Home breaking news కాంగ్రెస్ నేత‌, మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్ @60 మృతి

కాంగ్రెస్ నేత‌, మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్ @60 మృతి

234
0
కాంగ్రెస్ నేత‌, మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్ @60 మృతి
ముఖేశ్‌గౌడ్

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్ (60) మృతి చెందారు. కొంత‌కాలంగా ఆయ‌న క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్నారు. ఆదివారం అర్ధ‌రాత్రి శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది ప‌డుతున్న ఆయ‌న‌ను కుటుంబ‌స‌భ్యులు అపోలో ఆస్ప్ర‌తిలో చేర్చారు. ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌డంతో ఆయ‌న‌కు ఐసీయూ చికిత్స చేస్తుండ‌గానే.. మృతి చెందారు. ముఖేశ్‌గౌడ్ 1959 జూలై 1న జ‌న్మించారు. 1989, 2004లో మ‌హారాజ్‌గంజ్‌, 2009లో గోషామ‌హ‌ల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి మంత్రివ‌ర్గంలో బీసీ సంక్షేమ శాఖ, మార్కెటింగ్ శాఖ‌ మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భ‌వించిన త‌రువాత 2014, 2018 ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు ముందు నుంచే ఆయ‌న అనారోగ్యం బారిన ప‌డ్డారు. ఆదివారం రాత్రి అపోలో చేరిన ఆయ‌న.. తెల్ల‌వారుజామునే మృతి చెందిన‌ట్టు సోష‌ల్ మీడియాతో పాటు ప్ర‌ధాన మీడియాలో కూడా క‌థ‌నాలు వ‌చ్చాయి. అయితే వాటిని ఆయ‌న కుమారుడు విక్రంగౌడ్ ఖండించారు. చివ‌ర‌కు ఆయ‌న మృతి చెందినట్టు మ‌ధ్యాహ్నం ప్ర‌క‌టించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here