Home breaking news గొర్రెలు.. బర్రెలు ఇవ్వడమెందుకు ఆపేశారంటే..! నవ్వురాక మానదు

గొర్రెలు.. బర్రెలు ఇవ్వడమెందుకు ఆపేశారంటే..! నవ్వురాక మానదు

284
0
సీఎం కేసీఆర్​ (ఫైల్​ఫొటో)

కురుమ, గొల్లలు, పాడి రైతులకు గొర్రెలు.. బర్రెలు సర్కారు ఇవ్వడం ఆపేసింది. అందరూ మంచిగ బతకాలే అని ఈ పథకం స్టార్ట్​ చేసినప్పుడు సర్కారు డోలు.. డప్పు కొట్టుకొని పాలాభిషేకం చేసుకుంది. ఆ తరువాత ఇదేం శనిరా నాయనా అనుకొని నెత్తి కొట్టుకొనే ఉంటంది. అందుకే గొర్రెలు. బర్రెలు ఇవ్వడం ఆపేసింది. ఈ పథకాన్ని 2017లో ప్రారంభించింది సర్కారు. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలంగా చేస్తామని.. కురుమ, గొల్లలకు అందుకే గొర్రెలు ఇచ్చేస్తున్నామని ప్రకటించింది. గొర్రెల  కాపర్ల సంఘం పేరున్న ప్రతోడికి ఇచ్చేస్తామని చెప్పేసింది. అందరూ దరఖాస్తులు చేసుకున్నరు. మొదటి విడత ప్రారంభం కావడం.. ఆర్నెళ్లు గడిచిందో లేదో..? సంపద సృష్టించేశామని చెప్పుకున్నారు. సీఎం కేసీఆర్​ ఆనాటి ప్రకటన..

యాదవ కమ్యూనిటీ దేశంలో కొట్లలో వుందనీ, అయినా మాంసం దిగుమతి చేసుకుంటున్నామని వివిధ రాష్ట్రాల కురుమ ప్రతినిధులతో సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణలో 35-40 లక్షల మంది గొల్ల-కురుమలున్నారానీ, వారి వృత్తి ప్రధానంగా గొర్రెల పెంపకమనీ, అయినా సుమారు 650 లారీల మాంసం రాష్ట్రం దిగుమతి చేసుకుంటున్నదన్నారు.  ఒక్క హైదరాబాద్ నగరానికే వేరే రాష్ట్రాల నుండి సుమారు 350 లారీల గొర్రెలను ప్రతిరోజూ దిగుమతి చేసుకుమ్తున్నామనీ, ఇది సిగ్గుపడాల్సిన విషయమన్నారు. ఇది పోవాలంటే ఏం చెయ్యాలనే విషయంలో తామంతా సుదీర్ఘంగా చర్చించిన తరువాత రు. 4,500 కోట్ల ప్రణాళిక రూపొందించామనీ సీఎం వారికి చెప్పారు. ఆ పథకం ప్రకారం రెండేళ్ళ వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 84 లక్షల గొర్రెలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. దీనిలో భాగంగా ఇప్పటికి 23. 80 లక్షల గొర్రెలను పంపిణీ చేసామని చెప్పారు. తమ గొర్రె కాపరుల కమ్యూనిటీనే తమ అసలు-సిసలైన మానవ వనరులని..అందుకే వాటి అభివృద్ధికి కంకణం కట్టుకున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. రెండేళ్ళ తరువాత హైదరాబాద్ నగరంలో అఖిల భారత షఫర్డ్ కమ్యూనిటీ సభలు జరుపుతామనీ, అప్పటికి ప్రపంచంలోనే అతి ధనవంతమైన కమ్యూనిటీగా తెలంగాణ షఫర్డ్ కమ్యూనిటీ రూపుదిద్దుకుంటుందన్నారు.

మొదటి విడత ముగిసి ముగియక ముందే.. బర్రెలిస్తామని పథకం ప్రారంభించింది. వీటిని కూడా కొంతమందికి ఇచ్చిన తర్వాత  సర్కారుకు నెత్తినొప్పి లేసినట్టైంది. అయినా రెండో విడత గొర్రెల పంపిణీ స్టార్ట్​ చేశారు. రెండో విడత గొర్రెల కోసం, బర్రెల కోసం అన్ని జిల్లాల్లో కలిపి లక్షల మంది డీడీలు చెల్లించి ఉన్నారు. చివరకు ఇది ఎందుకు పెట్టుకున్న తంటా అనుకున్నారో ఏమో కానీ సడన్​గా ఆపేశారు. గొర్రెలు.. బర్రెలు ఎందుకాపేసారంటే.. చెప్పే కారణం మాత్రం సూపరో సూపరు. అది వింటే నవ్వుకోవాల్సిందే. ఎండాకాలం కదా..? పసులకు నీళ్లు దొరకవు కదా..? అందుకే ఇవ్వడం లేదు అని చెప్పమని సర్కారు అధికారులకు చెప్పింది.. అధికారులు కూడా అదే ముచ్చట చెబుతున్నరు. మరీ ఇప్పుడు ఎండాకాలం పోయింది. వానాకాలం వచ్చి కూడా మూడ్నెళ్లు గడిచిపోయే. ఒక పక్క ఎక్కువ వానలతో.. వరదలు వచ్చినయి. ఇంకోపక్క సరిగా కురవక చెరువులల్లకు నీళ్లు కూడా రాలేదు. గొర్రెలు.. బర్రెలు మాత్రం ఇవ్వడం లేదు. సర్కారు ఖజానా ఖాళీగా ఉంటే.. గొర్రెలెక్కడ్నించి.. బర్రెలెక్కడ్నించి వస్తాయి. అందుకే ఇంకా గొర్రెలు, బర్రెల స్కీంకు ఎండాకాలం పోలేదు. వానాకాలం రాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here