Home breaking news జిల్లా పరిషత్ చైర్మన్ కూడా పనీపాట లేకుండా ఉంటే ఎలా..? సీఎం కేసీఆర్

జిల్లా పరిషత్ చైర్మన్ కూడా పనీపాట లేకుండా ఉంటే ఎలా..? సీఎం కేసీఆర్

90
0
జిల్లా పరిషత్ చైర్మన్ కూడా పనీపాట లేకుండా ఉంటే ఎలా..? సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్

హైదరాబాద్​: స్థానిక సంస్థలకు అధికారాలను బదాలిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్​ స్పష్టం చేశారు. పంచాయతీలు, మండల పరిషత్​లు, జిల్లా పరిషత్​లు ఏం చేయాలో ఇక స్పష్టత ఇస్తామని ఆయన తెలిపారు. సహాయమంత్రి హోదా కలిగిన జిల్లా పరిషత్​ చైర్మన్​ ఇప్పటివరకూ పనిపాట లేకుండా ఉండేవారన్నారు. ప్రజలతో ఎంపీకైన ఎంపీపీ, జడ్పీటీసీ కథ కూడా ఇలాగే ఉండేదన్నారు. భవిష్యత్​లో ఇలా జరగడానికి వీల్లేదన్నారు. స్థానిక సంస్థలను నిధులు, విధులతో పాటు అధికారాలు కూడా బదలాయిస్తామన్నారు. స్థానిక సంస్థలకు కేంద్ర ఆర్ధిక సంఘం నిధులిచ్చే స్థాయిలో రాష్ట్ర వాటా కూడా కేటాయిస్తామన్నారు. నిధులు విడుదల చేసి.. విధులు అప్పగించిన తరువాత గ్రామాల్లో 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రారంభిస్తామని ప్రకటించారు. పంచాయతీలు, మండల పరిషత్​లు, జిల్లా పరిషత్​లు ఏం చేయాలో, వారి బాధ్యతలు ఎంతవరకూ, వారి అధికారాలు ఏ స్థాయి వరకన్న అంశాలన్నింటిపై పూర్తిగా అధ్యయనం చేసిన తరవాత తుదిరూపం ఇస్తామని సీఎం కేసీఆర్​ స్పష్టం చేశారు. మునిసిపల్​ ఎన్నికలు ముగిసిన తర్వాతే గ్రామాల్లో, పట్టణాల్లో 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తామని తెలిపారు. ఈలోగా పంచాయతీరాజ్​ శాఖలో ఖాళీలన్నీ భర్తీ చేయాలని అధికారులను కేసీఆర్​ ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here