Home breaking news టిక్ టాక్‌కు చెక్ | Tik Tok app

టిక్ టాక్‌కు చెక్ | Tik Tok app

212
0

టిక్ టాక్ యాప్‌కు చెక్‌ప‌డింది. ఈ యాప్‌ను వెంట‌నే ప్లే స్టోర్ల నుంచి తొల‌గించాల‌ని గూగుల్‌, యాపిల్ సంస్థ‌ల‌ను కేంద్ర ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్ఫ‌రేష‌న్ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. చైనాకు చెందిన టిక్ టాక్ యాప్ అన‌తికాలంలోనే విస్తృత ప్ర‌జాద‌ర‌ణ పొందింది. ఇదే స‌మ‌యంలో దీనిపై అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌య్యాయి. చిన్న పిల్ల‌ల‌పై పెను ప్ర‌భావం చూపుతోంద‌ని, దీన్నినిషేధించాల‌ని కోరుతూ చెన్నైకు చెందిన న్యాయ‌వాది, సామాజిక కార్య‌క‌ర్త ముత్తుకుమార్ హైకోర్టును ఆశ్ర‌యించ‌డం, దీన్ని విచారించిన న్యాయ‌స్థానం యాప్‌ను నిషేధించాల‌ని తీర్పు ఇవ్వ‌డం జ‌రిగిపోయింది. ఈ యాప్‌కు చెందిన వీడియోలు ప్ర‌సారం చేయ‌వ‌ద్ద‌ని కూడా మీడియాకు సూచించింది. టిక్ టాక్ నిషేధంపై 16లోగా స్పందించాల‌ని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పు మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వం.. గూగుల్‌, యాపిల్ సంస్థ‌ల‌కు టిక్ టాక్‌ను నిషేధించాల‌ని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ టిక్ టాక్ సంస్థ సుప్రీంను ఆశ్ర‌యించింది. థ‌ర్డ్ పార్టీ అప్‌లో్డ్ చేసే వీడియోల‌కు తమ‌ను బాధ్యులను చేయ‌డం స‌బ‌బు కాద‌ని వివ‌రించింది. టిక్ టాక్ వేసిన పిటీష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన సుప్రీం.. స్టేకు నిరాక‌రించింది. అన్నీ అనుకున్న‌ట్టుగా జ‌రిగితే.. టిక్ టాక్ యాప్ క‌థ కంచికే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here