Home breaking news టీఆర్ ఎస్ కు గర్వభంగం- ఐదు సిట్టింగ్ స్థానాల్లో ఓటమి

టీఆర్ ఎస్ కు గర్వభంగం- ఐదు సిట్టింగ్ స్థానాల్లో ఓటమి

140
0

హైదరాబాద్; లోక్ సభ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ ఎస్ కు గర్వభంగం కల్గింది. ఆ పార్టీ ఐదు సిట్టింగ్ సీట్లలో ప్రజలు ఓడించారు. టీఆర్ ఎస్ కోల్పోయిన ఐదు సిట్టింగ్ సీట్లలో బీజేపీ మూడు స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ మరో రెండు స్థానాలను కైవసం చేసుకుంది. గత కాంగ్రెస్ గెలిచిన మరో స్థానాన్ని నిలుపుకుంది. టీఆర్ ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత పై బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఘన విజయం సాధించారు. టీఆర్ ఎస్ కోల్పోయిన 5 సిట్టింగ్ సీట్లలో ఇవే.. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు అరవింద్, బండి సంజయ్, బాపురావ్ గెలిచారు. భువనగిరి, మల్కాజిగిరి స్థానాల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి విజయం సాధించారు. గత ఎన్నికల్లో నల్లగొండ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన గుత్తా సుఖేందర్ రెడ్డి టీఆర్ ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే. ఆ స్థానంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here