Home breaking news జీఎస్ఎల్‌వీ నాలుగో ద‌శ‌కు ఆమోదం | Gslv

జీఎస్ఎల్‌వీ నాలుగో ద‌శ‌కు ఆమోదం | Gslv

185
0

ప్ర‌స్తుతం అమ‌లు లో ఉన్న‌ జీఎస్ఎల్‌వీ నాలుగో ద‌శకు కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. 2021-2024 సంవ‌త్స‌రాల మ‌ధ్య కాలం లో మొత్తం అయిదు జీఎస్ఎల్‌వీ ప్ర‌యోగాలు ఉంటాయి. జియో-ఇమేజింగ్‌, నేవిగేశన్‌, డేటా రిలే క‌మ్యూనికేశ‌న్, ఇంకా అంత‌రిక్ష శాస్త్రాల కై ట‌న్ను శ్రేణి ఉప‌గ్ర‌హాలు రెండిటి ప్రయోగాని కి జీఎస్ఎల్‌వీ ప్రోగ్రామ్ నాలుగో ద‌శ మార్గాన్ని సుగమం చేస్తుంది.

ఆర్థిక ప్ర‌భావం:

అయిదు జీఎస్ఎల్‌వీ వాహక నౌక‌ల‌ కు అయ్యే వ్య‌యం, ఎసెన్శియల్ ఫెసిలిటీ ఆగ్మెంటేశన్, కార్య‌క్ర‌మ నిర్వ‌హ‌ణ‌, ఇంకా లాంచ్ క్యాంపేన్ తో పాటు ఇప్ప‌టికే అమ‌ల‌వుతున్న జీఎస్ఎల్‌వీ కొన‌సాగింపున‌ కు వెచ్చించ‌వ‌ల‌సిన అద‌న‌పు మొత్తం క‌లుపుకొని మొత్తం రూ. 2,729.13 కోట్లు ఖ‌ర్చు చేయ‌నుంది. క్లిష్ట‌త‌ర‌మైన ఉప‌గ్ర‌హ మార్గ‌నిర్దేశక సేవ‌లు, మాన‌వ ప్ర‌మేయంతో అంత‌రిక్ష నౌక కార్య‌క్ర‌మాని కి మ‌ద్ధ‌తు గా డేటా రిలే క‌మ్యూనికేశ‌న్ మరియు అంగార‌క గ్ర‌హానికి త‌దుప‌రి గ్రహాంతర యాత్ర కు అవ‌స‌ర‌మ‌య్యే ఉప‌గ్ర‌హాల ప్ర‌యోగాని కి జీఎస్ఎల్‌వీ కొన‌సాగింపు ప్రోగ్రామ్ యొక్క నాలుగో ద‌శ ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇది భార‌తీయ పరిశ్రమ లో ఉత్ప‌త్తి కొన‌సాగేందుకు కూడా దోహ‌దం చేయ‌నుంది. ప్ర‌తి ఏటా దేశ ప‌రిశ్ర‌మ యొక్క గ‌రిష్ఠ స్థాయి తోడ్పాటు తో రెండు సార్ల వంతు న ఉప‌గ్ర‌హాల‌ ను ప్ర‌యోగించ‌వ‌ల‌సిన అవ‌స‌రాన్ని జీఎస్ఎల్‌వీ కొన‌సాగింపు ప్రోగ్రామ్ నాలుగో ద‌శ నెర‌వేర్చ‌నుంది. అన్ని ఆపరేశనల్ ఫ్లయిట్స్ 2021-24 మ‌ధ్య కాలం లో పూర్తి కాగలవు.

ప్ర‌ధాన ప్ర‌భావం:

జీఎస్ఎల్‌వీ నిర్వ‌హ‌ణ క‌మ్యూనికేష‌న్, ఇంకా వాతావ‌ర‌ణ అధ్య‌య‌న సంబంధిత ఉప‌గ్ర‌హాల లో 2 ట‌న్నుల శ్రేణి శాటిలైట్ లను ప్ర‌యోగించ‌డం లో దేశాన్ని స్వ‌యం స‌మృద్ధం చేసింది. మార్గద‌ర్శ‌క ఉప‌గ్ర‌హాలు, స‌మాచార ప్ర‌సార సంబంధ ఉప‌గ్ర‌హాలు, ఇంకా గ్ర‌హాంత‌ర యాత్ర లు స‌హా, దేశ ఆవ‌శ్య‌క‌త‌ల ను నెర‌వేర్చే ఉప‌గ్ర‌హాల ప్ర‌యోగం లో స్వ‌యం స‌మృద్ధి ని మ‌రియు త‌త్సంబంధ సామ‌ర్ధ్యాన్ని బ‌లోపేతం చేయ‌డం లో జీఎస్ఎల్‌వీ కొన‌సాగింపు కార్య‌క్ర‌మం తోడ్ప‌ాటు ను అందించనుంది.

పూర్వ‌రంగం:

జీఎస్ఎల్‌వీ 2 ట‌న్నుల బరువు క‌లిగినటువంటి ఉప‌గ్ర‌హాల‌ ను జియోసింక్రనస్ ట్రాన్స్ ఫర్ ఆర్బిట్ (జిటిఒ) కు పంపించడం లో స్వ‌తంత్ర‌మైనటువంటి స‌త్తా ను అందించింది. అత్యంత సంక్లిష్ట‌మైన క్ర‌యోజ‌నిక్ ప్రొప‌ల్శన్ టెక్నాల‌జీ లో అందె వేసిన చేయి గా నిరూపణ కావడం జీఎస్ఎల్‌వీ కొన‌సాగింపు ప్రోగ్రామ్ యొక్క అతి ముఖ్య ఫ‌లితాల‌ లో ఒక‌టి. ఇది క‌మ్యూనికేష‌న్ శాటిలైట్స్ ను జీటీవో లోప‌ల కు ప్ర‌వేశ‌పెట్టేందుకు అత్యంత అవసరమైనటువంటి సాంకేతిక విజ్ఞాన సంబంధ సామర్థ్యం. ఇది హై థ్రస్ట్ క్ర‌యోజ‌నిక్ ఇంజ‌న్ ను అభివృద్ధి చేసేందుకు కూడా బాట‌ ను ప‌ర‌చింది. దీని కి తోడు త‌దుప‌రి త‌రానికి చెందిన వాహ‌క నౌక అయిన‌ జీఎస్ఎల్‌వీ ఎంకె-III కి కూడా రంగాన్ని సిద్ధం చేసింది. 2018 డిసెంబ‌ర్ 19న జీఎస్ఎల్‌వీఎఫ్‌-2ను ప్ర‌యోగించ‌డం లో సఫలమ‌య్యారు. 10 జాతీయ ఉప‌గ్ర‌హాల‌ ను విజ‌య‌వంతం గా క‌క్ష్య లోకి ప్రవేశపెట్టింది. జీఎస్ఎల్‌వీ దేశవాళీ క్రయోజనిక్ అప్పర్ స్టేజ్ త‌నంతట తాను కమ్యూనికేష‌న్ ఆధార‌ప‌డే వాహ‌క నౌక గా నిరూపించుకొంది. అంతేకాదు భ‌విష్య‌త్తు లో చేప‌ట్ట‌బోయే గ్ర‌హాంత‌ర యాత్ర‌ల కు కూడా ఇది స‌మ‌ర్ధంవంతంగా ప‌ని చేయ‌నుంది. జీఎస్ఎల్‌వీ కొన‌సాగింపు కార్య‌క్రమం 2003లో ప్రారంభ‌మైంది. ఇప్ప‌టికే రెండు ద‌శ లు పూర్తి అయ్యాయి. మూడో ద‌శలో పురోగ‌మిస్తోంది. ఇది 2020-21 నాలుగో త్రైమాసికానిక‌ల్లా పూర్తి అవుతుంద‌ని భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here