Home ఎడ్యుకేషనల్/జాబ్స్ గ్రూప్ ‌‌- 2 సాగతీత కథకు సుఖాంతం ఎన్నడూ..?

గ్రూప్ ‌‌- 2 సాగతీత కథకు సుఖాంతం ఎన్నడూ..?

624
0

భాస్కర్​ ఆర్​

సమకాలీన ప్రపంచంలో ఏ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా విద్యార్థి, నిరుద్యోగులకు జరగని అన్యాయం తెలంగాణ నిరుద్యోగులకు జరిగింది, జరుగుతూనే ఉంది. అనేక దశాబ్ధాలుగా ఎన్నో అవమానాలను దిగమింగి, మరెన్నో వ్యయ ప్రయాసలు పడి, ఉద్యమాలు పోరాటాలు చేసిన తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ యువకులు స్వరాష్ట్రన్ని సాధించిన తర్వాత కూడా నిరాశ, నిస్పృహ, నైరాశ్యం,  ఒకింత నిరుత్సాహం ప్రతి ఒకరిలో కనిపిస్తున్నాయి. కానీ ఒకప్పటి కుతుబ్షాహి పాలన నుండి అసఫ్ జాహి పాలన వరకు మరియు ప్రజాస్వామ్య ప్రభుత్వం బూర్గుల రామకృష్ణ రావు నుండి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం వరకు ఎన్నో అన్యాయాలు, అవమానాలు, కష్టాలు, నష్టాలూ భరించి, ముల్కి ఉద్యమం నుండి మలిదశ ఉద్యమం 14 ఎఫ్ వరకు ప్రతిదానిలో తమకు జరిగిన నష్టాన్ని పాలకుల కు తెలియపరిచారు. కానీ దాని ఫలితాలు పొందలేక, సాధించలేక మూగవేదనతో, మానసిక వ్యధ తో చతికిల పడి ఒక మర యంత్రం లా, జీవచ్చవంలా జీవనం గడుపుతున్నారు. ఒకరకంగా నిరుద్యోగుల గొంతు మూగపోయింది. కానీ ఇక్కడి నిరుద్యోగుల లోని ఆవేశాన్ని, ఆక్రోశాన్ని వారి ఆత్మ బలిదానాల ద్వారా యావత్ ప్రపంచం దృష్టికి తీసుకొచ్చ్చి స్వరాష్ట్ర స్వప్నాన్ని సాధించడం ఒక్కటే అతి పెద్ద్ద విజయం. ఈ ప్రాంతంలో ఎప్పుడు ఉద్యమం జరిగిన దానివెనుక బలమైన కారణం ఇక్కడ విద్యా, ఉద్యోగాల నియామకాలలో జరిగిన అన్యాయం గూర్చి మాత్రమే. అనేక సంవత్సరాలు గా కొల్లకొడుతున్న ఉద్యోగాల ను ఆపి, ఇక్కడి భూమి పుత్రులకే ఆ ఉద్యోగాలు దక్కాలని, వారి జీవితాలలో మార్పు రావాలని, స్వరాష్ట్రo వస్తే మా ఉద్యోగాలు మాకొస్తాయని  తెలంగాణ రాష్ట్రాన్ని కాంక్షించి ఏర్పాటు అయ్యేలా విజయ వంతం అయ్యారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం నిరుద్యోగుల విషయంలో ఇప్పటికి జాలి, దయ, కరుణ చూపట్లేదు. నాటి నిజాం పై సాయుధ పోరాటం చేసింది ఎవరు? , ముల్కి ఉద్యమం లో అసువులు బాసింది ఎవరు?,  ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో తెలంగాణకి జరిగిన అన్యాయాన్ని ఎప్పటికప్పుడు పాలకుల దృష్టికి తీసుకెళ్లింది ఎవరూ?, 1969 ఉద్యమం లో పోలిసుల తుటాలకు అమరులైన వారు ఎవరు? , మలి దశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు ఎవరు?,  ఈ ఉద్యమంలో 1200 ఆత్మ బలిదానాలు చేసుకుంది ఎవరో పాలకులు గ్రహించాలి, ఎందుకు ఈ పోరాటాలు, బలిదానాలో అర్థం చేసుకుని ఇంకా అన్యాయం జరగకుండా చూడాల్సిన భాద్యత ఇప్పటి ప్రభుత్వం పై ఉంది. 

తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు అయినా 2014 నుండి గమనిస్తే గడిచిన ఐదు సంవత్సరాలలో ప్రభుత్వ పాలనకు అనుగుణంగా నియామకాలు జరిగాయి. టీఎస్​పీఎస్​సీకి చక్రపాణిని చైర్మన్​గా నియమించడంతో నిరుద్యోగులకు  భరోసా కలగింది. తద్వారా ఒక మంచి ప్రయత్నం ఉద్యోగాల విషయంలో చేస్తున్నారని భావించిన విద్యార్థి, నిరుద్యోగులు వున్న ప్రైవేట్ ఉద్యోగాలను వదులుకొని లేదా చిరుద్యోగులుగా మారి, అప్పులు తెచ్చుకొని మరీ  పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు.  మొట్టమొదటి AEE, AEO నియామకాలు యుధ్ధ ప్రతిపాదికన జరిగాయి. ఆ తర్వాత 2015డిసెంబర్ 30 న గ్రూప్ -2 నోటిఫికేషన్ ఇచ్చ్చారు. ఆ తర్వాత రెండు కాన్స్టేబుల్,రెండు  S.I., fso, fbo, fro, gr-4, గురుకుల tgt, pgt, గురుకుల jl, dl, pcb ఇలా చాలా నోటిఫికేషన్ ఇచ్చినా, కోర్టు మెట్లు ఎక్కి, పడుతూ లేస్తు, ఎలాగోలా ఒక్కో నోటిఫికేషన్ కంప్లీట్ చేస్తున్నారు. కానీ ఒక్క గ్రూప్ -2 నియామకం తప్ప.

సాధారణ డిగ్రీ ద్వారా వచ్చిన ఒకే ఒక్క నోటిఫికేషన్ గ్రూప్ -2కు ఏ  నోటిఫికేషన్ కిలేని అవాంతరాలు, ఏ నోటిఫికేషన్ పై లేని, రాని, చూపని,  అపోహలు, అనుమానాలు ఈ ఒక్క నోటిఫికేషన్ పై ఎందుకు వచ్చాయో అర్థం కాకా ఆవేదన కలుగుతుంది. ఒకసారి ఈ gr-2 నోటిఫికేషన్ ను నిశితంగా పరిశిలిస్తే సెలెక్టెడ్ అభ్యర్థుల కష్టాలు తెలుస్తాయి. 2015 డిసెంబర్ 30 నా 400 పై చిలుకు పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. ఆ తర్వాత పోస్ట్స్ తక్కువగా ఉన్నాయని ధర్నాలు, వినతి పత్రాలు ఇస్తే పోస్ట్ ల సంఖ్య పెంచి మొత్త్తం 1032 కు సబ్ నోటిఫికేషన్ ఇచ్చి నవంబర్ 11, 13 తేదీల్లో పరీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు బాగానే ఉంది. ఇక్కడే అసలు కథ మొదలైనది. పరీక్ష రాసేటప్పుడు చిన్న చిన్న తప్పిదాలు చేసిన అభ్యర్థులు మమ్మల్ని క్షమించి మానవతా దృక్పధం తో పరిగణించాలి అని tspsc ని, హై  కోర్ట్ ను ఆశ్రయించారు.

Tspsc కూడా ఒక టెక్నికల్ కమిటీ  వేసి మెరిట్ దెబ్బ తినకుండా వీరిని తీసుకున్నారు. అలాగే 2017 జూన్ 2 న 1:3 మెరిటలిస్ట్ ను ఇచ్చి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి పిలిచారు. కానీ కొందరు అభ్యర్థులు రూల్స్ పాటించకుండా తప్పు చేసిన అభ్యర్థులను ఏ విధంగా తీసుకుంటారు అని హై కోర్ట్ వెళ్లి స్టే తెచ్చుకో వడం వల్ల ప్రాసెస్ ఆగిపోయింది. తర్వాత మూడు నెలల కాలంలో వాదనలు జరిగి జస్టిస్ ప్రవీణ్ కుమార్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి అనుమతి ఇచ్చి, tspsc ని కౌంటర్ దాఖలు చేయమన్నారు. కానీ ఇంటర్వ్యూ కి అనుమతి ఇవ్వలేదు. ఆ తర్వాత అనేక బెంచెస్ మారి తుదకు 2018 జనవరి లో జస్టిస్ నవీన్ రావు బెంచికి చేరింది. దాదాపు 9 నెలల కాలంలో 50 గంటలు వాదనలు విని, ఒక కమిటీ వేసిన న్యాయమూర్తి, రూల్స్ పాటించని అభ్యర్థులను తీసివేసి ఇంటర్వ్యూ నిర్వహించాలని తీర్పు ఇచ్చారు .

Tspsc కోర్ట్ తీర్పు ను స్వాగతించి తొలగించిన అభ్యర్థుల స్థానంలో నెక్స్ట్ మెరిటోరియస్ అభ్యర్థులకు 1:3 లో చేర్చి వెరిఫికేషన్ చేశారు. కానీ ఈ మధ్య కాలం లో తొలగించిన అభ్యర్థులు డివిషనల్ బెంచీ కి వెళ్లి స్టే తెచ్చుకున్నారు. దాదాపు 6 నెలలు వాదనలు ముగిశాక చిన్న తప్పులను పరిగణలోకి తీసుకోవడం వల్ల అభ్యర్థి నష్టపోతాడు అని కావున అందరికి అవకాశం ఇవ్వాలనిజూన్ 2019 లో  తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు అభ్యర్థులకు ఆశనిపాతంగా మారింది. Tspsc కోర్ట్ తీర్పును స్వాగతిస్తూ 1:2 లో ఇంటర్వ్యూ కి జులై 3 నుండి ఆగష్టు  26 వరకు ఇంటర్వూలు నిర్వహించింది  ఆ తర్వాత మెడికల్ పరీక్షలు నిర్వహించి, కంప్యూటర్ టెస్ట్ ని కూడా పూర్తి చేసింది. ఈ మధ్యకాలంలో కొందరు అభ్యర్థులు సుప్రీం కోర్ట్ కి వెళ్లారు కానీ వారి యొక్క పిటేషన్స్ ని డిస్మిస్ చేసింది. కానీ ఇప్పటికి ఇంకా ఫైనల్ రిజల్ట్స్ రాలేదు.

ఇప్పటికే కోర్ట్ కేసు ల పేరుతో నాలుగు సంవత్సరాలు వృధాగా గడిచిపోయాయి. కానీ గ్రూప్ 2 నియామకాలలో కదలిక రావట్లేదు. ఏ తప్పు చేయని అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు ఒక రకమైన కఠిన మానసిక శిక్షను అనుభవిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను, నిర్ణయాలను అమలు పరిచే అధికారులు వున్న ఈ జీఆర్​2 నియామకాలకు ఇంకా గ్రహణం వీడటం లేదు. కొత్థ జిల్లా లు, మండలాలు పెరిగిన తర్వాత కొత్థ నియామకాలు అవసరం పెరిగిన ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నారో అర్థం కావట్లేదు. కనీసం దసరా కి రిజల్ట్స్ వస్తే  కుటుంబ సభ్యులతో పండుగను ఆనందంగా గడపాలన్న మా ఆశలు అడియాశలు అయ్యాయి. ఎప్పుడో నాలుగు సంవత్సరాల కింద వచ్చిన నోటిఫికేషన్ కోర్ట్ కేసెస్ తో విసిగి వేశారి పోయాము. మా పై జాలి చూపకుండా మా భాధ ను అర్థం చేసుకోకుండా ఇంకా మా మానసిక వ్యధ ను పెంచి పోషిస్తున్నారు. ఇంటర్వ్యూ పూర్తి అయ్యి ఒక నెల పదిహేను రోజులు పూర్తి అయినా ఇంకా మెరిట్ లిస్ట్ పెట్టకుండా  ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నారో అవగతం కావట్లేదు. కనీసం ఒక డేట్ చెప్పి వెబ్ నోట్ కూడా చెప్పకుండా దాటివేస్తున్నారు. గ్రూప్ -2 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వచ్చిన అనేక నోటిఫికేషన్ లు పూర్తి అయ్యాయి మా దురదృష్టం కొద్దీ ఇంకా పూర్తి అవ్వలేదు అని భావిస్తున్నాము. మా భాధ ఎవరికి చెప్పాలో అర్థంకాదు, ఎలా చెప్పాలో తెలియడం లేదు. కానీ ఇప్పటికి tspsc పైన నమ్మకం మాత్రం సడలడం లేదు. కానీ ఎక్కడో ఒక నిరాశ, నైరాశ్యం వెంటాడుతున్నాయి.

ఉద్యమ సమయంలో చెప్పిన upsc మాదిరి ఇయర్ క్యాలెండరు ప్రకటించి ప్రభుత్వం కూడా ముఖ్య మైన విద్యా, వైద్య రంగాలలోని ఖాళీలను భర్తీ చేయాలి. యూనివర్సిటీ లలో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్ట్స్ లను పూరించాలి.  దాదాపు జే ఎల్, డి ఎల్, గ్రూప్ 1 నోటుఫికేషన్స్ రాక ఎనిమిది సంవత్సరాలు అయ్యింది. ఇవి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల ఆవేదన వర్ణణాతీతం. చిన్న చిన్న తప్పిదా ల వలన కోర్ట్ మెట్లు ఎక్కించి సమయం వృధా చేసుకుంటున్నారు. దీనిని గ్రహించి ఎలాంటి తప్పులు లేకుండా విశ్లేషణ చేసిన తర్వాతనే నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఎందుకంటే మా గ్రూప్ 2 సెలెక్టెడ్ అభ్యర్థులు అనుభవించిన భాధ ను ఎవరు అనుభవించకూడదు . నిజంగా ఈ భాధలు పోయి నిజమైన మార్పు రావాలంటే ఫైనల్ రిజల్ట్స్ ఇవ్వాలి.   మా జీవితాలను ఆనందం తో, సంతోషాలతో జరుపుకునేట్టు చేయాలనీ tspsc ని, ప్రభుత్వాన్ని గ్రూప్ 2 సెలెక్టెడ్ అభ్యర్థులమైన మేము అభ్యర్థిస్తున్నాము

భాస్కర్​ ఆర్​

గ్రూప్ 2 సెలెక్టెడ్ అభ్యర్థి 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here