Home breaking news కేసీఆర్ కామెంట్‌తో *మున్నా* సినిమా జ‌ర‌ గుర్తుకు తెచ్చుకోండి భాయ్‌

కేసీఆర్ కామెంట్‌తో *మున్నా* సినిమా జ‌ర‌ గుర్తుకు తెచ్చుకోండి భాయ్‌

399
0
తెలంగాణ సీఎం కేసీఆర్‌
  • వికాస్ రుషి

దాదాపుగా ఓ ప‌దేళ్లు కావ‌చ్చు.. ప్ర‌భాస్ హీరోగా మున్నా అనే సినిమా వ‌చ్చింది. ఆ సినిమాలో మెయిన్ విల‌న్ ప్ర‌కాశ్‌రాజ్‌.. తోడు విల‌న్ పేరు గుర్తుకు లేదు క‌ని.. సినిమాలో మాత్రం ఆత్మ‌. బ‌య‌ట ప్ర‌పంచంలో వీరిద్ద‌రి మ‌ధ్య ఆదిప‌త్య పోరాటం న‌డుస్తుంటూంది. అంత‌ర్గ‌తంగా మాత్రం వీరిద్ద‌రూ ఒక‌టే. ప్ర‌కాశ్‌రాజును వ్య‌తిరేకిస్తున్న వారిని ఆత్మ‌ గ్రూప్‌ న‌మ్మ‌కంగా ద‌గ్గ‌రికి చేసుకొని..లేపేస్తుంటూంది. అదే విధంగా కొత్త‌గా గ్రూప్ ఏర్ప‌డ‌కుండా చేస్తుంటారు. ఈ సోదంతా ఎందుకు చెప్ప‌వ‌ల‌సి వ‌చ్చిందంటే.. నిన్న‌టి టీఆర్ఎస్ కార్య‌వ‌ర్గ స‌మావేశంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట్లాడిన మాట‌ల‌తో ఈ మున్నా సినిమా గుర్తుకొచ్చింది. ఇంత‌కీ కేసీఆర్ ఏమ‌న్నారంటే.. తెలంగాణ‌లో ప్రాంతీయ పార్టీల‌దే ఆదిప‌త్యముండాలే.. జాతీయ పార్టీల‌ది కాకుండా అంటూ.. త‌మిళ‌నాడుతో తెలంగాణ‌కు పోలిక తెచ్చారు. అక్క‌డి డీఎంకే, అన్నా డీఎంకే అనే రెండు ప్రాంతీయ పార్టీలు.. జాతీయ పార్టీల‌ను అధికారంలోకి రాకుండా చేశాయి. ఒక పార్టీ ఒక‌సారి మ‌రోపార్టీ మ‌రోసారి అధికారంలోకి వ‌స్తున్నాయంటూ వ్యాఖ్యానించారు. అక్క‌డి మాధిరిగానే.. తెలంగాణ‌లో కూడా జాతీయ పార్టీల‌ను రానీయ‌వ‌ద్దంటూ చెప్పుకొచ్చారు.

ఇక్క‌డి వ‌ర‌కూ బాగానే ఉంది కానీ.. తెలంగాణ‌లో ఉన్న ఏకైక ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ ఒక్క‌టే. మిగిలిన పార్టీల‌న్నీ జాతీయ పార్టీలే. ఉన్న టీడీపీ కూడా లేకుండా పాయే. ఇప్పుడు కేసీఆర్ లెక్క ప్ర‌కారం.. ఇంకో ప్రాంతీయ పార్టీ ఇక్క‌డ లేదు. అంటే ఇంకో పార్టీ పుట్టుకొని రావాలే. అది వ‌చ్చే ఎన్నిక‌ల లోపు. ఇప్పుడీ రాష్ట్రంలో కొత్త‌గా ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేసే లీడ‌ర్ మాత్రం క‌న్పించ‌డం లేదు. ఉంటే ఇంటే అది హ‌రీశ్‌రావు ఒక్క‌రే.

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల నుంచి హ‌రీశ్‌రావును ప్లాన్ ప్ర‌కారమ‌న్న‌ట్టుగా.. తొక్కేస్తున్నరు. హ‌రీశ్‌ను ఏ స్థాయిలో తొక్కేస్తున్న‌రో అదే స్పీడ్‌లో కేటీఆర్‌ను ప్ర‌మోట్ చేస్తున్న‌రు. ఇప్పుడు టీఆర్ఎస్‌లో ఎమ్మెల్యేల సంఖ్య 105. కారు ఓవ‌ర్‌లోడైంది. ఈ ఓవ‌ర్‌లోడ్ కార‌ణంగానే. మొన్న‌టి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కారు పంక్చ‌ర్ కూడా అయింది. ఇప్పుడు టీఆర్ఎస్‌లో ఉన్న 105 మంది ఎమ్మెల్యేల్లో హ‌రీశ్‌రావు ర‌మ్మ‌ని విజిల్ ఏస్తే చాలు.. క‌నీసం 40 మంది వ‌ర‌కూ దూకేస్తార‌న్న వాద‌నా విన‌ప‌డుతోంది. ఇప్పుడు హ‌రీశ్ ధైర్యం చేసి.. ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేస్తే.. రాజ‌కీయ శూన్యాన్ని భ‌ర్తీ చేసుకుంటున్న‌ బీజేపీలోకి చేరిక‌లు ఆగిపోతాయి. కాంగ్రెస్ ఇప్పుడున్న మాదిరిగానే లేవ‌కుండా ప‌డ‌కుండా ఉంటుంది. వ‌చ్చే ఎన్నిక‌లు.. రెండు ప్రాంతీయ పార్టీల మ‌ధ్యే జ‌రుగుతాయి. ఈ రెండు ప్రాంతీయ పార్టీల‌తో జాతీయ పార్టీలు పొత్తు పెట్టుకొని సైడ్‌లో ఉండిపోతాయి. ఇదేనా..? మున్నా ప్లాన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here