Home తాజా వార్తలు కాలికి బ‌ల‌పం క‌ట్టుకున్న చంద్ర‌బాబు | Chandrababu tour

కాలికి బ‌ల‌పం క‌ట్టుకున్న చంద్ర‌బాబు | Chandrababu tour

67
0
  • వికాస్ రుషి
  • కాలికి బ‌ల‌పం క‌ట్టుకొని తిరుగుతున్నాడ్రా అనేది ఊళ్ల‌లో వినిపించే మాట‌. ఈ మాట ఏదో ఒక ప‌నిమీద ఎక్కువ‌గా తిరిగే వాళ్ల‌కు వ‌ర్తిస్తుంది. దీనికి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స‌రిగ్గా స‌రిపోతారు. ఆయ‌న ఒక చోట కుదురుగా ఉండ‌డ‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. కాసేపు సింగ‌పూర్ అంటారు. హైద‌రాబాద్‌కు వ‌చ్చెళ్లిపోతారు. ఇత‌ర దేశాల‌కు వెళ్లారు. ఇవేమీ లేకుంటే.. మీడియా స‌మావేశంలో ఉంటారు. అంటే ఏదో విధంగా నిత్యం మీడియాలో క‌న్ప‌బ‌డుతుంటారు. ఏదైన అనుకోకుండా.. ఆయ‌న క‌న్పించ‌కుంటే.. ఆయ‌న ప‌త్రిక‌లు ఉండ‌నే ఉన్నాయిగా ఏదైనా ఒక‌టి చూపించ‌డానికి. ఈ ప్ర‌స్తావన ఎందుకంటే.. ఇప్పుడాయ‌న ప‌ర్య‌ట‌న‌ల మీద ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. బీజేపీ కూట‌మి నుంచి ఎప్పుడైతే చంద్రబాబు బ‌య‌ట‌కు వ‌చ్చారో అప్ప‌టి నుంచి ఆయ‌న ప‌ర్య‌ట‌న‌లు తీవ్ర‌మ‌య్యాయి. బీజేపీకి వ్య‌తిరేకంగా ప్ర‌తిప‌క్షాలను కూడ‌గ‌ట్ట‌డానికి ఆయ‌న చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. తిర‌గ‌ని రాష్ట్రం లేదు. క‌ర్ణాట‌క‌లో బీజేపీని ఓడించ‌డానికి తీవ్ర ప్ర‌య‌త్నాలు చేశారు. విజ‌యం సాధించాన‌ని కూడా చెప్పుకున్నారు. ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌న‌ప్ప‌టి నుంచి చంద్ర‌బాబును చూసిన వాళ్ల‌కు పాపం అన్పించ‌డంలో ఆశ్చ‌ర్యం లేదు. ఇక ఆ రెండు ప‌త్రిక‌ల ఆవేద‌న అంతా ఇంతా కాదు. ఎన్నడూ ఒకరికి వంగి దండం పెట్ట‌ని బాబు (అలా చెప్పుకుంటారు) ఓట‌ర్ల‌కు ఒంగి ఒంగి దండాలు పెట్టారు. త‌మ్ముళ్లూ నేను లేకుంటే మీరు బ‌త‌క‌లేరు. న‌న్నే గెలిపించండి అంటూ ప్రాధేయ‌ప‌డ్డారు. రాంగోపాల్ వ‌ర్మ తీసిన ల‌క్ష్మీస్ ఎన్డీఆర్ సినిమాను రిలీజ్ కాకుండా ఎన్ని తిప్ప‌లు ప‌డ్డారో. ఈ సినిమా రిలీజ్ అయితే అంద‌రికీ తెలిసిందే అయినా.. జ‌నానికి మ‌రింత గుర్తు చేస్తుందేమో అన్న భ‌యంతో నిద్ర‌కూడా పోకుండా క‌ష్ట‌ప‌డ్డారు. ఎంత చేసినా ఎంత తిరిగినా ఎన్ని ఇచ్చినా.. జ‌నాభిప్రాయం వేరే ఉంద‌న్న వాస‌న బాబుకు వ‌చ్చిందంట‌. ఇగ మొద‌లైంది చూడా ఆయ‌న వెంప‌ర్లాట‌. పోలింగ్ కు ముందు రోజు బాబు హైడ్రామా. పోలింగ్‌ జరిగిన రోజు మ‌ధ్యాహ్న‌మే.. ఈవీఎంల‌పై నింద‌లు. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై ఎన్నిక‌ల క‌మిష‌న్ పూర్తిగా విఫ‌ల‌మైంద‌న్న ఆరోప‌ణ‌లు. మీడియాలో క‌న్పించ‌డానికి ఎక్క‌డా వెనుక‌డుగు వేయ‌ని బాబు.. పోలింగ్ జ‌రిగిన రోజు రాత్రి మీడియా ఎదుట‌కు రాలేదు. ఎందుకు రాలేదో తెలియ‌దు కానీ, భ‌యంతో రాలేద‌న్న సంగ‌తి మాత్రం అంద‌రికీ తెలిసి పోయింది. మ‌ర్నాడు ఈసీపై మండిపాటు. ఢిల్లీకి వెళ్తున్నాను. ఈసీని నిల‌దీస్తాన‌ని ఆగ్ర‌హం. ఢిల్లీకి వెళ్ల‌డం.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం. వీవీ ప్యాట్‌ల‌ను 50 శాతం లెక్కించాల‌ని డిమాండ్. లేకుంటే సుప్రీంకోర్టుకు వెళ్తాన‌ని హెచ్చ‌రిక‌లు. బీజేపీ వ్య‌తిరేక పార్టీల మ‌ద్ద‌తు కూడ గ‌ట్టుకోవ‌డానికి మ‌ళ్లీ ప‌ర్య‌ట‌న‌లు. దేవేగౌడ‌, స్టాలిన్ వ‌ద్ద‌కు వెళ్తున్నారు. మొత్తానికి కాలికి బ‌లపం క‌ట్టుకొని బాబు తిరుగుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here