Home తాజా వార్తలు గురివింద గింజ‌ నీతులు

గురివింద గింజ‌ నీతులు

255
0
  • వికాస్ రుషి

ప‌్ర‌తి ఒక్క‌డిలో బ‌ల‌హీన‌త‌లుంటాయి. త‌ప్పులూ చేస్తారు. దీనికే త‌ప్పులు చేయ‌డం మాన‌వ స‌హ‌జం అన్న మాట కూడా అంటుంటారు. అయిన‌ప్ప‌టికీ.. ఎవ‌డికి వాడు ప‌క్కోడి గురించి మాట్లాడుతారు. వాడు ఇటువంటోడు. అటువంటోడు. చెడ్డ‌వాడు నేను మాత్రం మంచోడిని అని చెప్పుకుంటారు. వినేవాళ్లంత ఎర్రిప‌ప్ప‌ల‌నుకుంటారేమో.? త‌ప్పులెన్నువారు త‌మ త‌ప్పులెరుగ‌రన్న విష‌యం మాకు తెలియ‌దా..? ఏంటీ అని వినేవాళ్లు కూడా అనుకుంటుంటారు. ఎదుటి వాడి త‌ప్పులను ఎంచ‌డం రాజ‌కీయాల్లో మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంది. దీనినే గురివింద గింజ నీతి అంటారు. అంటే గురివింద‌గింజ ఎరుపు, న‌లుపు క‌ల‌ర్స్‌లో ఉంటుంది. త‌న కింది న‌లుపును కాకుండా..ఎరుపునే చూపించుకుంటార‌ని అందుకే గురివింద గింజ నీతి అంటుంటారు. ఇప్పుడీ ప్ర‌స్తావ‌న ఎందుకొచ్చిందంటే.. మేము రైతుల‌ను జైలుకు పంపించము. వాళ్లు తీసుకున్న రుణాలు చెల్లించ‌కున్నా అడ‌గ‌మూ అని మొన్నో మీటింగ్‌లో కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్‌బాబు నొక్కి వ‌క్కాణించారు. ఈ మాట ఆయ‌న‌ ఎందుక‌న్నారంటే.. ఇటీవ‌ల త‌మిళ‌నాడు స‌హా వివిధ రాష్ట్రాల‌కు చెందిన ప‌లువురు రైతులు త‌మ స‌మ‌స్య‌ల‌పై ఆందోళ‌న‌కు దిగ‌డం, వారిని పోలీసులు అరెస్ట్ చేయ‌డం విడిచిపెట్ట‌డం వంటి ఘ‌ట‌న‌ల‌ను జ‌రిగాయి. ఆ స‌మ‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం వారి ఆందోళ‌న‌ను ప‌ట్టించుకోలేద‌ని వార్త‌లు. కానీ అంత‌ర్గ‌తంగా బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా.. రైతుల ఆందోళ‌న‌ల‌కు నాయ‌క‌త్వం వ‌హించిన వారిని పిలిపించి స‌మ‌స్య‌లు ప‌రిష్కరిస్తామ‌ని హామీ ఇచ్చార‌ని త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌భుత్వం కాకుండా పార్టీ హామీ ఇవ్వ‌డ‌మేందీ..? అన్న ప్ర‌శ్న త‌లెత్త‌వ‌చ్చు. ఇప్పుడు పార్టీకి, ప్ర‌భుత్వానికి తేడాలెక్క‌డున్నాయ‌బ్బా. ఇటువంటి ఆందోళ‌న‌లు కాంగ్రెస్ పాలించిన 55 ఏళ్ల‌లో ఎన్న‌డూ జ‌ర‌గ‌లేద‌నుకుంటున్నారేమో..? రాహుల్బాబు.. బాబూ అరెస్ట్‌లు ఏమి క‌ర్మ‌.. కాల్పులు కూడా జ‌రిగిన సంఘ‌ట‌న‌లున్నాయి.

ముదిగొండ కాల్పుల చిత్రాలు

ఎక్క‌డో జ‌రిగిన సంఘ‌ట‌న‌లు ఎందుకు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఖ‌మ్మం జిల్లా ముదిగొండలో 28 జూలై 2007లో పోలీసులు జ‌రిపిన కాల్పుల్లో 7 గురు సామాన్యులు హ‌త్య‌కు గుర‌య్యారు. వీరు అడిగింది.. నివాసముండ‌డానికి ఇళ్లు, బత‌కడానికి ప‌ని. ఈ రెండు న్యాయ‌మైన కోర్కెలు. వీటిని ప‌రిష్క‌రించాల‌ని వామ‌ప‌క్షాల నేతృత్వంలో రోడ్డెక్కిన బ‌డుగు జీవుల‌పై స‌ర్కారు తుపాకి గ‌ర్జించింది. ఏడుగురు బ‌డుగులు హ‌త్య‌కు గుర‌య్యారు. ఆ స‌మ‌యంలో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని మ‌న్మోహ‌న్‌సింగ్ యూపీఏ స‌ర్కారు.. ఏపీలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి స‌ర్కారు అధికారంలో ఉన్నాయి. ఇవి అరెస్ట్‌లు కావు. కాల్పులే ఏకంగా ఏడుగురు బ‌డుగుల మృత్యువాత‌. ఈ ఉద్య‌మానికి నాయ‌క‌త్వం వ‌హించిన వామ‌ప‌క్షాలు ఆనాడు కాంగ్రెస్ ప్ర‌భ‌త్వంపై విరుచుక‌ప‌డ్డాయి.

బ‌షీర్‌బాగ్ చిత్రం

త‌మ పాల‌న‌లో జ‌రిగిన‌ బ‌షీర్‌బాగ్ కాల్పుల‌కు స‌మాధానం చెప్ప‌ని టీడీపీ కూడా అంతెత్తున లేచింది. విద్యుత్ ఛార్జీలు పెంచార‌ని 8 ఆగ‌స్టు 2000 సంవ‌త్స‌రంలో వామ‌ప‌క్షాల ఆధ్వ‌ర్యంలో రైతులు బ‌షీర్‌బాగ్ లో ఆందోళ‌న నిర్వహించారు. ఈ ఆందోళ‌న‌కు స‌ర్కారు తుపాకి ఇచ్చిన తూటాల జ‌వాబుతో ముగ్గురు రైతులు హ‌త్య‌కు గుర‌య్యారు. ఆనాటి వాజ్‌పేయ్ స‌ర్కారులో టీడీపీ భాగ‌స్వామి.

వామ‌ప‌క్షాల‌ నేతృత్వంలోని ప‌శ్చిమ‌బెంగాల్లోని నందిగ్రామ్‌లో 14 March 2007న‌ జ‌రిగిన ద‌మ‌న‌కాండ త‌క్కువేమీ కాదు. ఆనాడు పోలీసులు జ‌రిపిన‌ కాల్పుల్లో 14 మంది సామాన్యులు హ‌త్య‌కు గుర‌య్యారు. ఈ రెండు ఘ‌ట‌న‌ల‌కు మ‌ధ్య కేవ‌లం నాలుగు నెల‌లే తేడా. ఆనాటి యూపీఏ -1 ప్ర‌భుత్వం లో వామ‌ప‌క్షాలు కూడా భాగ‌స్వామే. ఈ పార్టీల‌కు ఇవేమీ గుర్తుండ‌వు కానీ పక్కోడు త‌ప్పులు చేశారంటూ మాత్రం ఆరోపిస్తారు. పెద్ద పారిశ్రామిక వేత్త‌ల‌కు పెద్ద‌మొత్తంలో రుణాలు ఇచ్చింది కాంగ్రెస్ హ‌యాంలోనే క‌దా. వీళ్ల ప్ర‌భుత్వాలు కూడా పారిశ్రామిక వేత్త‌ల రుణాలు మాఫీ చేశారు క‌దా. బీజేపీ వాళ్లే కొత్త‌గా చేసిన‌ట్టు చేసిన‌ట్టుగా ప్ర‌చారం. స‌రే రైతుల ప్ర‌స్తావ‌న వ‌చ్చింది కాబ‌ట్టి.. గ‌తేడాదిలో జ‌రిగిన రెండు సంఘ‌ట‌న‌లు తీసుకుందాం.

తెలంగాణ‌లోని ఖ‌మ్మం జిల్లాలో గిట్టుబాటు ధ‌ర కోసం మిర్చి రైతులు ఆందోళ‌న చేస్తే వారికి సంకెళ్లు వేసింది ఇక్క‌డి ప్ర‌భుత్వం. రైతుల‌కు సంకెళ్లు వేసిన ఈ తెలంగాణ‌ ప్ర‌భుత్వం కూడా తాము రైతు ప‌క్ష‌పాతిమ‌ని చెప్పుకుంటోంది.

మ‌హారాష్ట్ర‌లో రైతులు

మ‌హారాష్ట్ర‌లో రైతులు త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్కరించాల‌ని కిలోమీట‌ర్ల మేర న‌డిచి వ‌స్తే.. వారికి అక్క‌డి బీజేపీ స‌ర్కారు… వారి ఆందోళ‌న‌కు ఎలాంటి అడ్డంకులు క‌ల్పించ‌కుండా.. సాద‌రంగా ముంబాయిలో అడుగు పెట్ట‌నిచ్చింది. వారితో చ‌ర్చ‌లు కూడా జ‌రిపింది. ప్ర‌త్య‌ర్థి పార్టీపై చెడు చెప్పిన‌ప్పుడు మంచి కూడా చెప్పాలి క‌దా. ఇందులో ఏ పార్టీ త‌క్కువేమీ కాదు. బీజేపీకి కూడా మిన‌హాయింపు లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here