Home breaking news గుత్తా చిన్నమనిషే.. అందుకే మంత్రి పదవి దక్కలేదు

గుత్తా చిన్నమనిషే.. అందుకే మంత్రి పదవి దక్కలేదు

117
0
గుత్తా సుఖేందర్​రెడ్డి

గుత్తా సుఖేందర్​రెడ్డి చిన్న మనిషి అందుకే మంత్రి పదవి దక్కలేదు. ఇది నిన్నటి అసెంబ్లీ సమావేశం సందర్భంగా లాబీల్లో జరిగిన చర్చ. ఛా ఊరుకోండి.. గుత్తా ఇంతెత్తు మనిషి ఆయన చిన్నవాడేంటీ అనుకోకండి తాను చిన్నమనిషి అన్న అర్థంలోనే గుత్తా మాట్టాడారు. మంత్రివర్గ విస్తరణలో కచ్చితంగా మంత్రి పదవి గుత్తా సుఖేందర్​రెడ్డికి వస్తుందని ప్రచారం.. అప్పట్లో కేసీఆర్​ ఇచ్చిన లోపాయికారి హామీ ఇవన్నీ కలిపి అందరూ అనుకున్నదే. కేసీఆర్​ నుంచి వచ్చిన హామీ ప్రకారం గుత్తా కూడా నిజమే అనుకున్నారు. లేకుంటే మొన్నటి లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేసేటోడే. ఎమ్మెల్సీ ఇస్తానన్నడు. గవర్నమెంట్ మనదేనాయే.. కచ్చితంగా మంత్రిని అనుకున్నడు.

ఎమ్మెల్సీ వరకూ ఓకే కానీ మంత్రి పదవి విషయంలోనే షాక్​ తగిలింది గుత్తాకు. ఆళ్లకు ఈళ్లకు ఇచ్చాడు కానీ గుత్తాకు ఇవ్వలేదు. కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే.. గుత్తా ముఖం చిన్నబోయే. నిన్న బడ్జెట్​ సమావేశాల సందర్భంగా లోపల కలిసి పేపరోళ్లతోనే గుత్తా తన బాధ కొంచెం వెళ్లగక్కిండు. ‘పెద్దోళ్లకు మంత్రి పదవులు వచ్చాయి’ అనుకుంటూ ముఖం చిన్న చేసుకొని పోయిండు. పెద్దోళ్లు అంటే తనను చిన్నగా చేశారని అర్థమేగా.. అందుకే గుత్తా చిన్నమనిషి అని అనుకుంటున్నారు. మంత్రి పదవి వస్తుందని గుత్తా అనుకున్నారు. రాలేదు కానీ చివరకు శాసనమండలి చైర్మన్​ పదవి దక్కింది. గుడ్డిలో మెల్ల అంటే ఇదే. ఇది కూడా రాకుంటే చేసేదేముంది. కేసీఆర్​ను ఎదిరిచ్చేదేమన్నా ఉందా.? చూసి ఊకోవాల్సాందేగా. మండలి చైర్మన్​గా ఆయన చేసేదేముందిలే గతంలో స్వామిగౌడ్​ను చూశాముగా ఏం చేశారని కొందరైతే అప్పుడే గుస గుసలు పెడ్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here