Home తాజా వార్తలు గెలుపు కిక్కే వేరబ్బా.. సీఎం కేసీఆర్ తీరే నిదర్శనం

గెలుపు కిక్కే వేరబ్బా.. సీఎం కేసీఆర్ తీరే నిదర్శనం

275
0

గెలుపు ఇచ్చే కిక్కు ఎంతటి మత్తు పదార్థం తిన్నా.. రాదు. రాబోదు. అది ఎట్లా గెలిచాడు ఎలా గెలిచాడు అన్నది పక్కన పెట్టు. గెలిచాడా..? లేదా..? అన్నదే ఇక్కడ ముఖ్యం. దాని కిక్కే కిక్కు. ఆర్టీసీ సమ్మె ప్రారంభమైనప్పటి నుంచి కేసీఆర్​ అడుగు బయట పెట్టలేదు. ఒక్క మాట మాట్లాడలేదు. ఆ సాహసం కూడా చేయడానికి ఆయన ఇష్టపడలేదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పరిస్థితి అలా ఉంది. సమ్మె విషయంలో మీడియా కూడా ధైర్యం చేసింది. ప్రియారిటీ కూడా ఇచ్చింది. ఈ సమ్మె ప్రభావం హుజూర్​నగర్​ ఎన్నికలపై ఉంటుందని అందరూ అనుకున్నారు. కేసీఆర్​ అనుకున్నారో లేదో కానీ.. బహిరంగంగా మాట్లాడే సాహసం మాత్రం చేయలేదన్నది నిజం. సమ్మె ప్రారంభమైన తర్వాత కేసీఆర్​ కుమారుడు మంత్రి కేటీఆర్​.. హుజూర్​నగర్​ పర్యటనను రద్దు కూడా చేసుకున్నారు. వర్షం ప్రభావమా..? లేక ఇంకో కారణమా..? అన్న సంగతి పక్కన పెడితే.. కేసీఆర్​ కూడా తన సభను రద్దు చేసుకున్నారు.

ఎన్నికల ప్లానింగ్​ మాత్రం పకడ్బందీగా చేసుకున్నారు. ఎక్కడ ఏం చేయాలో అక్కడ అదే చేశారు. ప్రతి 50 మంది ఓటర్ల బాధ్యతను ఒక్క ముఖ్య కార్యకర్తకు అప్పగించారు. ఈ కార్యకర్త ఏం చేస్తాడు అన్న సంగతి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. చివరి నిమిషంలో తాము ఓడిపోతున్నామని గుర్తించిన కాంగ్రెస్​ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డి.. తీద్దామనుకున్న సొమ్మును పక్కన పెట్టేశాడు. ఓడిపోయేదానికి పంచడం వేస్టని. చివరకు టీఆర్​ఎస్​ గెలిచింది. అలా ఇలా కాదు. బ్రహ్మాండమైన మెజార్టీతో. ఈ గెలుపు ఇచ్చిన కిక్కుతో 19 రోజుల తర్వాత కేసీఆర్​ బయటకు వచ్చారు. దాదాపు గంటన్నర మాట్లాడేశారు. తనదైన స్టైల్​తో పాటు గెలుపిచ్చిన కిక్కుతో ప్రతిపక్షాలను, వ్యక్తులను అందరినీ పీకి పాకాన పెట్టేశారు. ఆర్టీసీ ఏం కాబోతుందో కూడా చెప్పేశారు. టీఆర్​ఎస్​ అభ్యర్థి గెలవడానికి డబ్బు ఒక్కటే కాదు అనేక కారణాలున్నాయి. ఓడిన సానుభూతి. రాష్ట్రంలో కేసీఆర్​ అధికారంలో ఉన్నాడు. వరుసగా ఉత్తమ్​ను గెలిపించిన ప్రజలు మార్పు కోరుకున్నారు. గెలుపు అనేదీ ముఖ్యం. అది ఇచ్చే కిక్కును ఆస్వాదించడమూ ముఖ్యమే. కానీ గెలిచాము కదా..అన్న కిక్కులో పరిధిని దాటితే .. ఆ కిక్కును దించడానికి కూడా ప్రజలే ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here