మనం కలలో కూడా ఊహించని సంఘటలు కొన్ని జరుగుతుంటాయి. ఇలా జరుగుతుందా…అన్న ఆశ్చర్యాలకు లోనవుతుంటాము. చైనాలో కూడా సరిగ్గా మనం ఊహించని విధంగా బస్సు ఆపి మరీ.. విషయమేమిటంటే.. చైనాలోని ఓ రహదారిపై చెత్త డబ్బా బోర్లాపడి ఉంది. పారిశుధ్య కార్మికుడు రోడ్డుపై పడిన చెత్తను ఏరి డబ్బాలో వేస్తున్నాడు.
అదే సమయంలో అదే రోడ్డుపై వెళ్తున్న ఒకబస్సు.. ఆగింది. అందులోంచి డ్రైవర్ సహా ముగ్గురు వ్యక్తులు గబ గబా కింది దిగి..చెత్తను ఏరి డబ్బాలో వేసి వెళ్లిపోయారు. ఇలా జరుగుతుందని మనమైతే ఊహించలేం. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తరువాత స్వచ్ఛ్భారత్ నినాదమిచ్చారు. నిదులు విడుదల చేశారు. సినీనటులు సహా పెద్ద పెద్ద వాళ్లంత మేమున్నామంటూ రంగంలోకి దిగారు. చీపుర్లు పట్టుకొని ఫొటోలకు ఫోజులిచ్చారు. ఫొటోలు మీడియాలో వచ్చాయి. స్వచ్ఛ్ భారత్ నినాదమూ సజీవంగా ఉంది. ప్రధానమంత్రే రంగంలోకి దిగినా.. ఫలితం కొంతే.. స్వచ్ఛ్ భారత్ మాత్రం ఇంకా పూర్తిగా ఏర్పడలేదు.