Home breaking news చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తున్న ఎంపీ క‌విత‌ – బీజేపీ నేత ధ‌ర్మ‌పురి అర్వింద్‌

చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తున్న ఎంపీ క‌విత‌ – బీజేపీ నేత ధ‌ర్మ‌పురి అర్వింద్‌

166
0

మోదీపై పోటీ చేస్తాన‌న్న వారు ప‌సుపు రైతుల కారు

హైద‌రాబాద్ః నిజామాబాద్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తున్నార‌ని బీజేపీ కార్య‌వ‌ర్గ స‌భ్యుడు, లోక్‌స‌భ అభ్య‌ర్థి ధ‌ర్మ‌పురి అర్వింద్ ఆరోపించారు. వార‌ణాసిలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీపై నిజామాబాద్ ప‌సుపు రైతులు పోటీ చేస్తున్నారంటూ వ‌చ్చిన క‌థ‌నాలు స‌రైన‌వి కావన్నారు. పోటీ చేస్తామంటూ వెళ్ల‌ని వ్య‌క్తులు టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల‌ని ఆయ‌న తెలిపారు. దీనికి సంబంధించి వివ‌రాలు కూడా అందించారు. మోదీపై పోటీ చేస్తామంటూ వెళ్లిన వ్య‌క్తులు లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేయలేద‌ని తెలిపారు. క‌విత కోసం టీఆర్ఎస్ క్రియాశీల కార్య‌క‌ర్త‌లంద‌రూ ప్ర‌చారం చేశార‌ని చెప్పారు. వీరిలో ఒక్క ప‌సుపు రైతు కూడా లేర‌న్నారు. కేవ‌లం త‌న‌కు వ్య‌తిరేకంగా 179 మంది పసుపు రైతులు పోటీ చేయడాన్ని జీర్ణించుకోలేక రైతుల పేరుతో వీరికి వేసవి ట్రిప్‌కు పంపించారని ఆరోపించారు. పసుపు రైతులపై కవితకు నిజమైన ప్రేమ ఉండి ఉంటే ఎందుకు బోనస్ ఇప్పించకుండా చిల్ల‌ర రాజ‌కీయాలు ఎందుకు చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. పసుపు,ఎర్రజొన్నకు గిట్టుబాటు ధర కల్పించి రైతుల బ్యాంకు ఖాతాలో వేస్తామని మా పార్టీ ఇటీవలి ఎన్నికల్లో హామీ ఇచ్చామ‌ని తెలిపారు.
నామినేష‌న్లు వేస్తామ‌న్న టీఆర్ఎస్ నేత‌లు వీరే

  1. తిరుప‌తి రెడ్డి- మ‌నోహ‌రాబాద్ మాజీ స‌ర్పంచ్, జ‌క్రాన్ ప‌ల్లి మండ‌లం. టీఆర్ఎస్ క్రియాశీల స‌భ్యులు, నాయకు

2.మిట్ట‌ప‌ల్లి గంగారెడ్డి- గోవింద్ పేట‌, ఆర్మూర్ మండ‌లం. టీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ఉపాద్యక్షులు

3.కొట్టాల చిన్నారెడ్డి- ప‌డిగెల‌, వేల్పూర్ మండ‌లం, రాష్ట్ర విత్త‌న స‌ర్టిఫికేష‌న్ సంస్థ డైరెక్ట‌ర్

4.వేముల శ్రీ‌నివాస్ – క‌మ్మ‌ర్ ప‌ల్లి , టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌

5.చింత గ‌ణేష్- క‌మ్మ‌ర్ ప‌ల్లి- టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌, ఇత‌నికి వ్య‌వ‌సాయం లేదు.

6.శ్రీ‌నివాస్ గౌడ్- ఎర్గ‌ట్ల‌, టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌, ఇతనికి పొలం త‌ప్ప ప‌సుపు పంట లేదు.

7.నాగ‌లింగం- నందిపేట మాజీ స‌ర్పంచ్, టీడీపీ నుండి టీఆర్ఎస్ లో చేరిన నాయ‌కుడు

8.గంగామోహ‌న్ – ఆర్మూర్- టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌గుర‌డి రాజ్ రెడ్డి- డిచ్ ప‌ల్లి- ఇక్క‌డ ప‌సుపు పంట పండ‌దు 9. నాగుల శ్రీ‌నివాస్- చింత‌లూరు, జ‌క్రాన్ ప‌ల్లి – టీఆర్ఎస్ నాయ‌కుడు. 10. నాగుల శ్రీ‌నివాస్- చింత‌లూరు, జ‌క్రాన్ ప‌ల్లి – టీఆర్ఎస్ నాయ‌కుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here