Home breaking news కేసీఆర్ మార్కు బడ్జెట్ సమావేశాలు.. ఐదు రోజుల్లోనే ముగింపు..?

కేసీఆర్ మార్కు బడ్జెట్ సమావేశాలు.. ఐదు రోజుల్లోనే ముగింపు..?

268
2

బడ్జెట్​ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్​ తన మార్కు మరోసారి చూపిస్తున్నారు. ఈ సమావేశాలు మొత్తం 5 రోజుల్లోనే ముగిసే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. సెప్టెంబర్​లో వరుసగా సెలవులు, శాంతి భద్రత సమస్యలు, పోలీసుల పహరా.. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఈ విధమైన నిర్ణయం తీసుకునే అవకాశం స్పష్టంగా కన్పిస్తోంది. ఈ సమావేశాల్లో గవర్నర్​ ప్రసంగం కూడా ఉండదు కాబట్టి.. ఇలా ఒకరోజు కలిసి వస్తుందన్న లెక్క కూడా ఉంది. సరే ఏ విధంగా చూసినా.. 5 రోజులు మాత్రమే కొనసాగే అవకాశముంది. అంతకంటే ఎక్కువ రోజులు నడిచినా.. ఉపయోగం కూడా లేదు. ఎందుకంటే.. ప్రతిపక్ష పార్టీలైన బీజేపీకి ఒక్క సభ్యుడు. కాంగ్రెస్​కు ఆరుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు. మిగిలిన ఎంఐఎం మిత్రపక్షమే ఎటూ చూసిన ఎంతసేపు మాట్లాడుతారు. పైగా సభ్యుల ఆధారంగానే స్పీకర్​ మాట్లాడే అవకాశమిస్తారు. కాబట్టి అంతకు మించి సమావేశాలు నడిచినా అధికార పార్టీ సభ్యుల స్కోత్కర్ష వినాల్సిందే.

కేసీఆర్​ సమీక్ష

బడ్జెట్ సమావేశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్​ మంగళవారం సమీక్ష నిర్వహించారు. వచ్చే నెలలో నిర్వహించే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలపై చర్చ జరిగింది. వచ్చే నెలలో వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జనం, మొహర్రం పండుగలున్నాయి. ఇతర సెలవులను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వచ్చే నెల 24 నుంచి దక్షిణాఫ్రికాలో జరిగే స్పీకర్లు, సెక్రటరీల సమావేశంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, సెక్రటరీ పాల్గొనాల్సి ఉంటుంది. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని తేదీలను ఖరారు చేయాల్సి ఉన్నందున, అసెంబ్లీ కార్యదర్శి సెప్టెంబర్ 4, 9, 14 తేదీలలో సమావేశాలు ప్రారంభం ఉంటుంది. పోలీసు సిబ్బంది లభ్యత, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు, సెలవులు తదితర విషయాలను పరిగణలోకి తీసుకుని ఈ మూడు తేదీల్లో ఒక తేదీని ప్రభుత్వం ఖరారు చేస్తుంది. ఈ ఏడాది ఆరంభంలోనే ఉభయ సభలను ఉద్దేశించి, గవర్నర్ ప్రసంగం చేసినందున బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉండదు. కాబట్టి రెండు రోజులు కలిసి వస్తాయి. బడ్జెట్ ప్రవేశ పెట్టడం, తదుపరి రోజు సెలవు ఇవ్వడం, తర్వాత రోజుల్లో చర్చ, తర్వాత పద్దులపై చర్చ, అప్రాప్రియేషన్ బిల్లు ఆమోదం తదితర ప్రక్రియలుంటాయి. ఏ రోజు ఏ కార్యక్రమం చేపట్టాలనే విషయంలో రెండు రోజుల్లో నిర్ణయం జరుగుతుంది.

ఆర్ధిక క్రమ శిక్షణ పాటించాలి కేసీఆర్​

దేశ వ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక మాంద్యం నెలకొన్న నేపథ్యంలో రాష్ట్రంలో కూడా అన్ని ప్రభుత్వ శాఖలు ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్​ పిలుపునిచ్చారు. రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన నుంచి మొదలుకుని నిధుల సద్వినియోగం వరకు ప్రతీ దశలోనూ పూర్తి స్థాయి క్రమశిక్షణ, ప్రణాళిక అవసరమని ముఖ్యమంత్రి చెప్పారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టడానికన్నాముందే రాష్ట్ర మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులను సమావేశపరిచి, ఆర్థిక పరిస్థితిని వివరించాలని, ఆర్థిక క్రమశిక్షణ పాటించే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను విడమరిచి చెప్పాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.

2 COMMENTS

  1. This is a topic that’s close to my heart… Cheers!
    Exactly where are your contact details though?
    I have been surfing online more than 2 hours today, yet I never found any interesting article
    like yours. It is pretty worth enough for me.
    In my opinion, if all web owners and bloggers made good content as you did,
    the internet will be a lot more useful than ever
    before. Hello, I check your blog daily. Your humoristic style is witty, keep it up!
    http://car.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here