Home breaking news చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు.. కాంగ్రెస్.. లెఫ్ట్ పొత్తులు..!

చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు.. కాంగ్రెస్.. లెఫ్ట్ పొత్తులు..!

240
0

చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడమంటే ఇదేనేమో. లోక్​సభ ఎన్నికలకు ముందు పొత్తులు కుదుర్చుకుందాము మొర్రో అని లెఫ్ట్​ మొత్తుకున్నా.. తామే అధికారంలోకి వస్తామన్న ఆశతో ఉన్న కాంగ్రెస్​ ససేమిరా అంది. చివరకు ఏమైంది. రెండు పార్టీలు బొక్కబోర్లా పడ్డాయి. బెంగాళ్లో లెఫ్ట్​ ఖాతా తెరవలేదు. కాంగ్రెస్​ రెండు సీట్లకే పరిమితమైంది. బీజేపీ లాభపడింది. ఈ దెబ్బకు రెండు పార్టీలకు ఇప్పుడు కళ్లు తెరుచుకున్నట్టున్నాయి. కలిసి పోటీ చేద్దామని అనుకున్నాయట.

బెంగాల్​ మూడు అసెంబ్లీ సీట్లకు జరిగే ఉప ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామని ఓ మాట అనుకున్నాయి. నార్త్‌ దినాజ్‌పూర్‌ జిల్లాలోని కలియాగంజ్‌, పశ్చిమ మిడ్నపూర్‌ జిల్లా ఖరగ్‌పూర్‌, నదియా జిల్లాలోని కరీంపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇదే మాట మీద ఉండి.. 2021లో జరిగే బెంగాల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేసి అధికారం  సంగతి ఎలా ఉన్నా.. కనీసం పరువు కాపాడుకుంటాయి. ఈ ఉప ఎన్నికల్లో కలిసి పోటీ చేసినా.. సీట్లు గెలుచుకోకుంటే.. ఎప్పటి చిప్ప ఎనుగుల అన్నట్టు దూరం జరుగుతాయోమో..? చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here