Home breaking news కులపిచ్చి అంతొద్దు అంటూనే..కులానికి పెద్దపీట

కులపిచ్చి అంతొద్దు అంటూనే..కులానికి పెద్దపీట

347
0
ఫొటో: ఇంటర్​నెట్​ నుంచి

–వికాస్​ రుషి

ఒక పక్క కులపిచ్చి పాడుగాను… అంటారు. మరో పక్క కులానికి చెందిన వారు లేకుంటే.. అసలు ప్రారంభమే లేదంటారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. ప్రతి ఆదివారం రాసినట్టే ఈ వారం కూడా ‘కొత్త పలుకు’ రాసేశారు. ఇందులో జగన్​ జైలుకు పోతాడనే కోణం రాయడంతో పాటు.. కులం గురించి మా బాగానే రాసేశారు. విషయమేమిటంటే.. ఏపీ రాజధాని కోసం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో  పరిరక్షణ సమితి ఆందోళన చేస్తోంది. ఈ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి. దీన్ని ఎవరూ సమర్ధించరు. కానీ ఇక్కడ కుల ప్రస్తావన తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారన్న అంశానికి వస్తే రాజధాని కోసం భూ సేకరణకు ముందు.. ఈ సమాచారం తెలుసుకొని  చుట్టు పక్కల భూములన్నీ చంద్రబాబు కులం వాళ్లు కొన్నారని ప్రచారం. ఇదే ప్రచారాన్ని వైసీపీ చేసింది. చేస్తోంది కూడా. ఇప్పుడు ఈ కులం పేరు మీదనే.. అమరావతిని రాజధాని చేయడం లేదని టీడీపీ ప్రచారం చేస్తోంది. విషయమేమిటంటే.. రాజధాని మొత్తం కాదు బాబు.. రాష్ట్ర వ్యాప్తంగా మూడు రాజధానులు చేస్తామని వైసీపీ చెబుతోంది. ఇది మాత్రం ప్రచారం కావడం లేదు. సరే ఈ సంగతి పక్కన పెడదాం. ఇంతకీ కులం అంశాన్నీ తీసుకుంటే.. రాధాకృష్ణ చెప్పిందేమిటంటే.. ‘అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఆందోళన చేసిన మహిళలను అక్రమంగా నిర్బంధించడంతోపాటు ‘‘మీ కులం ఏమిటి?’’ అని పోలీసులు ప్రశ్నించడం అరాచకం కాక మరేమిటి? పాలకుల్లో మూర్తీభవించిన కుల విద్వేషానికి ఈ సంఘటన ఉదాహరణగా నిలుస్తోంది.’ అని చెప్పారు. ఇంతవరకూ బాగానే ఉంది. కులం అడగడం సరికాదు ఓకే. కానీ అరెస్ట్​ చేసినప్పుడు వివరాలు మాత్రం అడుగుతారు. అందులో కులం ప్రస్తావన కూడా ఉంటుంది. ఈ సంగతి పక్కన పెడదాం. మళ్లీ రాధాకృష్ణ పలుకు వద్దకు వద్దాం. కమ్మ కులం వాళ్లు లేకుంటే హైదరాబాద్​ అభివృద్ధి అయ్యేదే కాదు. రాజకీయాలు కొందరు ఎదిగే వారు కారంటూ రాసుకొచ్చారు.  ఆయనేం రాశారో  మక్కికి మక్కి చదవండి.

చెన్నారెడ్డి హయాంలో..

‘ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నట్టు కుల ద్వేషాలు ఉండి వుంటే కమ్మ సామాజికవర్గం ఆధిపత్యం ఉండిన చిత్ర పరిశ్రమను హైదరాబాద్‌కు తీసుకురావడానికి చెన్నారెడ్డి అంతలా కృషిచేసి ఉండేవారు కాదు. ఈ సందర్భంగా ఒక సంఘటనను గుర్తుచేసుకోవాలి. అప్పట్లో కృష్ణా జిల్లా రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించిన ఒకాయనకు కమ్మ సామాజికవర్గంతో పొసిగేది కాదు. ఇది గమనించిన చెన్నారెడ్డి విజయవాడ పర్యటనకు రైలులో వచ్చారు. ఆయనకు స్వాగతం చెప్పడానికై రైల్వేస్టేషన్‌కు వచ్చిన సదరు నాయకుడిని ఉద్దేశించి.. ‘‘ఏమయ్యా కమ్మవాళ్లు నీకేమి అన్యాయం చేశారు? వారి సహకారం లేకపోతే రాజకీయాలలో నువ్వు ఎదిగేవాడివా? హైదరాబాద్‌లో అన్ని పెట్టుబడులు వచ్చేవా?’’ అని ప్రశ్నించారు. తర్వాత కాలంలో ఎన్‌టీఆర్‌, చంద్రబాబు ముఖ్యమంత్రులు కావడంతో హైదరాబాద్‌రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.’ జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కమ్మ సామాజికవర్గాన్ని ప్రత్యేకంగా చేరదీసి హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టించారు. ఇది ఆయన రాసిన పలుకు.  చంద్రబాబు కారణంగానే.. హైదరాబాద్ రూపురేఖలే మారిపోయాయంటూ చెప్పుకొచ్చేశారు.

ఇది మక్కికి మక్కి రాధాకృష్ణ రాసిందే

ఇదేం కుల పిచ్చి?

ఇటువంటి వాస్తవాలను గుర్తించడానికి నిరాకరిస్తూ ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వంలో పదవులు వెలగబెడుతున్నవారు ‘‘మాకు అభివృద్ధి వద్దు, కుల మతాల రొచ్చులో పడి కుళ్లిపోతాం’’ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అమరావతి అభివృద్ధి చెందివుంటే హైదరాబాద్‌తరహాలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు వచ్చి స్థిరపడి ఉండేవారు. ఒకప్పుడు హైదరాబాద్‌లో ప్రముఖ హోటళ్లను నిర్వహించిన కమ్మ సామాజికవర్గానికి చెందినవారు ఇప్పుడు మాయమైపోయినట్టుగానే అమరావతిలో కూడా కమ్మ సామాజికవర్గానికి చెందినవారి ఉనికి మసకబారేది.

ఈ పలుకులో రాధాకృష్ణ చెప్పకనే చెప్పేశారు. ఇప్పుడు అమరావతిలో కమ్మ వాళ్లే ఉ(కొ)న్నారని.. పైన పేర్కొన్న దానిలో ఒకసారి చూడండి. ‘ఒకప్పుడు హైదరాబాద్​లో ప్రముఖ హోటళ్లను నిర్వహించిన కమ్మ సామాజిక వర్గం వాళ్లు..ఆ తర్వాత మాయమైపోయారు. అమరావతిలో కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారి ఉనికిమసకబారేదీ’ అని చెప్పుకొచ్చారు. వైఎస్​ రాజశేఖర్​రెడ్డి.. కూడా కమ్మ కులం వాళ్లను ప్రోత్సహించారని అంటూ గుర్తు చేశారు.   చదువుతుంటే.. కులమొద్దు మతమొద్దు అనే వాళ్లే. నాదీ కులం. నాదీ మతం అన్నట్టుగా లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here