Home breaking news కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి@77 కన్నుమూత

కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి@77 కన్నుమూత

131
0

హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత
సూదిని జైపాల్ రెడ్డి కన్నుమూశారు. నిమోనియా వ్యాధితో బాధపడుతున్న ఆయన కొద్ది రోజులుగా గచ్చిబౌలిలోని ఏషియన్ గ్యాస్ ఎంట్రాలజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అర్థరాత్రి దాటాక 1.28 గంటలకు కన్నుమూశారు. ఐదుసార్లు ఎంపీగా గెలిచిన జైపాల్ రెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉన్నారు.
1942 జనవరి 16న జైపాల్ రెడ్డి జన్మించారు. 1969, 1984 మధ్య జైపాల్ రెడ్డి కల్వకుర్తి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ప్రధాని ఇందిర.. దేశంలో ఏమర్జెన్సీ విధించిన సమయంలో.. వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ను వీడి జనతా పార్టీలో చేరారు. జనతాపార్టీ తరుపున 1984లో మహబూబ్‌నగర్,1999, 2004లో మిర్యాలగూడ లోక్ సభ స్థానం నుంచి గెలుపు సాధించారు. 1990, 1996లో రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
1998లో ఐకే గుజ్రాల్ కేబినెట్‌లో సమాచార, ప్రసార శాఖా మంత్రిగా జైపాల్ రెడ్డి బాధ్యతలు నిర్వహించారు. 1999లో జైపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లో చేరి 2004లో
మిర్యాలగూడ, 2009 చేవెళ్ల నుంచి గెలిచి, యూపీఏ హయాంలో పెట్రోలియం, సహజవాయువుల శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఉత్తమ పార్లమెంటేయన్ గా ఎన్నికయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here