Home breaking news కోమటిరెడ్డికి మూడు గంటల్లో మూడే మారిపోయింది

కోమటిరెడ్డికి మూడు గంటల్లో మూడే మారిపోయింది

137
0
ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మూడు గంటల్లో మూడే మారిపోయింది. మధ్యాహ్నం కేసీఆర్​ను తీవ్ర స్థాయిలో విమర్శించి.. సాయంత్రానికి చల్లబడిపోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ యాదగిరిగుట్టను సందర్శించిన సమయంలో ఎంపీ కోమటిరెడ్డి అక్కడికి వచ్చారు. కేసీఆర్​ గుట్టపైన ఉన్న సమయంలోనే.. పైకి వచ్చిన కోమటిరెడ్డి.. కొత్తగా నిర్మిస్తున్న గర్భాలయంలోకి  వెళ్లడానికి ప్రయత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు ఆయనను పక్కకు తీసుకెళ్లి.. కొత్త నిర్మాణాల గురించి వివరించడం మొదలు పెట్టారు. తనను ఇప్పుడే లోనికి వెళ్లనీయరని కోమటిరెడ్డి భావించారో ఏమో కానీ..బాలాలయంలో స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి వెళ్లారు. ఆ తరువాత మళ్లీ గర్భాలయం వద్దకు వచ్చి.. కేసీఆర్​ కోసం వేచి చూడడం ప్రారంభించారు. అదే సమయంలో గర్భాలయంలోంచి బయటకు వచ్చి.. కోమటిరెడ్డి వైపునకు చూడకుండానే.. పక్కనే ఉన్ ప్రాకారాల వైపునకు వెళ్లిపోయారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన విలేకరులతో కోమటిరెడ్డి తన అక్కసునంతా వెళ్లగక్కారు. ప్రజల సమస్యలను వదిలి గుడి కోసం ఇన్నిసార్లు రావాలా..? ఇక్కడ తాపీ మేస్త్రికి పని అప్పజెపితే అయిపోయేదీ..? ప్రజలు తాగునీళ్ల కోసం ఇబ్బందులు పడుతుంటే  ఈయన కాళేశ్వరం పేరుతో అక్కడ గుడి పేరుతో ఇక్కడ తిరుగుతున్నారంటూ కోమటిరెడ్డి ఎటకారంగా చెప్పుకొచ్చారు.

వెంకట్​ ఇక్కడే ఉంటావా..?

అదే సమయంలో కేసీఆర్​ బయటకు వచ్చి రాగానే.. కోమటిరెడ్డిని పలకరించారు. వెంకట్​ ఇక్కడే ఉంటావా..? హరితలో కలుద్దాం. మిగిలినవి పరిశీలించి వచ్చేస్తా అంటూ కేసీఆర్​ చెప్పడంతో సరేనంటూ కోమటిరెడ్డి తలూపేశారు.

నన్ను ఇంటికి రమ్మన్నారు

ఆలయ పనుల పరిశీలన పూర్తైన తరువాత కేసీఆర్​తో కోమటరెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అదే సమయంలో అక్కడే మంత్రి గుంటకండ్ల జగదీశ్​రెడ్డి కూడా ఉన్నారు. గంటకు పైగా సాగిన వీరి సమావేశం ముగిసిన తర్వాత కోమటరెడ్డి విలేకరులతో శాంతంగా మాట్లాడారు. కేసీఆర్​తో.. ప్రజల తాగు సమస్యల గురించి మాట్లాడాడనని ఆయన కూడా సానుకూలంగా స్పందించారని కోమటిరెడ్డి వివరించారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారని, నన్ను ఇంటికి కూడా రమ్మన్నారని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో మిమ్మలను ఆలయంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు కదా.? అంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నించడంతో.. నేను ఎంపీని నన్నెవరు అడ్డుకుంటారు. నన్ను ఆయన పిలవలేదు. ఆయనను కలవాలని నాకు అన్పించలేదంటూ చెప్పేశారు. పనిలో పనిగా తాను మంత్రి జగదీశ్​రెడ్డిని కేసీఆర్​ ముందే తిట్టేశాను. కావాలంటే జగదీశ్​ను కూడా అడగంటంటూ తనకు దగ్గరగా ఉన్న విలేకరులకు స్పెషల్​గా చెప్పి వెళ్లిపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here