Home ఎడ్యుకేషనల్/జాబ్స్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన స్టాప్ సెలక్షన్ కమిషన్

ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన స్టాప్ సెలక్షన్ కమిషన్

54
0
ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన స్టాప్ సెలక్షన్ కమిషన్

ఖాళీగా ఉన్నపోస్టులను భర్తీ చేయడానికి స్టాప్​ సెలక్షన్​ కమిషన్​ నోటిఫికేషన్​ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల కోసం 230 కేటగిరిలకు చెందిన 1351 ఖాళీల భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ ఉద్యోగాల కోసం అర్హతలు, నియమ నిబంధనలతో పాటు ఇతర అంశాలకు, దరఖాస్తు ప్రత్రాలకు స్టాప్​ సెలక్షన్​ కమిషన్​ వెబ్​సైట్​ ssc.nic.inతో పాటు సదరన్​ రీజినల్​ ఆఫీస్​ వెబ్​సైట్​ sscsr.gov.in లో లభ్యమవుతాయి. ఈ ఖాళీల్లో చెన్నైలోని సదరన్​ రీజియన్​కు సంబంధించిన ఖాళీలు కూడా 1351లో చేర్చారు.  ఎస్సీ, ఎస్టీ, ఈఎస్​ఎమ్​, పీడబ్ల్యూడీ తదితర కేటగిరీలకు చెందిన వారుతో మహిళా అభ్యర్థులకు కూడా ఎలాంటి ఫీజు ఉండదు. అర్హులైన వారు ఆన్​లైన్​లో sscsr.gov.in ద్వారా ఈ నెల 31 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత పరీక్ష కూడా ఇదే ఏడాది నిర్వహించే అవకాశముంది.

పూర్తి వివరాలకు.. https://ssc.nic.in/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here