Home breaking news కేబినెట్ విస్తరణ.. మార్పులు..చేర్పులు.. హరీశ్​రావుకు స్పెషల్ శాఖ

కేబినెట్ విస్తరణ.. మార్పులు..చేర్పులు.. హరీశ్​రావుకు స్పెషల్ శాఖ

124
0
మంత్రి హరీశ్​రావు

కేబినెట్​ విస్తరణ జరిగింది. కొన్ని మార్పులు.. చేర్పులు జరిగాయి. కొత్తగా మరోసారి హరీశ్​రావు మంత్రిగా అవకాశం లభించింది. ఆయనకు స్పెషల్​ శాఖ కేటాయించారు. ముఖ్యమంత్రి పదవి తర్వాత ఆ స్థాయి బాధ్యతలు నిర్వహించేది ఆర్ధిక శాఖ. ఆలస్యమైనా.. హరీశ్​కు మంచి శాఖ అప్పజెప్పారని అనుకోవచ్చు. అయితే ఇక్కడో స్పెషల్​ ఉంది. ఆ స్పెషలేంటో.. గత ప్రభుత్వంలో ఇదే శాఖ నిర్వహించిన ఈటల రాజేందర్​కు తెలుసు. ఆయనకు తెలుసన్న సంగతి స్టేట్​ మీడియాలో ప్రాముఖ్యత కల్గిన రిపోర్టర్లకు కూడా తెలిసే ఉంటుంది. ఆర్ధిక శాఖపై హైదరాబాద్​లో ఉన్న టాక్​ ఏంటంటే.. అత్యంత కీలకమైన ఈ శాఖలో మంత్రికి ఏ మాత్రం పని లేదు. గత ప్రభుత్వంలో పని లేకుండానే ఈటల ఉన్నారు అని చెప్పుకుంటున్నారు.

విషయమేమిటంటే.. బడ్జెట్​ సమావేశాల సందర్భంలోనూ ఈటల ఏనాడు రూపకల్పనలో తలదూర్చలేదంటున్నారు. బడ్జెట్​ సమావేశాలకు రెండు రోజుల ముందు.. సంబంధిత ప్రసంగం కాపిని మాత్రం ఈటలకు అందించే వారట. ఆయన దాన్ని బట్టిపట్టి.. అసెంబ్లీలో పొల్లు పోకుండా చదివే వారు. నోట్ల రద్దు, జీఎస్టీ కారణంగా ఈటలకు ఢిల్లీ స్థాయిలో నోటెడ్​ నాయకుడిగా మారిండు. ఇది కూడా నచ్చక.. ఆయనకు ఆలస్యంగా సమాచారం ఇవ్వడంతో పాటు.. ఆరోగ్య శాఖ ఇచ్చారు. ఈ శాఖలో పేరు వచ్చేదేముండదు. ఎప్పుడు తిట్లే. ఇదే ఇప్పుడు టాక్​ ఆఫ్​ ది పొలిటికల్​. హరీశ్​ విషయానికొస్తే.. నీటి పారుదల శాఖ మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో ఎప్పుడు చూసినా హరీశ్​ అన్న పేరు పలికేది. ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే కాళేశ్వరం.. అప్పుడు ప్రారంభమయ్యిందే.  ఇది నచ్చని కారణంగానే.. మంత్రి వర్గంలో తొలుత తీసుకోకుండా.. హరీశ్​ను పక్కన పెట్టారని మరో టాక్​. లేకుంటే సమర్ధుడని హరీశ్​ను మెచ్చుకున్న కేసీఆర్​.. ముందుగా ఆయనకు మంత్రి పదవి ఎందుకివ్వలేదు.? విస్తరణలో తిరిగి నీటి పారుదల శాఖ ఎందుకివ్వలేదు.? ఆర్ధిక శాఖనే ఎందుకిచ్చారు.? గత ఆర్ధిక శాఖ మంత్రి అప్పుడు చేసిందేమిటీ..? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుక్కుంటే మనకే సమాధానం దొరికి పోతుంది.  పూర్తి సారాంశమేమిటంటే.. హరీశ్​కు మంత్రి పదవి అసలే ఇవ్వద్దకున్నారు. ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇచ్చేదేదో.. నిత్యావరం కానిది ఇస్తే సరిపోతుందిగా.. ఈ ఆలోచనతోనే హరీశ్​కు మంత్రి పదవి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here