Home తాజా వార్తలు కేసీఆర్ చెయ్యి వేస్తే.. అది ప్రపంచ స్థాయి ప్రచారమేనా..!

కేసీఆర్ చెయ్యి వేస్తే.. అది ప్రపంచ స్థాయి ప్రచారమేనా..!

374
0
యాదాద్రి ఆలయం వద్ద కేసీఆర్​

‘రాజా చెయ్యి వేస్తే అది రాంగై పోదులేరా’ ఇది 1989లో వచ్చిన విచిత్ర సోదరులు చిత్రంలోని పాట. ప్రముఖ సినీ నటుడు కమల్​హాసన్ నటించిన ఈ చిత్రంలోని  పాట అప్పట్లో పాపులర్​. ఇప్పుడు ‘కేసీఆర్​ చెయ్యి వేస్తే ప్రపంచంలో పాపులర్​’ అని పాడుకోవచ్చు. ఈ పాట ఎవరూ పాడాల్సిన అవసరం కూడా లేదు. టీఆర్​ఎస్​ నేతలు, మంత్రులు ఇప్పటికే పాడేస్తున్నారు ఇలాంటి పాట. నిన్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి యాదాద్రి పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఒక గొప్ప మాట సెలవిచ్చారు. ‘కేసీఆర్​ వచ్చి ఇక్కడి శిలలపై చెయ్యి వేసినందుకు యాదాద్రి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు గడించింది. ఆలేరు నియోజకవర్గం కూడా ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది’ అని సెలవిచ్చారు.

యాదగిరిగుట్ట, ఆలేరు గురించి తెలియని వాళ్లు ఎవరైన వింటే అబ్బా నిజమేనా..! అంటూ తెల్లగుడ్లేసుకొని నోరు తెరిచేస్తారు. నిజానికి యాదగిరిగుట్ట అప్పటికే ప్రసిద్ధి చెందిన దేవస్థానం. ఏపీలో తిరుపతికి ఎంత ప్రాముఖ్యముందో.. తెలంగాణలో యాదగిరిగుట్టకు అంత ప్రాధాన్యముంది. కాకుంటే తిరుపతికి ఉన్న స్థాయిలో యాదగిరిగుట్టకు లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కొత్తగా కేసీఆర్​ రాగానే.. ఎక్కువగా వచ్చిందీ లేదు. పుణ్యక్షేత్రంగా చేస్తానంటూ యాదగిరిగుట్టలో ప్రయోగాలు చేస్తున్నారు. అవి పెద్దగా ఫలించడం లేదు. ఒక్కటి మాత్రం జరిగింది. అదేంటంటే.. భూములు రేట్లు మాత్రం అడ్డగోలుగా పెరిగిపోయాయి. అది కూడా సామాన్యుడికి అందని స్థాయిలో. ఒక మామూలు వ్యక్తి గుట్టలో 100 గజాల ఖాళీ స్థలం కూడా కొనలేడు.

అభివృద్ధి పేరుతో మూడేళ్లు గడిచిపోయాయి. నిధులు విడుదల చేయకుండా ఆలస్యం చేస్తుంటే.. పనులు నిలిచిపోతున్నాయి. టీఆర్​ఎస్ నేతలకు మాత్రం కేసీఆర్​ చెయ్యి వేసినందుకే యాదాద్రికి, ఆలేరుకు ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చిందంటూ హడావుడి. ఆలేరుకు నిజాం కాలంలోనే సాయుధ పోరాటం చేసిన పెద్ద గుర్తింపు ఉంది. తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమంలో అండగా నిలిచింది ఈ ఆలేరు, గుట్టే. టీఆర్​ఎస్​ అనే పార్టీని ఎక్కడా ఎవరూ పట్టించుకోని సమయంలో ఇక్కడ సర్పంచ్​లు, ఎంపీటీలను గెలిపించి.. టీఆర్​ఎస్​ పరువు నిలబెట్టాయి. గెలిచిన అతికొద్ది ఎమ్మెల్యేల్లో ఆలేరు కూడా ఒకటి. ఆలేరు, గుట్టతో కేసీఆర్​కు గుర్తింపు వచ్చింది కానీ, కేసీఆర్​తోటి ఈ ప్రాంతాలకు గుర్తింపు రాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here