Home breaking news చెప్పేటోడికి వినేవాడు లోకువ‌

చెప్పేటోడికి వినేవాడు లోకువ‌

166
0

చెప్పేటోడికి వినేవాడు లోకువని ఎవరికి వారు త‌మ‌కు తామే గొప్ప‌వాళ్లుగా చెప్పుకుంటూ ఇత‌రుల‌పై దుమ్మెత్తి పోస్తుంటారు. రాజకీయాల్లో ఇటువంటి ఎక్కువ‌గా ఎన్నిక‌ల ముందే జ‌రుగుతుంటాయి. లోక్‌స‌భ ఎన్నిక‌లొస్తున్నందున‌ తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో ఆ మాట‌కొస్తే దేశ‌మంతా అన్ని రాష్ట్రాల్లో ఫిరాయింపుల ప‌ర్వం మెద‌లైంది. నిన్న‌టి వ‌ర‌కూ ఎదుటి పార్టీని తిట్టిన వారే.. ఇయ్యాల‌.. నా నియోజ‌క‌వ‌ర్గం కోసం పార్టీ మారుతున్నానంటూ సుద్దులు చెబుతుంటారు. ఇంకొంద‌రైతే ఏకంగా అధికారంలో ఉన్న పార్టీ లేదా.. అధికారంలోకి వ‌స్తుంద‌నుకున్న పార్టీతోనే సామాజిక న్యాయం జ‌రుగుతుంద‌ని ఇంకేదో జ‌రుగుతుంద‌ని చెబుతుంటారు. ఈ మాట‌ల‌నే తెలంగాణ‌లో ఇప్పుడు టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లో చేర‌బోతున్న సండ్ర వెంక‌ట‌వీర‌య్య‌, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేర‌బోతున్న ఆత్రం స‌క్కు, రేగా కాంతారావు వ‌ల్లె వేస్తున్నారు. ఇదే విధంగా తెలుగు రాష్ట్రమైన ఏపీలో టీడీపీ, వైసీపీకి చెందిన నేత‌లు ఇటూ అటూ జంప్ చేస్తున్నారు. ఇక్క‌డ జరుగుతున్న‌ట్టుగానే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో కూడా బీజేపీ ఎంపీ సావిత్రిబాయి పూలేకు హ‌ఠాత్తుగా రాజ్యాంగ ప‌రిర‌క్ష‌ణ గుర్తొచ్చింది. అందుకే తాను కాంగ్రెస్‌లో చేరుతున్నాన‌ని ప్ర‌క టించింది. రాహుల్, ప్రియాంక స‌మ‌క్షంలో చేరిపోయింది. పనిలో ప‌నిగా బీజేపీపై విమ‌ర్శ‌లు గుప్పించింది. పార్టీ మార‌డం ఆమె ఇష్టమే కానీ, 2000 సంవత్సరంలో బీజేపీలో చేరి 2002, 2007, 2012 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 ఎన్నిక‌ల్లో బహ్రైచ్‌ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎంపీగా ఎన్నిక‌య్యారు. బీజేపీలో ఉన్న 18 ఏళ్లు రాజ్యాంగ ప‌రిర‌క్ష‌ణ బాగానే జ‌రిగింది. ఇన్నాళ్లు మీరూ బాగానే ఉన్నారు బీజేపీలో.. ఎన్నిక‌లు వ‌స్తున్న స‌మ‌యంలో ఇప్పుడే రాజ్యాంగానికి ముప్పొచ్చిందా.. పూలేజీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here