Home తాజా వార్తలు Pm Modi | కాపాలాదారుడా.? క‌ళంకితులా.? ఎవ‌రు కావాలో తేల్చుకోండి- మోదీ

Pm Modi | కాపాలాదారుడా.? క‌ళంకితులా.? ఎవ‌రు కావాలో తేల్చుకోండి- మోదీ

202
0

హైదరాబాద్, క‌ర్నూలుః దేశం కోసం ప‌ని చేస్తున్న బ‌ల‌మైన కాపాలాదారుడు కావాలో..? అవినీతి కుంభ‌కోణాలకు పాల్ప‌డుతూ కుటుంబ రాజ‌కీయాల‌కు చేస్తున్న క‌ళంకితులు కావాలో .? ప‌్ర‌జ‌లే తేల్చుకోవాల‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ ప్ర‌జ‌ల‌కు సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ‌లోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని భూత్పూర్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని క‌ర్నూల్‌లో శుక్రవారం నిర్వహించిన భారీ బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ తో పాటు తెలంగాణ‌, ఏపీ ముఖ్య‌మంత్రుల‌పై విమర్శలు గుప్పించారు. దేశ భద్రతకు ప్రమాదకరంగా మారిన ఉగ్రవాదాన్ని కశ్మీర్ సరిహద్దుల అవలికి మీ కాపాలదారుడు తరిమికొట్టాడని, శాంతిని నెలకొల్పుతున్నామని చెప్పారు. దేశ భద్రతకు ఎవరు ఆటంకం కల్పించినా ఊరుకోమని తేల్చిచెప్పారు. 55 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ స్వార్ధ రాజకీయాలు చేసిందని తెలిపారు. సమస్యలు పరిష్కరించలేదని విమర్శించారు. మీ చౌకిదార్ మాత్రం ఈ ఐదేళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించానని తెలిపారు. దేశం కోసం పని చేస్తున్న నాపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా నేను మీ సంక్షేమం కోసం చౌకిదార్ గా పనిచేశానని చెప్పారు. దేశం కోసం బలమైన కాపాలదారుడు గా నేనున్నానని, ప్రతిపక్షంలో నాయకుడు లేరు. వాళ్లకు నీతి, నిజాయితీ కూడా లేదన్నారు. కేవలం అధికార కాంక్షతో రాజకీయాలు చేస్తున్నార‌ని ఆరోపించారు. భద్రతా దళాలు పాకిస్థాన్ లోని బాలకొట్ లో వైమానిక దాడులు నిర్వహించి ఉగ్రవాదులకు ధీటుగా సమాధానం చెబితే నిజంగా నిర్వహించారా..? అని ప్రశ్నిస్తున్నారని కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ ను ఉద్దేశించి విమర్శించారు. పేదల కోసం నీతి వంతమైన రాజకీయాలు చేస్తున్నామని, కాపాలదారు గా పని చేస్తున్నామ‌ని మ‌రోసారి ఆశీర్వ‌దించాల‌ని కోరారు.

జోత్యిష్య పాల‌న‌
తెలంగాణలో జ్యోతిష్య పాల‌న సాగుతోంద‌ని విమ‌ర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నీ జాతకం బాగాలేదని ఎన్నికలు సకాలంలో జరిగితే నష్టపోతావని జోతిష్కుడు చెప్పినందుకు కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని తెలిపారు. ఎన్నికలకు ముందస్తుగా వెళ్లినా మంత్రివర్గాన్ని మాత్రం మూడు నెలలకు ఏర్పాటు చేసి, పాలనా వ్యవస్థను నిస్తేజం చేశారని ఆరోపించారు. ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే ఏప్రిల్ నెలలో టీఆర్ ఎస్ పార్టీ ముక్కలుగా చెలిపోయెని తెలిపారు. కాంగ్రెస్ మాదిరిగానే స్వార్థపరమైన కుటుంబ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు చెప్పండి తెలంగాణ భవిష్యత్తు నాయకులు నిర్ణయించాలా?జ్యోతిష్యుడు నిర్ణయించాలా? తెలంగాణ ఉజ్వల భవిష్యత్తు కోసం భాజపాతో కలిసి నడవండి దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడండని పిలుపునిచ్చారు.

సూర్యోద‌యం కావాలా..? పుత్రోద‌యం కావాలా..?

సూర్యోద‌య ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కావాలో..? పుత్రోద‌య ఆంధ్ర‌ప్ర‌దేశ్ కావాలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు నిర్ణ‌యించుకోవాల‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ సూచించారు. ప్ర‌జ‌ల‌ను విస్మ‌రించి పుత్రుడి రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం చంద్ర‌బాబు ప‌ని చేస్తున్నార‌ని ఆరోపించారు. బీజేపీకి వేసే ఓటు వల్ల ఉదయించే ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడుతుంది. పుత్రుడి రాజకీయ భవిష్యత్తుకు సూర్యాస్తమయవుతుంద‌నన్నారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబును స్టిక్క‌ర్ బాబుగా అభివ‌ర్ణించారు. కేంద్రం నుంచి వచ్చే పథకాలకు తమ స్టిక్కర్‌ అతికించుకుని తమవని చెప్పుకుంటున్నార‌ని ఎద్దేవా చేశారు. అందుకే సీఎం చంద్రబాబు స్టిక్కర్‌ బాబు అయ్యార‌ని చెప్పారు. ఈ ఎన్నికల్లో ప్రజలను విస్మరించిన వారు ఒక పక్క ఉంటే మీ కోసమే పని చేసే ఈ చౌకిదార్ మరో పక్క ఉన్నారని.. మీకు ఎవరు కావాలో తేల్చుకోండని సూచించారు. మీ ఆశీర్వాదమే మాకు ఒక శక్తి అని మీరు ప్రధాని కోసం ఓటు వేయకండి. నవ భారత నిర్మాణం కోసం ఓటేయండని మోదీ పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here