రశ్నలు-150 మార్కులు. ప‌రీక్షరెండు గంట‌ల పాటు ఉంటుంది. ఇందులో నెగెటివ్ మార్కుల విధానం లేదు. మొత్తం మార్కుల్లో (150 మార్కులు) కనీసం 38 (25 శాతం) మార్క‌లు వ‌చ్చిన వారు అర్హులు. ఇందులో ఎలాంటి మినహాయింపులు లేవు.
పరీక్ష విధానం: పార్ట్ ఏ-జనరల్ ఇంగ్లిష్-25 మార్కులు, పార్ట్ బీ-జనరల్ నాలెడ్జ్-15 మార్కులు, టీచింగ్ ఆప్టిట్యూడ్-10 మార్కులు., పార్ట్ సీ-మెథడాలజీ-100 మార్కులు
అభ్యర్థి ఎంచుకున్న ఏదైనా మెథడాలజీ నుంచి ప్రశ్నలు ఇస్తారు. పార్ట్ ఏ, పార్ట్ బీ విభాగాలు అందరికి కామన్‌గా ఉంటాయి. పార్ట్ సీ (మెథడాలజీ) మాత్రమే వేర్వేరుగా ఉంటుంది.
మ్యాథమెటిక్స్-100 మార్కులు, -ఫిజికల్ సైన్సెస్-100 మార్కులు (ఫిజిక్స్-50 , కెమిస్ట్రీ-50), బయాలజికల్ సైన్సెస్-100 మార్కులు (బాటనీ-50, జువాలజీ-50), సోషల్ స్టడీస్-100 మార్కులు (జాగ్రఫీ-35, హిస్టరీ-30, సివిక్స్-15, ఎకనామిక్స్-20), ఇంగ్లిష్ -100 మార్కులు
పూర్తి వివ‌రాల‌కు.. http://edcet.tsche.ac.in,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here