Home breaking news కేసీఆర్జీ.. అందుకే అంటారు ఉచిత సలహాలు ఇవ్వొద్దని

కేసీఆర్జీ.. అందుకే అంటారు ఉచిత సలహాలు ఇవ్వొద్దని

189
0

–ఆదిత్య

నేనేదో చెప్పబోతే.. ఉచిత సలహాలు ఇవ్వొకురా బై అన్నాడు మావోడొకడు. ఎందుకనంటే.. ఈయ్యాల్టీ ఆంధ్రజ్యోతి ఏపీ పేపర్​ చూపించిండు. అందులో ఏముందంటే.. కేసీఆర్​ మూడు రాజధానులు నువ్వేందుకు కట్టవని టీడీపీ ఏపీ లీడర్లు ప్రశ్నించిన వార్త కన్పించింది. తెలంగాణలో మూడు రాజధానులేందంటూ నా ముఖంలో కొశ్చన్​ మార్కు కన్పించినట్టుంది మావోడికి అసలు ముచ్చట చెప్పిండు. నువ్వేదో నాకు చెప్పబోయావు కదా.? అట్లనే మొన్న ఏపీ సీఎం జగన్​కు తెలంగాణ సీఎం కేసీఆర్​ చెప్పిండు దానికి రిటర్న్​ జవాబిది. అంటూ మొన్నటి పేపర్​ చూపించిండు. అప్పుడు నా కర్థమైంది ఉచిత సలహాలు ఇవ్వొద్దని..

శుక్రవారం కోర్టు కేసుకు హాజరైన ఏపీ సీఎం జగన్​.. రెండ్రోజులు ఇక్కడే ఉండి  నిన్నగాక మొన్న.. అంటే  సోమవారం నాడు తెలంగాణ సీఎం కేసీఆర్​ కలిసిండు. ముచ్చట మీద ముచ్చట పెట్టిండు. ఆ టైంల జగన్​కు ఒక్కటే చెప్పిండంట కేసీఆర్​.. ఎవ్వడు ఏమనుకున్నా సరే.. నువ్వైతే వెనక్కి జరగకు. ముందుకే పోవాలే అని చెప్పుకొచ్చిండంట. నన్ను చూడు ఆర్టీసీ సమ్మె మీద ఎనక్కీ పోయిన్నా.. సెక్రటేరియట్​ మీద ఎనక్కి పోయిన్నా.. ప్రగతి భవన్​ మీద ఎనక్కి పోయిన్నా ఇట్ల చెప్పుకుంట పోయి.. మూడు రాజధానులు అంటున్నవ్​ మంచిగనే ఉంది ముందుకు పో అన్నడంట. ఉమ్మడి రాష్ట్రంలో కూడా అభివృద్ధి అంతా హైదరాబాద్​కే కాకుండా అంతటా ఉంటే.. తెలంగాణ ఎప్పుడో వచ్చేదని చెప్పుకుంట ఒచ్చిండంట. (ఇదైతే నా కర్థం కాలే. అభివృద్ధి వికేంద్రీకరణ అయితే తెలంగాణ ఏపీ వాళ్లు ఇక్కడి గంతమంది ఎందుకొచ్చెటోళ్లు. తెలంగాణ ముచ్చట ఎందుకొచ్చేదీ.. సరే ఇంత పెద్ద ముచ్చట్టు నాకెందుకు) కేసీఆర్​ చెప్పిందంత విన్న జగన్​ తలకాయ ఊపిండు పోయిండు. ఈ ముచ్చటంతా కేసీఆర్​ మాజీ దోస్తు పత్రిక ‘ఆంధ్రజ్యోతి’లో పొల్లు పోకుండా వచ్చింది.

ఇక్కడితో పాటు ఏపీలో కూడా ఈ వార్త వచ్చింది కదా..? అక్కడి టీడీపోళ్లు కేసీఆర్​పై రుసరుసలాడడడం మొదలు పెట్టారు. మా ముచ్చట్ల గాయనేందీ బై ఏలు పెట్టేదంటున్నరు. అందులో ఒకడు .. మాకు ఉచిత సలహా ఇచ్చినవ్​ గని.. తెలంగాణలో కూడా మూడు రాజధానులు కట్టరాదే అన్నాడు. అదే వార్త ఇప్పుడు నాకు మావోడు పేపర్ల చూపించిండు. వచ్చినోడికి ఊకసప్డేక ఇంత చాయ్​ ఇచ్చి.. సాగనంపితే పోయే అయిపోయేది. అందుకే అంటరు ఏపీ రాజధాని ముచ్చట తీయడమెందుకు.. ఆళ్లతో అనిపించుకోవడమెందుకు. ఇప్పటికే ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అన్న ముచ్చట అక్కడక్కడ అనుకుంటున్నరు. ఎవడో ఒకడు రాజకీయ నిరుద్యోగి.. దక్షిణ తెలంగాణకు అన్యాయం జరుతున్నదని రోడ్డు ఎక్కితే. అందుకే వినటోడు ఉండు.. చెప్పడానికి ఖర్చు లేకుండా నోరుందిగా అని ఉచితంగా సలహాలు ఇవ్వొద్దని అంటరు పెద్దోళ్లు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here