Home ఎడ్యుకేషనల్/జాబ్స్ కేసీఆర్ ది చేతకాని పాలన- కోమటిరెడ్డి

కేసీఆర్ ది చేతకాని పాలన- కోమటిరెడ్డి

161
0

హైదరాబాద్: కేసీఆర్ చేతకాని పాల కారణంగానే ఉన్నత విద్య భ్రష్టు పట్టిపోయిందని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఇంటర్మీడియట్ అవకతవకలకు సీఎం కేసీఆర్ దే బాధ్యత.అని తెలిపారు.
పాలనను గాలికొదిలేసి .. ప్రధానమంత్రి పదవి కోసం కలలు కంటూ తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కు కమీషన్ల ధ్యాస తప్ప ప్రజల కష్టాలు పట్టవన్నారు. గ్లోబరీనా సంస్థ యజమాని ఓ దొంగ అని, ఆయనకి కోర్టు 420 బిరుదు కూడా ఇచ్చిందని తెలిపారు.
కేటీఆర్ బందువు విజయేందర్ రావు ఒత్తిడితోనే గ్లోబరీనాకు కాంట్రాక్ట్ ఇచ్చారని తెలిపారు.
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు కేటీఆర్, ఆయన బంధువు విజయేందర్ రావు పాత్ర కూడా ఉందన్నారు.
బాద్యులపై ఇప్పటికైనా క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్న విద్యార్థుల సంఖ్య రోజు.. రోజుకు పెరుగుతున్నా.. కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మంత్రిత్వ శాఖ నడపడం చేతకాని మంత్రి జగదీష్ రెడ్డి.. అవినీతిలో మాత్రం ముందున్నారని వందల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారంటూ ఆరోపించారు. విద్యార్థుల ఉసురు కేసీఆర్ కే తగులుతుందని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here