Home breaking news క‌ర్నూలులో ఘోర ప్ర‌మాదం- 15 మంది మృతి | Road Accident in kurnool(ap)

క‌ర్నూలులో ఘోర ప్ర‌మాదం- 15 మంది మృతి | Road Accident in kurnool(ap)

179
0

క‌ర్నూలు క‌ర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో 15 మంది మృతి చెందారు. ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ బ‌స్సు.. తుఫాన్ వాహ‌నాన్ని ఢీ కొన‌డంతో ప్ర‌మాదం జ‌రిగింది. ఎదురుగా వ‌స్తున్న బైక్‌ను త‌ప్పించ‌బోయిన బ‌స్సు డ్రైవ‌ర్, తుఫాన్ వాహ‌నాన్ని ఢీ కొట్ట‌డంతో ఈ ప్రమాదం జ‌రిగింది.
వెల్దుర్తి క్రాస్‌ రోడ్డు వద్ద ఈ ఘటన జరిగింది. మృతులు గద్వాల జిల్లా శాంతినగర్‌ మండలం రామపురం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. బెంగ‌ళూరు నుంచి హైద‌రాబాద్‌కు వ‌స్తున్న ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్‌కు చెందిన బ‌స్సు.. అతి వేగంగా వ‌స్తున్న స‌మ‌యంలో ఎదురుగా వ‌స్తున్న టూ వీల‌ర్‌ను త‌ప్పించ‌బోయిన డ్రైవ‌ర్ డివైడ‌ర్ పైకి బ‌స్సును ఎక్కించి.. అవ‌త‌లి వైపున‌కు వెళ్లి గ‌ద్వాల వైపున‌కు వ‌స్తున్న తుఫాన్‌ను వేగంగా ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో వాహ‌నంలో ప్ర‌యాణిస్తున్న వారిలో 13 మంది అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు. బైక్‌పై ఉన్న వ్య‌క్తి, మ‌రో వ్య‌క్తిని చికిత్స‌కు త‌ర‌లిస్తుండ‌గా.. మ‌ర‌ణించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here