Home breaking news జగదీశ్​రెడ్డికి విద్యాశాఖ అచ్చిరాదా. అందుకే మళ్లీ మార్చారా..?

జగదీశ్​రెడ్డికి విద్యాశాఖ అచ్చిరాదా. అందుకే మళ్లీ మార్చారా..?

109
0

ముఖ్యమంత్రి కేసీఆర్​కు అత్యంత సన్నిహితుడైన జగదీశ్​రెడ్డికి విద్యుత్​ శాఖను అప్పగించారు. ఆయన నుంచి తీసేసుకున్న విద్యాశాఖను కాంగ్రెస్​ హయాంలో హోంమంత్రిగా పని సబితారెడ్డికి అప్పగించారు. జగదీశ్​రెడ్డి గత ప్రభుత్వంలో కూడా ముందుగా విద్యాశాఖే తీసుకున్నారు. ఆ తరువాత జరిగిన కొన్ని పరిణామాల వల్లనో, ఎంపీగా గెలిచిన కడియం శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకోవడం వల్లనో.. జగదీశ్​రెడ్డి శాఖ మార్చి విద్యుత్​ శాఖను అప్పగించారు. విద్యాశాఖను కడియంకు ఇచ్చారు. విద్యుత్​ శాఖకు మార్చిన తరువాత కూడా కొనుగోలు అంశంలో గుంటకండ్లపై కొన్ని ఆరోపణలు వచ్చాయి.

ఇప్పుడు కూడా జగదీశ్​రెడ్డికి ముందుగా విద్యాశాఖే ఇచ్చారు. గ్లోబరిన్​ సంస్థ చేసిన నిర్వాకమో.. మంత్రిగా జగదీశ్​రెడ్డి వైఫల్యమా..? అన్న సంగతిని పక్కన పెడితే. ఇంటర్​ రిజల్ట్​లో జరిగిన అవకతవల కారణంగా పలువురు విద్యార్థుల ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ సందర్భంగానే.. మంత్రిగా జగదీశ్​రెడ్డి చేసిన బాధ్యతారహిత వ్యాఖ్యల కారణంగా పరిస్థితి మరింత దిగజారింది. సీన్​ కట్​ చేస్తే.. మంత్రివర్గ విస్తరణ, ఈ విస్తరణలో భాగంగా కొందరు మంత్రులను కట్​ చేస్తారన్నప్రచారం జరిగింది. కటింగ్​లు ఏమీ చోటు చేసుకోలేదు కానీ శాఖల్లో మార్పులు చేర్పులు మాత్రం జరిగాయి. సీఎం కేసీఆర్​కు అత్యంత సన్నిహితుడైన గుంటకండ్ల మంత్రి శాఖ మాత్రం చేంజ్​ అయింది. గత ప్రభుత్వంలో విద్యాశాఖలో జరిగిన పరిణామాల కారణంగా గుంటకండ్లను విద్యాశాఖ నుంచి విద్యుత్​ శాఖకు మార్చారు. ఇప్పుడు కూడా ఇంటర్​ రిజల్ట్​లో చోటు చేసుకున్న పరిణామాలు, విద్యార్థుల ఆత్మహత్యల కారణంగా విద్యాశాఖ నుంచి విద్యుత్​ శాఖకు మార్చారు. మళ్లీ సేమ్​ టు సేమ్​ సీన్​ రిపీట్​ అయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here