Home breaking news కేసీఆర్​ను చూస్తే నిజంగా ఢిల్లీకి వణుకే పుడుతోందా..!

కేసీఆర్​ను చూస్తే నిజంగా ఢిల్లీకి వణుకే పుడుతోందా..!

148
0
పీఎం మోదీతో సీఎం కేసీఆర్​

‘కేసీఆర్​ను చూస్తే ఢిల్లీకి వణుకు’ ఇవే మాటలను కాస్తా అటు ఇటూ మార్చి.. టీఆర్​ఎస్​ నాయకులు తమ ప్రసంగాల్లో వీరావేశంగా అలవోకంగా అనేస్తూ ఉంటారు. ఇది తెలంగాణ ఉద్యమ సమయంలోనూ 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ ఎన్నిమార్లు అని ఉంటారో.. లెక్కించడం కూడా కష్టమే. హుజూర్​నగర్​ ఉప ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ప్రచారంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్​రెడ్డి కూడా అలవోకగా అనేసిండు. కాంగ్రెస్​  ట్రాప్​లో బీజేపీ ఇరుక్కుందని పేర్కొన్న ఆయన.. కాంగ్రెస్​ కోసమే.. ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తోందంటూ ఆరోపణలు గుప్పించారు. ఈ ఆరోపణలకు ఆయన చెప్పిన సాక్షమేమిటంటే.. అధికారులు, స్పేషలాఫీసర్లను బదిలీ చేయడమేనట.

బీజేపీ అనేదీ కేంద్రంలో అధికారంలో ఉన్న.. ఒక రాజకీయ పార్టీ. రాజకీయ పార్టీ అంటే కచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేయాలి. అందుకే బీజేపీ పోటీ చేస్తోంది. ఈ పార్టీ మొన్నటి ఎన్నికల్లో 1500 పై చిలుకు ఓట్లు వచ్చాయి. అయినా.. ఉప ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఇప్పుడు ఓట్లు ఎన్ని వస్తాయన్నది తర్వాతి విషయం. కాంగ్రెస్​ కోసమే అధికారులను బీజేపీ బదిలీ చేయిస్తోందంటూ విమర్శలు చేశారు. తమ కోసం పని చేయాలని ఇక్కడి అధికారులపై టీఆర్​ఎస్​ ఒత్తిడి చేయడం.. అధికారులు కూడా విధిలేని పరిస్థితుల్లో పని చేస్తున్నారు.  టీఆర్​ఎస్​ గెలుపు కోసం అధికారులు పని చేస్తున్నారని బీజేపీ గుర్తించింది. ఇదే విషయాన్ని జాతీయ స్థాయిలో తమ ప్రతినిధులకు చెప్పడం.. ఈ విషయంలో నిజా నిజాలు గుర్తించి.. వారిని బదిలీ చేయించారు. ఇక్కడ కాంగ్రెస్​ ట్రాప్​లో బీజేపీ ఇరుక్కున్నదెక్కడా..?

కాకుంటే.. ఇది టీఆర్​ఎస్​కు మింగుడు పడడం లేదు. అందుకే ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయినా అంటే కాంగ్రెస్​ ట్రాప్​లో బీజేపీ ఇరుక్కుందంటూ ఆరోపణలు చేసినప్పుడు.. కేసీఆర్​ను చూస్తే ఢిల్లీకి భయం అంటూ ఆరోపణలు చేయకూడదు. ఈ రెండు ఆరోపణలు పరస్పరం విరుద్ధమైనవి. కేసీఆర్​ను చూస్తే ఢిల్లీ భయపడితే.. అధికారులను ఎందుకు బదిలీ చేయిస్తుంది. ఆ భయంతో టీఆర్​ఎస్​కు సహకరిస్తుంది కని. ఇలా పరస్పర విరుద్ధమైన కామెంట్లు చేయడంతోనే.. టీఆర్​ఎస్​ నవ్వుల పాలు అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here