Home తాజా వార్తలు చేతులు కాలినంక ఆకులు పట్టుకున్న చంద్రబాబు

చేతులు కాలినంక ఆకులు పట్టుకున్న చంద్రబాబు

128
0

చేతులు కాలినంక ఆకులు పట్టుకోవడమంటే.. ఇదే అంటున్నారు.. చంద్రబాబు మాట్లాడిన తీరు చూసినోళ్లు. నిన్నటికి నిన్న చంద్రబాబు వైజాగ్​లో రివ్యూ జరిపారు. అదే ఓడిపోయిన తర్వాత మెల్లిగా రివ్యూ జరుపుతారుగా అలాంటిదన్నట్టు. ఈ రివ్యూలో కేంద్రంతో పంచాయితీ పెట్టుకునేదీ లేకుండే.. పెట్టుకొని నష్టపోయామంటూ వ్యాఖ్యానించారని ఆంధ్రజ్యోతి పత్రికల్లో వచ్చింది. టీడీపీ వార్త అందునా.. చంద్రబాబు ఆత్మ విమర్శ.. అది ఆంధ్రజ్యోతిలో వచ్చింది కాబట్టి 100కు 100 శాతం నమ్మి తీరాల్సిందే. కాకుంటే హెడ్డింగ్​ మార్చినట్టున్నారు. కేంద్రంతో అనడం కంటే మోదీతో పంచాయితీ పెట్టుకొని నష్టపోయామని పెడితే బాగుండేది. ఈ వార్త రాసిన జర్నలిస్ట్​ హెడ్డింగ్​ కచ్చితంగా మోదీతో అనే రాసి ఉంటారు. కానీ మార్చి ఉండవచ్చు. సరే హెడ్డింగ్​ విషయాన్ని పక్కన పెట్టి ముందుకు పోదాం.

ఎవరైనా ఒకడితో పంచాయితీ పెట్టుకునే ముందు.. వెనుకా ముందు ఆలోచిస్తరు. వాడి బ్యాంగ్రౌండ్​ ఏంటీ.. ఎలాంటి వ్యక్తి.. ఇలా ఆలోచించి పంచాయితీ పెట్టుకుంటరు. కానీ థర్టీ ఈయర్స్​ పొలిటికల్​ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు పెట్టేసుకున్నరు అది మోదీతో డైరెక్ట్​గా. గోద్రా రైలు దహనం కేసు తర్వాత జరిగిన ఘటనలపై మోదీని ఉద్దేశించి చంద్రబాబు ఏం మాట్లాడాడో అందరికీ ఎరుకే. మోదీని ఏపీలో అడుగుపెట్టనీయనన్నాడు. అది మోదీ మనసులో బలంగా నాటుకొని పోయింది. దెబ్బతీయడానికి అనువైన సమయం కోసం కాచుకున్నాడు. ఇది గమనించకుండా.. కాంగ్రెస్​ వైపునకు చంద్రబాబు వెళ్లారు. కూటమి కడ్తున్నానని చెప్పుకున్నాడు. చెప్పులు అరిగేలా దేశమంతా తిరిగాడు. చివరకు ఏమైంది. బంపర్​ మెజార్టీతో బీజేపీ గెలిచింది.

అప్పుడైనా బీజేపీతో కాదు కాదు మోదీతో రాజీమార్గం కోసం ప్రయత్నిస్తే బాగుండేదీ. బిగుసుకొని కూర్చుని.. ఆంధ్రజ్యోతి యాజమాన్యం చెప్పినట్టుగా సర్వే చేసి ఆ పత్రిక విలేకరులు (ఇంట్లో కూర్చుని) సర్వే చేసి.. ఫలితాలు విడుదల చేస్తే.. సర్వేల్లో బంపర్​ మెజార్టితో చంద్రబాబు గెలిచారు. ఇదే నిజమనుకొని అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డారు. చంద్రబాబు కంటే కేసీఆర్​ తెలివిగల్లోడు. ఏదో ఒకటి రెండు రాష్ట్రాలను పర్యటించారు. వాస్తవం బోధపడింది. కూటమి సంగతి దేవుడెరుగా ముందు నా సంగతి చూసుకుంటానని ముందస్తుకు వెళ్లాడు. పని చక్కబెట్టుకున్నాడు. చంద్రబాబుకు ఇప్పుడు తత్వం బోధపడింది. ఇప్పుడేమనుకొని ఏం లాభం. ఇంకా నాలుగేండ్లు టైముంది రాజేవరో..? మాజీ ఎవరో తేలడానికి. అప్పటికీ టీడీపీ సవ్యంగా ఉంటే. లేకుంటే..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here