Home breaking news ద‌ళిత క్రైస్త‌వుల‌పై వివ‌క్ష చూపుతున్న చ‌ర్చ్‌

ద‌ళిత క్రైస్త‌వుల‌పై వివ‌క్ష చూపుతున్న చ‌ర్చ్‌

339
0
ఫొటోః గూగుల్ నుంచి సేక‌ర‌ణ

మాన‌వులంతా స‌మానులే అని బోధించే చ‌ర్చ్‌లో కూడా వివ‌క్షత ఉందా..? అంటే ఉందంటున్నారు పూర్ క్రిష్టియ‌న్ లిబ‌రేష‌న్ మూమెంట్ ( Poor Christians Liberation Movement) అధ్య‌క్షుడు ఆర్ఎల్ ప్రాన్సిస్‌. ఈ మేరకు ఆయ‌న రాసిన వ్యాసాన్ని ఆర్గ‌నైజ‌ర్‌ ప‌త్రిక ప్ర‌చురించింది. ఆయ‌న రాసిన వ్యాసంలో చ‌ర్చ్‌పై అనేక ప్ర‌శ్న‌లు కురిపించారు. ద‌ళిత విముక్తి ఆదివారం (Dalit Liberation Sunday) నిర్వ‌హించే చ‌ర్చ్ దళితుల‌పై వివ‌క్ష చూపుతోందని వెల్ల‌డించారు. వివ‌క్ష చూపించే చ‌ర్చ్‌.. స‌మాన ప్ర‌పంచం అంటూ ఆక‌ర్ష‌ణీయ‌మైన‌ నినాదాలు ఇస్తోంద‌ని పేర్కొన్నారు. దేశంలో 2.50 నుంచి 3 కోట్ల వ‌ర‌కూ ద‌ళితులు క్రైస్త‌వం ఆచ‌రిస్తున్నార‌ని పేర్కొన్న ఆయ‌న‌.. ఇప్పుడు చేరిన వారిపై స‌మానత్వం చూప‌ని చ‌ర్చ్‌.. హిందూ మతంలో ఉన్న ద‌ళితుల గురించి.. వివ‌క్ష, వారి న్యాయం గురించి ప్ర‌శ్నించ‌డ‌మేమిటీ.? ఈ సంద‌ర్భంగా ఆయ‌న చ‌ర్ఛ్‌ను ఉద్దేశించి ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు.

క్రైస్త‌వంలో చేరినా..మార్పులేదు

భార‌త‌దేశంలో వంద‌ల ఏళ్ల నుంచి ద‌ళితులను క్రైస్త‌వుల్లో చేర్చుకుంటున్నారు. ఇప్ప‌టికీ వారి ప‌రిస్థితి హిందూ ద‌ళితుల మాదిరిగానే ఉంది. అలాంట‌ప్పుడు వారి అభ్యున్న‌తి కోసం ఈ చ‌ర్చ్ ఏం చేసింది. ద‌ళిత వ‌ర్గం నుంచి క్రైస్త‌వంలో చేరిన వారి పాత్ర చ‌ర్చ్ స్థాప‌నలో దాదాపుగా లేదు. వారిపై వివ‌క్ష చూపుతున్న చ‌ర్చ్‌.. హిందూ వ్య‌వ‌స్థ‌పై నింద వేస్తున్న‌ది. క్రైస్త‌వ మతం వివ‌క్షఅంగీక‌రించ‌దు. దీనికి సాక్ష్య‌మే 1981లో కాథలిక్ బిషప్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా (సీబీసీఐ) క్రైస్తవ మతంలో కుల ఆధారిత వివక్షకు చోటు లేదంటూ చేసిన తీర్మానం ఆమోదం పొందింది. వాటిక‌న్ కూడా కుల ఆధారిత వివ‌క్ష‌ను, అంట‌రాని త‌నాన్ని వ్య‌తిరేకించింది. అయిన‌ప్ప‌టికీ.. చ‌ర్చ్‌లో ద‌ళితులు తీవ్ర వివ‌క్ష‌ను ఎదుర్కుంటున్నారు. మ‌తాధికారులు కూడా ద‌ళితుల‌కు వ‌న‌రులు అంద‌కుండా నియంత్రిస్తున్నారు. క్రైస్త‌వంలో చేరిన ద‌ళితుల‌ అభ్యున్నతిని ప‌క్క‌న పెట్టిన చ‌ర్చ్‌.. వారిని షెడ్యూల్ కులంలో చేర్చాల‌న్న డిమాండ్‌ను తెర‌పైకి తెచ్చి.. వారిని ప్ర‌భుత్వంపై ఉసిగొల్పింది. ఈ డిమాండ్ ద్వారా ఎక్క‌వ మ‌త‌మార్పిడి జ‌రిపించేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.

వీటిలో మా వాటా ఏదీ..?

మ‌త‌మార్పిడి అనేదీ ద‌ళిత క్రైస్త‌వుల సంక్షేమం అజెండాగా కొన‌సాగ‌డం లేదు. భార‌త్‌లో కాథ‌లిక్ చ‌ర్చ్ సామ్రాజ్య విస్త‌ర‌ణ‌కు మాత్ర‌మే సాధ‌నంగా మారింది. ఇందుకు నిద‌ర్శ‌నాలు అనేక‌మున్నాయి. 6 కార్డిన‌ల్స్ ఉన్నాయి.. వీటిలో ద‌ళ‌త క్రిస్టియ‌న్ లేరు. 30 ఆర్చ్ బిష‌ప్ ఇందులో ద‌ళిత క్రిస్టియ‌న్స్ లేరు. 175 మంది బిష‌ప్స్‌లో తొమ్మిది మంది ఉన్నారు. 822 ఉన్నాతాధికారుల్లో.. 12 మంది మాత్ర‌మే ద‌ళిత క్రిస్టియ‌న్లు ఉన్నారు. 25 వేల మంది కాథ‌లిక్ పుజారుల్లో 1130 మంది ద‌ళిత క్రిస్టియ‌న్లు. 90 వేల మంది సిస్ట‌ర్స్‌లో కేవ‌లం 4500 మంది మాత్ర‌మే ఉన్నారు. వివ‌క్ష‌పై ఢిల్లీ కాథ‌లిక్ ఆర్చ్ డియోసెస్ ఫాద‌ర్ విలియం ఆత్మ‌క‌థ “An Unwanted Priest”లో వివ‌రించారు.

వ్యాపారంపై శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయండి
భార‌త్‌లో ప్ర‌భుత్వం త‌రువాత చ‌ర్చ్‌ మాత్ర‌మే అత్య‌ధిక ఆస్తులు క‌లిగి ఉంది. కేవలం కాథలిక్ చర్చిలో 480 కళాశాలలు, 63 వైద్య కళాశాలలు, 9500 మాధ్యమిక పాఠశాలలు, 4000 ఉన్నత పాఠశాలలు, 14000 ప్రాథమిక పాఠశాలలు, 7500 నర్సరీ పాఠశాలలు, 500 శిక్షణా పాఠశాలలు, 900 సాంకేతిక పాఠశాలలు, 263 వృత్తిపరమైన సంస్థలు, ఆరు ఇంజనీరింగ్ కళాశాలలు, 3000 హాస్టళ్లు, 787 ఆసుపత్రులు, 2800 డిస్పెన్సరీలు మరియు హెల్త్ సెంట‌ర్లు న‌డుపుతోంది. వీటిని ప్రొటెస్టంట్లు న‌డిపిస్తున్నారు. వీటిల్లో దళిత క్రైస్తవ సమాజానికి చెందిన ఎంతమంది డీన్స్, ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు మరియు వైద్యులు ఉన్నారు.? మతమార్పిడితో పాటు క్రైస్తవుల సంక్షేమం కోసం విదేశాల నుంచి వ‌స్తున్న కోట్లాది రూపాయ‌లు పొందుతున్న చర్చ్.. నిర్వ‌హిస్తున్న సామాజిక సంస్థలకు ఎంత మంది దళిత క్రైస్తవులు డైరెక్టర్లుగా ఉన్నారు. ‘దళిత విముక్తి ఆదివారం’ జరుపుకునే ముందు చర్చి ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. ఎంత మంది దళిత క్రైస్తవ విద్యార్థులు తమ కాన్వెంట్ పాఠశాలల్లో విద్యను పొందుతున్నారో కూడా చ‌ర్చ్‌ చెప్పాలి..? వాస్తవికత ఏమిటంటే చ‌ర్ఛ్ వ్యాపార సంస్థగా మారి.. సంక్షేమం కాకుండా.. లాభాలను ఆర్జించాల‌న్న‌ ఉద్దేశ్యంతో నడుపబడుతోంది. చ‌ర్చ్‌కు నిబ‌ద్ధ‌త‌, ధైర్యం ఉంటే.. శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాలి.

ఇప్పుడు నేను ప్ర‌స్తావించిన అంశాలు చాల మంది విశ్వ‌సించ‌రు. కానీ ఇవి క‌ఠిన నిజాలు. హిందూ మ‌తంలో కొన‌సాగుతున్న ద‌ళితుల ప‌రిస్థితి ఇప్పుడు గ‌ణ‌నీయంగా మారింది. మార్పు కోస‌మ‌ని వ‌చ్చిన ద‌ళిత క్రైస్త‌వుల ప‌రిస్థితి అలాగే ఉంది. కొంద‌రు హిందూ దళితులు ‘దళిత ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ’ ప్రారంభించారు. కానీ, నిధుల‌కు కొర‌త లేకున్నా.. క్రైస్తవ దళితుల అభ్యున్న‌తికి చ‌ర్చ్ ఎలాంటి ప్ర‌ణాళిక‌లు రూపొందించ‌లేదు. కాథలిక్ చర్చ్‌ పోప్ బెనెడిక్ట్- XVI ఆధ్వర్యంలో ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో ద‌ళిత విముక్తి ఆదివారం నిర్వ‌హించే ముందు క్రైస్త‌వంలో చేరిన దళితులపై వివ‌క్ష చూప‌కుండా వారికి సరైన హక్కులు క‌ల్పించి న్యాయం జ‌రిగే విధంగా వ్య‌వ‌స్థ‌ను రూపొందించండి. (సౌజ‌న్యంః ఆర్గ‌నైజ‌ర్)

వ్యాసం లింక్‌https://www.organiser.org/Encyc/2019/7/6/Church-Should-Publish-a-White-Paper-on-its-Business-Operations.html

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here