Home తాజా వార్తలు టీఎస్ ఆర్టీసీని కాలమే మాయం చేయనుంది

టీఎస్ ఆర్టీసీని కాలమే మాయం చేయనుంది

144
0

ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీని కేసీఆర్​ కాదు కదా ఎవరూ ఏమీ చేయనవసరం లేదు. కాలమే.. ఆర్టీసీని మూతేసేందుకు అన్ని చేస్తున్నది. ఆర్టీసీ మీద సీఎం కేసీఆర్​కు కోపమెందుకో తెలియదు కానీ.. గతంలో కూడా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తామని ప్రకటించినప్పుడు కూడా కేసీఆర్​ ఆగ్రహమే వ్యక్తం చేశారు. అయినా కొన్ని రోజులు సమ్మె చేసి.. చివరకు కార్మికులే విరమించి విధుల్లో చేరిపోయారు. ఇప్పుడు కూడా అలాగే అవుతుందనుకున్నారు. ఆర్టీసోళ్లు సమ్మె చేస్తామని నోటిసిచ్చినా.. కేసీఆర్​ నుంచి స్పందన రాలేదు. సమ్మె మొదలు పెట్టిన తర్వాత.. కేసీఆర్​ ఆగ్రహమే వ్యక్తం చేశారు. కార్మిక సంఘాలపై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. ఆర్టీసీని సంఘాలే నాశనం చేస్తున్నాయని ఆరోపించారు. విధుల్లో చేరకుంటే.. ఆర్టీసీ ఉండనే ఉండదని చెప్పుకొచ్చారు. రూట్లు ప్రయివేటు చేస్తానన్నారు. 5100 బస్సులు ప్రయివేటు రూట్లు ఇస్తామని చెప్పేశారు.  అదే సమయంలో లెక్కలు కూడా చెప్పేశారు.

ఇప్పుడున్న 8వేల పై చిలుకు బస్సుల్లో 2300 మూలకు పడ్డాయని మిగిలిన బస్సుల్లో కూడా రెండుమూడు నెలల్లో మరో వెయ్యి బస్సులు మూలకు పడుతాయని చెప్పారు. చివరకు ఐదు వేల బస్సులుఉంటాయని చెప్పారు. కొత్త బస్సులు కొనే శక్తి ఆర్టీసీకి లేదని.. అందుకే అద్దె బస్సులు తీసుకుంటున్నామని, రూట్లను ప్రయివేటుకు ఇస్తామని చెప్పేశారు. కేసీఆర్​ ఎన్ని చెప్పినా.. కార్మికులు విధుల్లో చేరలేదు. సమ్మె కొనసాగుతూనే ఉంది. మొదటి నెల గడిచి రెండో నెలకు సమ్మె వచ్చేసింది. ఇన్ని రోజులుగా కార్మికులు సమ్మెలో ఉన్నందున.. బస్సుల మెయింటనెన్సు.. అంటే వాటిని రెగ్యులర్​గా క్లీన్​ చేయడం.. పార్టులు సరిగా పని చేస్తున్నాయో లేదో చూడడం వంటివి ఎవరూ చేయడం లేదు. ఆర్టీసీ చెబుతున్నట్టు.. వేల బస్సులేం రోడ్లపై నడవడం లేదు. డిపోల్లోనే ఉంటున్నాయి. నడిచే బస్సులకు, షెడ్డులో ఉన్న బస్సులకు మెయింటెనెన్సు లేదు. అవి రోజు రోజుకు తుప్పు పడుతున్నాయి. ఇలాగా మరో నెల గడిచిందా.. ఉన్న బస్సులో 60 నుంచి 70 శాతం మూలకు పడిపోతాయి. అంటే పాత ఇనుప సామానుకే వెళ్తాయన్నట్టు. ఇక మిగిలేవి ఏ రెండు వేల బస్సులో ఉంటాయి. ఆర్టీసీ కార్మికుల పక్షాన కోర్టు ఉంది కాబట్టి.. సమ్మె విరమణ జరిగినా.. ఎట్లాగు కొత్త బస్సులు కొనరు. ఇలాగే ఉంటే కేసీఆర్​ పదవీ కాలం ముగిసేనాటికి ఉన్న బస్సుల జీవిత కాలం ముగిసిపోతుంది.  ఆర్టీసీ సంస్థలో పదవీ విరమణ చేసిన వారు పోనూ కార్మికులే ఉంటారు. కానీ బస్సులుండవు. కేసీఆర్​ కోరుకున్నట్టు.. ఆర్టీసీని కాలమే మూత వేయనుంది. ఆయన చేసిన శపథం నెరవేరుతుంది. అప్పుడు అంతా ప్రవేయిట్​ బస్సులు.. అద్దె బస్సులదే రాజ్యం. జనం జేబులు గుల్ల.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here